నటి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. | Police files case in 'morphed' nude photos of Bengali actress | Sakshi
Sakshi News home page

నటి ఫొటోలను మార్ఫింగ్ చేసి..

Published Fri, Aug 19 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

నటి ఫొటోలను మార్ఫింగ్ చేసి..

నటి ఫొటోలను మార్ఫింగ్ చేసి..

కోల్కతా: గుర్తుతెలియని వ్యక్తులు బెంగాలీ పాపులర్ టీవీ నటి మధుమిత చక్రవర్తి ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మధుమిత శుక్రవారం కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేసినట్టు మధుమిత పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కనీసం 100 ఫొటోలను అప్లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫొటోలను పోస్ట్ చేసిన వెబ్ పేజీ బంగ్లాదేశ్కు చెందినవారిదిగా గుర్తించారు. రెండు వేర్వేరు ఫొటోలు తీసుకుని, మధుమిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని పోలీసులు చెప్పారు. ఈ  ఫొటోలను ఎక్కడ, ఎవరు అప్లోడ్ చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement