నందనవనంలో పోలీసులు విస్తృత తనిఖీలు | LB Nagar Police conduct cardon search in Nandanavanam | Sakshi
Sakshi News home page

నందనవనంలో పోలీసులు విస్తృత తనిఖీలు

Published Sun, Sep 28 2014 8:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

LB Nagar Police conduct cardon search in Nandanavanam

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్పేట మండలం నందనవనంలో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే అనుమానితులకు చెందిన 19 బైకులు 19 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు 200 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు.

శనివారం అర్థరాత్రి ప్రారంభమైన ఈ సోదాలు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. శనివారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతల్లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు పేకాటరాయుళ్లు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement