
ప్రముఖ టెలివిజన్ నటి అస్మిత పెళ్లి పీటలు ఎక్కారు. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలం క్రితమే తాను సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ఆస్మిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి వివాహం జరగగా.. శనివారం రోజున వీరి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పంజరం, పద్మవ్యుహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాహలక్ష్మి, మనసు మమత.. సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సీరియళ్లలో మాత్రమే కాకుండా అతిథి, కలెక్టర్ గారి భార్య, మధుమాసం.. చిత్రాల్లో కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment