
టీవీ నటిని వేధిస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్: టీవీ నటికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపి వేధిస్తున్న ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఎస్‌ఐ అవినాష్‌బాబు కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీ రోడ్ నెం-2లో ఓ టీవీ నటి నివాసముంటోంది. నల్లగొండజిల్లా పెన్‌పాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచపల్లి భరత్ కొత్తపేట మోహన్‌నగర్‌లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు.
ఇతను కొంతకాలంగా సదరు టీవీ నటి ఫోన్‌కు అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 15న రాత్రి 7.30కి మెస్సేజ్ పంపాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసి భరత్‌ను రిమాండ్‌కు తరలించారు.