lb nagar police
-
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు యువతుల అరెస్ట్
సాక్షి, నాగోలు: గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్బీనగర్ నుంచి సరూర్‌నగర్ పాత రోడ్డులోని హోటల్ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ముత్తవరపు శివ, సలీం ఇద్దరు గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బాలాపూర్ గుర్రంగూడలో ఉండే కొమ్మోల్ల ప్రశాంత్ వారి కింది సబ్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు సోమవారం రాత్రి హోటల్‌పై దాడి చేసి నలుగురు యువతులను, సబ్ ఆర్గనైజర్ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్ -
కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర రూపంలో దాడి చేస్తుండగా ఇదే అవకాశంగా భావించి కొందరు దుండగులు కరోనా వ్యాక్సిన్‌ను అక్రమంగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో వ్యాక్సిన్ రూ.40 వేల నుంచి లక్షకు పైగా విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటుండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా వ్యాక్సిన్ విక్రయిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెమిడిసివీర్ ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముతున్న ఆరుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెమిడిసివిర్ 6 ఇంజెక్షన్లు, నగదు రూ.5,52,000, ఒక యాక్టివా, 6 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
షైన్ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : షైన్ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం జరగడంలో నిర్లక్ష్యం వహించిన ఎండీ సునీల్ కుమార్‌రెడ్డి, ఇతర సిబ్బందిని ఎల్బీ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితులను హైకోర్టులో హాజరు పరిచిన పోలీసులపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఫైర్ యాక్సిడెంట్ అయి ఒక చిన్నారి ప్రాణం కోల్పోతే నిందితులపై 304ఎ బెయిలబుల్ కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 304 ఏ సెక్షన్‌ను 304 పార్ట్ 2 గా మార్చి నిందితులను రిమాండ్‌కు తరలించారు. (చదవండి : షైన్ ఆసుపత్రి సిబ్బంది అరెస్ట్) -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు ఏకకాలంలో దాడి చేసి నిందితులైన బషీర్ అహ్మద్, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ స్టాంపులు, 96 స్నాతకోత్సవ సర్టిఫికెట్లు , వివిధ యూనివర్సిటీల 70 విద్యా ధృవపత్రాలు, ఒక కంప్యూటర్, ప్రింటర్, హార్డ్ డిస్కులతో పాటు రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఎల్బీ నగర్లో నకిలీ పోలీసులు అరెస్ట్
హైదరాబాద్ : ఎల్బీ నగర్లో ఇద్దరు నకిలీ పోలీసులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో పలువురు వ్యక్తులను ఈ నకిలీ పోలీసులు బెదిరించి బలవంతంగా నగదు వసూళ్లు చేస్తున్నారు. దీంతో స్థానికులు, బాధితులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రైవేట్ బస్సులను అడ్డుకున్న యూనియన్ నాయకులు
హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్ చౌరస్తాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు టావెల్స్ బస్సులు అక్రమంగా ప్రయాణికులను రవాణా చేస్తూ ఆర్టీసీ ఆదాయానికి నష్టం కలిస్తున్నాయని వారు ఆరోపించారు. దీంతో ఎల్ బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
దొంగ అరెస్ట్ : కేజీ వెండి స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కేజీ వెండి, 21 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
హైదరాబాద్లోచైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టును సోమవారం ఎల్బీనగర్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో పలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ముఠా సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో చిత్రహింసలు భరించి కోలుకున్న ప్రత్యూష ఆరోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు ఎల్బీ నగర్ పోలీసులు సమర్పించారు. ప్రత్యూష ఆరోగ్య కారణాలను దృష్టిలో విచారణను వచ్చే సోమవారంకు కోర్టు వాయిదా వేసింది. చదువు మధ్యలో ఆపేసి గృహహింసకు గురౌవుతున్నవారి సంఖ్య తెలపాలని రెండు రాష్ట్రాల అడ్వేకేట్ జనరల్స్ ను హైకోర్టు ఆదేశించింది. ఏపీ సర్కారును సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది. ప్రభుత్వ నిధులు బాధితులకు అందకుండా దుర్వినియోగం అవుతున్నాయని, ఆర్టికల్ 14 ఉల్లంఘన జరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కాగా ప్రత్యూష రక్షణ బాధ్యత తీసుకుంటామని హైకోర్టును అవేర్ ఫౌండేషన్ ఆశ్రయించింది. ప్రత్యూష లాంటి 14 మంది బాలికలు తమ సంరక్షణలో ఉన్నారని న్యాయస్థానానికి తెలిపింది. -
నందనవనంలో పోలీసులు విస్తృత తనిఖీలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మండలం నందనవనంలో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే అనుమానితులకు చెందిన 19 బైకులు 19 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు 200 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన ఈ సోదాలు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. శనివారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతల్లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు పేకాటరాయుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. -
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
హైదరాబాద్: టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్‌పైన జూన్‌లో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ 18న ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తరువాత అతనిని పంపించివేశారు. -
టీవీ నటిని వేధిస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్: టీవీ నటికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపి వేధిస్తున్న ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఎస్ఐ అవినాష్‌బాబు కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీ రోడ్ నెం-2లో ఓ టీవీ నటి నివాసముంటోంది. నల్లగొండజిల్లా పెన్పాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచపల్లి భరత్ కొత్తపేట మోహన్‌నగర్‌లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. ఇతను కొంతకాలంగా సదరు టీవీ నటి ఫోన్‌కు అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 15న రాత్రి 7.30కి మెస్సేజ్ పంపాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసి భరత్‌ను రిమాండ్‌కు తరలించారు. -
దినేష్ రెడ్డితో పోలీసుల దురుసు ప్రవర్తన
మాజీ డీజీపీ, మల్కాజ్గిరి లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డిపై ఎల్బీ నగర్ పోలీసులు బుధవారం దురుసుగా ప్రవర్తించారు. ఎల్బీనగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.... ఎందుకు వారికి అనుమతించడం లేదని దినేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.ఆ క్రమంలో మాజీ డిజీపీ దినేష్ రెడ్డితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. దాంతో ఆ పార్టీ ఏజెంట్‌పై పోలీసులు దాడికి దిగారు. దాడికి దిగిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోకి ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న సంగతి తెలిసిందే. -
ఖాకీనంటూ క్యాష్తో పరార్
నాగోలు: ‘నేను పోలీసును..వాహనపత్రాలు చూపించడని’ ఓ వృద్ధుడి నుంచి రూ.2.90 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన పెద్దిబొట్ల భాస్కరశర్మ (79) రిటైర్డ్ లెక్చరర్. స్థానికంగా ఫ్లాటు కొనుగోలు చేసేందుకు చైతన్యపురిలోని ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్లకు వెళ్లి మంగళవారం రూ.2.90 లక్షలు డ్రా చేసుకొని..తన స్కూటీ (ఏపీ29ఏపీ 9714) డిక్కీలో పెట్టారు. తన వాహనంపై ఉప్పల్‌కు వెళ్తుండగా నాగోలు బ్రిడ్జి సమీపంలోకి రాగానే బైక్‌పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను పోలీసునని భాస్కరశర్మను పరిచయం చేసుకుని వాహనం పత్రాలు చూపించాలని అడిగాడు. అనంతరం మీ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారమందిందని, వాహనాన్ని తనిఖీ చేయాలని డిక్కీ తెరిచాడు. అప్పటికే డిక్కీ కవర్లో ఉన్న రూ.2.90 లక్షలు తీసుకొని రెప్పపాటులో ఉడాయించాడు. ఘటన నుంచి తేరుకున్న భాస్కర్‌శర్మ వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ.. ఖైరతాబాద్: గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..నీపై కేసులున్నాయని ఓవ్యక్తిని తాను టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌అంబర్‌పేట్‌లో నివాసముండే కలహరిరెడ్డి(24) ఈవెంట్ మేనేజర్ . చెన్నమల్లప్ప అనే వ్యక్తికి తాను టాస్క్‌ఫోర్స్ పోలీసునని బెదిరించి..నీవు గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..అయినా అదే దందా కొనసాగిస్తున్నావు మళ్లీ నీపై కేసు లేకుండా చేయాలంటే రూ.లక్ష కావాలని చెన్నమల్లప్పను డిమాండ్ చేశాడు. దీంతో ఈనెల 15న షాదాన్ కాలేజీ సమీపంలోని కుషాల్ టవర్స్ వద్దకు స్కార్పియోకారు (ఎపి36ఎఫ్6688)లో వచ్చి చెన్నమల్లప్ప వద్ద ఉన్న రూ.30వేల నగదు, ఏటీఎం కార్డులోంచి మరో రూ.7వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డబ్బులివ్వాలంటూ వేధిస్తుండడంతో అనుమానంతో చెన్నమల్లప్ప సోమవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. నిఘా ఉంచిన పోలీసులు మంగళశారం కలహరిరెడ్డిని అరెస్ట్‌చేసి అతడ్నించి రూ.37వేలు నగదు, సెల్‌ఫోన్, కారును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.