Television Actress
-
క్యూట్‌గా మెరిసిపోతున్న 'బిగ్ బాస్' ఫేమ్ అమర్ దీప్ సతీమణి తేజశ్విని (ఫోటోలు)
-
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని జరిగిన ఈ వేడుకలో ఆమె నిఖిల్ పటేల్‌ను వివాహమాడారు. తాజాగా వీరిపెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతకు ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల్లో పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు.ఇటీవలే బిగ్ బాస్- 16లో పాల్గొన్న నటుడు షాలిన్ భానోత్‌ను దల్జీత్ కౌర్ ఇదివరకే వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత తన కుమారుడు జేడన్తో కలిసి కెన్యాలోని నైరోబీకి మారనున్నారు దల్జీత్ కౌర్. 2014లో దల్జీత్, షాలిన్లకు బాబు జన్మించారు. ఆమె ఫిబ్రవరిలోనే నిఖిల్ పటేల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే నిఖిల్ పటేల్‌కు ఇదివరకే పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పదమూడేళ్ల అరియానా, ఎనిమిదేళ్ల ఆనిక ఆయన సంతానం. మెహందీ ఫంక్షన్లో ఇద్దరు అమ్మాయిలు పాల్గొన్నారు. కాగా.. నిఖిల్‌ను దుబాయ్‌లో ఓ పార్టీలో కలిసిన దల్జీత్ కౌర్.. ఆ తర్వాత జనవరిలో నేపాల్‌లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by DALLJIET KAUR PATEL ੴ (@kaurdalljiet) -
Maternity Photoshoot: ట్రెండ్.. ప్రెగ్నెన్సీకి గ్లామర్ .. ఫొటోషూట్‌కు అదే అనువైన సమయం!
అమ్మ అవడం అనే వరాన్ని ముందస్తుగా పదిలం చేసుకోవాలనే ఆరాటం ఇటీవల సోషల్ మీడియా పోస్టుల్లో విరివిగా కనిపిస్తోంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడనే సూచనను నలుగురికి తెలియజేయాలనే తపనతో పాటు, గర్భంతో ఉన్న అందమైన ఫొటోలను సంతోషంగా షేర్ చేస్తున్నారు. వెండితెర, బుల్లితెర నటీమణులు కూడా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. గర్భం అనేది స్త్రీకి జీవితంలో ఒక ప్రత్యేక దశ. తల్లిగా మారే ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఆనందాన్ని నింపుతుంది. ఇటీవల నటి కాజల్ అగర్వాల్, శ్వేతా అగర్వాల్‌ల బేబీ బంప్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వారిలాగే ఫొటో షూట్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెటర్నిటీ ఫొటోషూట్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలనుకునే ట్రెండ్ జోరందుకుంది. కాలేజీ, ఉద్యోగం, పెళ్లిరోజులను ఎంజాయ్ చేయడం ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా ప్రెగ్నెన్సీని పండగలా జరుపుకోవడం నేటి రోజుల్లో అతి ముఖ్యమని ఈ ఫొటోలు చూపుతున్నాయి. ఈ ఫొటోషూట్స్ కోసం ఫొటోగ్రాఫర్లు తమ స్టూడియోలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. విభిన్న రకాల డ్రెస్ డిజైన్లనూ గర్భవతుల కోసం రూపొందిస్తున్నారు. అనువైన సమయం ‘బేబీ బంప్ ఫొటో షూట్‌కి ఏడు–ఎనిమిది నెలల సమయం అనువైనది’ అంటున్నారు హైదరాబాద్‌లో బేబీ, ప్రెగ్నెన్సీ ఫొటోగ్రాఫర్‌గా పేరొందిన మనోజ్ఞ. ‘ఈ సమయంలో పొట్టభాగం బాగా కనిపిస్తుంది. పసిపిల్లలను ఫొటోషూట్ చేయడం కన్నా ఇది త్వరగా పూర్తవుతుంది కాబట్టి గర్భవతులకు అలసట ఏమీ ఉండదు. డ్రెస్ కలర్స్, డిజైన్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఒక కలర్ థీమ్‌తో అన్ని సైజుల డ్రెస్సులను డిజైన్ చేసి ఉంచుతాను. ఇందుకు విదేశీ డిజైనర్స్‌తోనూ చర్చలు జరుపుతాను’ అంటారీమె. ఎందుకు పెరుగుతోంది అంటే.. ‘కాబోయే తల్లితండ్రులు తమ జీవితంలోకి అడుగిడబోయే కొత్త అతిథిని విభిన్న రకాలుగా ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతుంటారు. కొందరు తమ చేతులపై పసిపాప మెహెందీ డిజైన్ చేయించుకొని, ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని పంచుకుంటారు. తమ ప్రెగ్నెన్సీ వార్తలను రకరకాలుగా షేర్ చేయడం లాగే మెటర్నిటీ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు’ అంటారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించి తమ స్టూడియోని ప్రెగ్నెన్సీ షూట్‌కి అనువుగా మార్చుకున్నామని చెబుతున్నారు. థీమ్‌లకు పెరిగిన డిమాండ్ కాన్సెప్ట్ షూట్, బ్యాక్‌డ్రాప్ మొత్తం సాదాగా ఉండేలా, ఒంటరిగా దిగే సొలో థీమ్, బోహో థీమ్, డ్రేప్ షాట్.. వంటి థీమ్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి అంటున్నారు ఫొటోషూట్స్ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఫొటో షూట్ల సమయంలో హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్ వరకూ ప్రతి దానికీ తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఫొటోషూట్ ఖర్చు కూడా ప్రొడక్షన్ హౌజ్, థీమ్, అందులో ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ విషయంలో ఖర్చుకు వెనకాడటం లేదన్నది వాస్తవం. ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్లో.. ప్రీ వెడ్డింగ్ షూట్ వీలుపడనివారు ఈ ప్రెగ్నెన్సీ షూట్ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రసవం తర్వాత కంటే గర్భంతో ఉన్నప్పుడు జంటగా ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలావరకు బ్రైట్ కలర్స్, ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్‌కి మొగ్గు చూపుతున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కి 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఔట్‌డోర్ అయితే గర్భిణులు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. అదే, స్టూడియోలో అయితే విశ్రాంతి తీసుకుంటూ ఫొటోషూట్ పూర్తి చేయవచ్చు. దానికి తగిన విధంగా స్టూడియో థీమ్ ఉంటుంది. శారీస్‌తోనూ ఫొటోషూట్ చేస్తాం. కానీ, సీమంతం సమయంలో తీసే ఫొటోలతో గర్భిణులు సంతృప్తిపడతారు. అందుకే చాలా వరకు వెస్ట్రన్వేర్లో కనిపించాలనుకుంటారు. లాంగ్ ఫ్లయింగ్ స్టైల్ ప్లెయిన్ గౌన్లను బాగా ఇష్టపడుతున్నారు. – మనోజ్ఞారెడ్డి, ఫొటోగ్రాఫర్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ -
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ టీవీ నటి..
ప్రముఖ టెలివిజన్ నటి అస్మిత పెళ్లి పీటలు ఎక్కారు. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలం క్రితమే తాను సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ఆస్మిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి వివాహం జరగగా.. శనివారం రోజున వీరి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పంజరం, పద్మవ్యుహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాహలక్ష్మి, మనసు మమత.. సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సీరియళ్లలో మాత్రమే కాకుండా అతిథి, కలెక్టర్ గారి భార్య, మధుమాసం.. చిత్రాల్లో కూడా నటించారు. -
షూటింగ్లో నాకూ అలాగే జరిగింది : నటి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపులపై టీవీ నటి సప్నా పబ్బీ నోరు విప్పారు. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదని ఆమె వాపోయారు. నానా పటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించారు. అనిల్‌కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘24’ సిరీస్‌లో సప్నా నటించారు. 24 చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో తెలుపుతూ సప్నా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. (ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి) వెకిలి నవ్వులు.. పాటకు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక బిగుతైన బికినీ వేసుకోవాల్సి వచ్చిందనీ, అది తనకెంతో అన్‌కంఫర్ట్‌గా అనిపించిందని సప్నా పేర్కొన్నారు. ఆ ఇబ్బందికి పరిష్కారంగా నేనొక చిన్న సలహా ఇస్తే ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. పైగా తన మాటలకు దర్శకుడు, స్టైలిస్ట్ (లేడీ) వెకిలిగా నవ్వి తనను మరింత బాధపెట్టారని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 7 గంటలపాటు ఆ బికినీ ధరించాల్సి రావడంతో.. ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చిందని సప్నా తన పోస్టులో ఆవేదన చెందారు. తనకు తోడుగా నిలవాల్సిందిపోయి.. నా స్టైలిస్ట్ దర్శకుడితో కలిసి జుగుప్సాకరంగా నవ్విందని మండిపడ్డారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ ప్రోగ్రాం నుంచి తనను తొలగిస్తారనే భయంతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపారు. కాగా, నటుడు నానా పటేకర్‌తో పాటు దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై తనుశ్రీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (చదవండి : నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..) -
నటి ప్రియాంక ఆత్మహత్య
తమిళనాట పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్లో ‘వంశం’ లాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్‌తో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఈ రోజు (బుధవారం) వలసరవక్కాం లోని ఆమె ఇంటికి పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నటి ఫొటోలను మార్ఫింగ్ చేసి..
కోల్‌కతా: గుర్తుతెలియని వ్యక్తులు బెంగాలీ పాపులర్ టీవీ నటి మధుమిత చక్రవర్తి ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మధుమిత శుక్రవారం కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేసినట్టు మధుమిత పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కనీసం 100 ఫొటోలను అప్లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫొటోలను పోస్ట్ చేసిన వెబ్ పేజీ బంగ్లాదేశ్‌కు చెందినవారిదిగా గుర్తించారు. రెండు వేర్వేరు ఫొటోలు తీసుకుని, మధుమిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని పోలీసులు చెప్పారు. ఈ ఫొటోలను ఎక్కడ, ఎవరు అప్లోడ్ చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
టీవీక్షణం: యాంకర్‌గా ఫెయిలైందా?!
చాలామంది యాంకర్లు నటీమణులుగా కూడా అదరగొడుతుంటారు. కొందరు నటీమణులు యాంకర్లుగా మారి అలరిస్తుంటారు. అయితే అందరూ అన్నింట్లో విజయం సాధిస్తారని చెప్పలేం. కొందరు ఫెయిలవుతారు... ద్రష్టి ధామిలాగా. టెలివిజన్ ప్రపంచంలో ద్రష్టికి ఓ స్థానం ఉంది. ఆమె చేసే సీరియల్‌కి ఆమె పోషించే పాత్ర పేరే ఉంటుంది. తనకిచ్చిన ఆ ప్రాధాన్యతను వృథా చేయదామె. అద్భుతంగా నటించి సీరియల్‌ని హిట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘గీత్’ చేసినప్పుడు అందరూ ఆ పేరుతోనే పిలిచారామెని. ఇప్పుడు ‘మధుబాల’ చేస్తుంటే మధుబాలా అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. అందుకే మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకుంది. అయితే నటిగా ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ద్రష్టి... యాంకర్‌గా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది. కలర్స్‌లో ప్రసారమవుతోన్న ‘ఝలక్ దిఖ్లాజా’ 7వ సిరీస్‌కి హోస్ట్‌గా ఎంపికైంది ద్రష్టి. అయితే ప్రేక్షకుల్ని అల రించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఆమెను షో నుంచి తొలగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో ప్రముఖ యాంకర్ మనీష్ పాల్ని తీసుకున్నారు. ద్రష్టిని తీసేయడం ఆమె అభిమానుల్ని బాధించింది. కానీ ద్రష్టి మాత్రం తన ఓటమిని నిజాయతీగా ఒప్పుకుంది. ‘నా స్థానంలో వేరొకరిని తీసుకుంటున్నామని ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు నేనేమీ బాధపడలేదు, అందరూ అన్నీ చేయలేరు, నేను దీన్ని సరిగ్గా చేసివుండకపోవచ్చు, ఆ నిర్ణయం తీసుకునే హక్కు వారికుంది’ అంటూ నవ్వుతూ చెప్పింది. యాంకర్‌గా ఫెయిలైతేనేం... ఈ ఒక్కమాటతో వ్యక్తిగా డిస్టింక్షన్లో పాసయ్యింది! -
టీవీ నటిని వేధిస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్: టీవీ నటికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపి వేధిస్తున్న ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఎస్ఐ అవినాష్‌బాబు కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీ రోడ్ నెం-2లో ఓ టీవీ నటి నివాసముంటోంది. నల్లగొండజిల్లా పెన్పాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచపల్లి భరత్ కొత్తపేట మోహన్‌నగర్‌లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. ఇతను కొంతకాలంగా సదరు టీవీ నటి ఫోన్‌కు అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 15న రాత్రి 7.30కి మెస్సేజ్ పంపాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసి భరత్‌ను రిమాండ్‌కు తరలించారు. -
చిట్టీల రాణి, మరో ఏడుగురు అరెస్టు
హైదరాబాద్: చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా ముంచారనే కేసులో బుల్లితెర నటి బత్తుల విజయరాణితో పాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీసీఎస్ అదనపు డీసీపీ (ఓఎస్డీ) ఇ.సుప్రజ, డీసీపీ పాలరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న విజయరాణి నాలుగేళ్ల నుంచి అనధికారికంగా రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకున్నా చిట్టీలు నిర్వహించేది. దీంతో నష్టాలు రావడంతో వాటిని భర్తీ చేసేందుకు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంది. ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించడానికే పోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో తమకు డబ్బులు చెల్లించాలని రుణదాతలు కొందరు బెదిరించడంతో గత నెల ఆమె కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు పారిపోయింది. సుమారు 80 మంది బాధిత ఆర్టిస్టులు రూ. 10 కోట్ల వరకు మోసపోయామంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గత నెల 14న విజయరాణితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో విజయరాణి కొడుకు చరణ్, కోడలు రేవతి, చెల్లెలు సుధారాణి, ఆమె భర్త చైతన్య, స్నేహితులు హరిబాబు, కట్టా మల్లేష్ గౌడ్, న్యాయవాది శ్రీనివాస్ ఉన్నారు. వారందర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉందని, ఆమె 78 మందికి సుమారు రూ. 2.20 కోట్లు చెల్లించాల్సి ఉందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టులో ఉన్న ఆమె ఇల్లును జీపీఏ చేసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. నేనూ బాధితురాలినే: విజయరాణి ‘‘నేను ఎవర్నీ మోసం చేయలేదు. శక్తికి మించిన వడ్డీలు కట్టడానికి అప్పులపై అప్పు చేశాను. చివరికి నా కుటుంబానికి తినడానికి చిల్లిగవ్వ లేకుంటే పోలీసులే తిండి పెట్టారు. చిట్టీలు ఎత్తుకున్న వారు తిరిగి డబ్బు చెల్లించలేదు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని వడ్డీ వ్యాపారులు బెదిరించినందుకే పారిపోయాను. నేను కూడా బాధితురాలినే..’’ అంటూ విజయరాణి మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది -
హైటెక్ వ్యభిచారంలో బుల్లితెర నటి శ్రావణి.. రెస్క్యూ హోంకు తరలింపు
రాష్ట్ర రాజధానిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ ప్రాంతంలో హైటెక్ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స టీమ్) పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ‘లయ’, ‘హిమబిందు’ సీరియళ్లలో నటించిన శ్రావణితో పాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసు వివరాలను ఎస్వోటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. బంజారాహిల్స్ కు చెందిన మధు అలియాస్ మదన్ మాదాపూర్‌లోని ఫార్చ్యూన్ టవర్‌సలో ఫ్లాట్ నెంబర్ 203ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్నాడు. సమాచారమందుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం ఫార్చ్యూన్ టవర్‌సపై దాడి చేయగా టీవీ సీరియల్ ఆర్టిస్టు, గుంటూరుకు చెందిన శ్రావణి(23), జీడిమెట్లకు చెందిన ‘జయరాజ్ స్టీల్ కంపెనీ’ యజమాని సజ్జన్‌కుమార్ గోయెంక(55) పట్టుబడ్డారు. దాడిని పసిగట్టిన మదన్ పరారయ్యాడు. అతని సహాయకుడు వెంకటరమణ(20)ను పోలీసులు అరెస్టు చేశారు. టీవీ ఆర్టిస్టుతో ఒక రోజు గడిపేందుకు రూ. లక్ష చెల్లించేలా మదన్, గోయెంక మధ్య ఒప్పందం కుదిరింది. పోలీసులు గోయెంక నుంచి రూ.2 లక్షలు, రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గురువారం నాడు శ్రావణిని రెస్క్యూహోంకు తరలించగా, మదన్ ను రిమాండుకు పంపారు.