హైటెక్ వ్యభిచారంలో బుల్లితెర నటి శ్రావణి.. రెస్క్యూ హోంకు తరలింపు
రాష్ట్ర రాజధానిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ ప్రాంతంలో హైటెక్ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్‌స టీమ్) పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ‘లయ’, ‘హిమబిందు’ సీరియళ్లలో నటించిన శ్రావణితో పాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసు వివరాలను ఎస్‌వోటీ ఓఎస్‌డీ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.
బంజారాహిల్స్ కు చెందిన మధు అలియాస్ మదన్ మాదాపూర్‌లోని ఫార్చ్యూన్ టవర్‌సలో ఫ్లాట్ నెంబర్ 203ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్నాడు. సమాచారమందుకున్న ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం ఫార్చ్యూన్ టవర్‌సపై దాడి చేయగా టీవీ సీరియల్ ఆర్టిస్టు, గుంటూరుకు చెందిన శ్రావణి(23), జీడిమెట్లకు చెందిన ‘జయరాజ్ స్టీల్ కంపెనీ’ యజమాని సజ్జన్‌కుమార్ గోయెంక(55) పట్టుబడ్డారు. దాడిని పసిగట్టిన మదన్ పరారయ్యాడు. అతని సహాయకుడు వెంకటరమణ(20)ను పోలీసులు అరెస్టు చేశారు. టీవీ ఆర్టిస్టుతో ఒక రోజు గడిపేందుకు రూ. లక్ష చెల్లించేలా మదన్, గోయెంక మధ్య ఒప్పందం కుదిరింది. పోలీసులు గోయెంక నుంచి రూ.2 లక్షలు, రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గురువారం నాడు శ్రావణిని రెస్క్యూహోంకు తరలించగా, మదన్ ను రిమాండుకు పంపారు.