high tech prostitution
-
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : వాట్సప్‌లో అందమైన యువతుల ఫొటోలు పంపి యువకులను ఆకర్షించి ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లమధ్య రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును మదనపల్లె టూటౌన్ పోలీసులు బయటపెట్టారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేసి యువతులను కౌన్సెలింగ్‌కు పంపనన్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలోని శివారుప్రాంతమైన చంద్రాకాలనీ గురుకుల పాఠశాల వెనుకవైపు అమ్మాజాన్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారగృహం నిర్వహిస్తోంది. బెంగళూరు, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి, వారి ఫొటోలను వాట్సప్ ద్వారా విటులకు చేరవేయడం, ఫోన్లో బేరసారాలు సాగించడం, లొకేషన్ షేర్ చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా రహస్యంగా దందా నిర్వహించేంది. ఫోన్ పే ద్వారా డబ్బులు తన ఖాతాకు వేయించుకుని వచ్చిన దాంట్లో సగం తనకు, మిగిలిన సగం యువతులకు ఇచ్చేది. ఈ క్రమంలో అమ్మాజాన్ ఇంటికి కొత్త వ్యక్తులు రాకపోకలు అధికమవడం, ఇటీవల కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడంతో స్థానికులు పోలీసులకు వ్యభిచారంపై సమాచారం అందించారు. ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు పక్కా ప్లాన్ ప్రకారం అమ్మాజాన్ ఇంటిపై నిఘావేసి పకడ్బందీగా నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాజాన్, ఇద్దరు విటులైన సాదిక్(బసినికొండ), సతీష్(చింతపర్తి)లను అరెస్ట్ చూపుతూ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్, 1956 కింద కేసు నమోదుచేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి మూడు సెల్ఫోన్లు, మూడువేల నగదు, కండోమ్ ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. యువతులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు లేదా కోర్టులో హాజరుపరిచి తదుపరి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. పట్టణంలో అపరిచితులకు, కొత్తవ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి గురించి అన్ని వివరాలు, సరైన ఆధారాలు తీసుకుని ఇవ్వాలన్నారు. ప్రజల సహకారం లేనిదే నేరాల నియంత్రణ అసాధ్యమని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే మహిళా పోలీసులు, వలంటీర్లు, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమోహన్, రామమూర్తి, రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డేటింగ్‌సైట్లు.. హైటెక్ వ్యభిచారం.. సిటీ యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపి..
సాక్షి ప్రతినిధి కర్నూలు: మనీశ్ (పేరు మార్చాం) అనే ఒక ఇంజినీరింగ్ విద్యార్థి గూగుల్లోకి వెళ్లి ‘కాల్ గర్ల్స్ మొబైల్ నంబర్స్ ఇన్ కర్నూలు’ అని ఒక సైటు తెరిచారు. అందులో కొన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటిలో ఒక నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడారు. సిటీ పేరు అడిగితే మనీశ్ కర్నూలు అని చెప్పాడు. రూ.10వేలు అవుతుంది.. అడ్వాన్స్‌గా రూ.5వేలు ఫోన్‌పేలో పంపాలని చెప్పారు. మనీశ్ ఫోన్ చేసిన నంబర్‌కు ఫొటోలు వాట్సాప్‌లో పంపారు. చదవండి: ఏసీ టెక్నీషియన్ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి.. మోసపోతానేమోననే భయంతో ఆన్లైన్లోని మరో నంబర్‌కు మనీశ్ ఫోన్ చేశాడు. ఫొటోలు తెప్పించుకుని చూశాడు. ఇలా నాలుగైదు నంబర్లు విచారించి ఫొటోలు చూసి ఒక నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.5వేలు పంపాడు. డబ్బులు పంపిన తర్వాత కర్నూలులోని మేడమ్ ఒకరు నీకు ఫోన్ చేస్తారు.. లొకేషన్ చెబుతారు.. అని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్!! .. మనీశ్ ఒక్కడే కాదు ‘డేటింగ్ ఉచ్చు’లో పడి వేల మంది చితికిపోతున్నారు. ఆధునిక యుగంలో అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకూ లావాదేవీలన్నీ మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద మోసం ‘ఆన్లైన్ డేటింగ్’! ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో 302 మిలియన్ డాలర్లు ఈ డేటింగ్ వల్ల నష్టపోతున్నారని ఎఫ్‌టీసీ(ఫెడరల్ ట్రేడ్ కమిషన్) గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే ఇది ఏ స్థాయి కుంభకోణమో ఇట్టే తెలుస్తోంది. జనాభా అధికంగా ఉండి, స్మార్ట్ఫోన్లను ప్రపంచంలో అత్యధికంగా వాడే ఇండియా, చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఇండియాలో ఏడాదిలో ఏకంగా రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా. కర్నూలు, నంద్యాల జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు 1,637మంది బాధితులు రూ.8.77కోట్లు నష్టపోయారు. వీరంతా విధిలేక ఫిర్యాదు చేసిన వారే. భయంతో, పరువు పోతుందని పోలీసులను ఆశ్రయించనివారు వేలల్లో ఉంటారు. వీరు కనీసం రూ.వందకోట్లు నష్టపోయి ఉంటారు. డేటింగ్సైట్లలో వివరాల నమోదు ఆన్లైన్ బుకింగ్‌లో మరొక పద్ధతి ఉంది. డేటింగ్ సైట్ తెరవగానే అందులో పేరు, జెండర్, మెయిల్ ఐడీ వివరాలు ఎంటర్ చేయాలి. ఈ వెబ్సైట్లలోకి వెళితే ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు మొత్తం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందులో జెండర్, వయస్సు ఆధారంగా ప్రొఫైల్స్ ఉంటాయి. ఏ వయస్సు వారికి ఎంత వయస్సు ఉన్నవారు కావాలి? అమ్మాయి ఇన్కాల్ లేదా ఔట్కాల్ అనే ఆప్షన్ ఉంటుంది. అన్నీ పూర్తి చేసి అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ నంబర్ పనిచేయదు. ఇలా 80 శాతం సైట్లు అడ్వాన్స్ పేరుతో నగదును బదిలీ చేయించుకుని ఆపై నంబర్ బ్లాక్ చేస్తారు. లోకల్ నంబర్.. హైటెక్ వ్యభిచారం డేటింగ్సైట్లలో కొందరు ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరు తెలుగులో మాట్లాడతారు. ఫొటోలు పంపాలంటే అడ్వాన్స్‌గా రూ. వెయ్యి ఫోన్‌పేలో పంపాలి. ఆపై ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్రస్ చెబుతారు. అక్కడకు వెళితే తీసుకెళతారు. అక్కడ ఫోన్లో మాట్లాడుకున్న డబ్బులు ఫోన్‌పేలోనే చెల్లించాలి. ఆపై అమ్మాయిలను చూపిస్తారు. ఆపై మళ్లీరేటు చెబుతారు. ‘అదేంటి? మాట్లాడుకున్న డబ్బులు చెల్లించాను కదా?’ అని అడిగితే ‘అది ఎస్కార్ట్చార్జ్(మీడియేటర్). ఇక్కడ మేడం(కాల్‌గర్ల్)కు ఇవ్వాలి? లేకపోతే వెళ్లండి? అని తేల్చేస్తారు. ఎలాగూ డబ్బు పోయిందని మరికొంత చెల్లిస్తారు. ఇలా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి పిలిపిస్తారు. కలకత్తా, డార్జిలింగ్, మణిపూర్, నాగాలాండ్, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి యువతులు వస్తుంటారు. ఇన్కాల్, ఔట్ కాల్ సర్వీసు పేరుతో వారు హోటల్ లేదంటే పర్సనల్ రూంకు వచ్చే ఏర్పాటును ‘ఎస్కార్ట్స్’(మధ్యవర్తులు) చేస్తారు. నొయిడా, గుర్గావ్, బిహార్, గుజరాత్, కలకత్తా నుంచి ఎక్కువగా డేటింగ్ నడుస్తోంది. మొబైల్స్‌కు వారే ఫోన్ చేస్తారు. డేటింగ్ తీరుతెన్నులు వివరిస్తారు. మీ ప్రాంతం ఏది? అని అడిగి, ఆ సిటీలోని కొన్ని ప్రాంతాల పేర్లు చెబుతారు. అక్కడ కొంతమంది మేడమ్స్ ఉన్నారని, మెంబర్íÙప్ తీసుకుంటే వారి నంబర్లు ఇస్తామని, వారితో ఫోన్లో మాట్లాడి రిలేషన్ చేయొచ్చని ముగ్గులోకి దించుతారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది మెంబర్‌షిప్‌లు ఉంటాయి. మూడు నెలలకు రూ.3,500, ఆరు నెలలకు రూ. 5 వేలు, ఏడాదికి రూ.7వేలు ఫీజు తీసుకుంటారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఈ నంబర్లు కూడా పనిచేయవు. ‘స్మార్ట్’ డీల్ గూగుల్లోకి వెళ్లి ‘ఆన్లైన్ డేటింగ్’ అని టైప్ చేస్తే సైట్లు కన్పిస్తాయి. వీటితో పాటు ప్రాంతాన్ని బట్టి ‘కాల్‌గర్ల్స్ మొబైల్ నంబర్స్ ఇన్ కర్నూలు’ అని టైప్ చేస్తే ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే రేటు, ఇతర వివరాలు వివరిస్తారు. రేటు కుదిరాక వాట్సాప్‌లో ‘హాయ్’ అని టైప్ చేస్తే ఫొటోలు పంపిస్తారు. ఫొటోను బట్టి రేటు ఫిక్స్ చేస్తారు. అందులో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఆన్లైన్లో చెల్లించాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా లావాదేవీలు సమయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. ‘షార్ట్ టైమ్’(గంట), మూడు గంటలు, ఫుల్నైట్ అని మూడు రకాలు డీల్స్ ఉంటాయి. ఈ వివరాలు వాట్సాప్‌కు పంపిస్తారు. ఇందులో షార్ట్ టైంకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, మూడు గంటలైతే రూ.7వేల నుంచి రూ. 10వేల వరకు, ఫుల్నైట్కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు నిర్ణయిస్తారు. సైట్లను బట్టి రేట్లలో తేడాలు ఉన్నాయి. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించాలి. డబ్బు పంపిన తర్వాత ఫోన్ పనిచేయదు. నంబర్‌ను బ్లాక్ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్‌పే అకౌంట్లన్నీ ఫేక్ ఈ తరహా నేరాలను ‘రొమాన్స్ స్కామ్స్’ ‘హనీట్రాప్’గా పోలీసులు పరిగణిస్తారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. దీంతో పోలీసులు సైబర్ మిత్ర, పోలీసు వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చారు. డీజీ ఆఫీసు నుంచి ఈ ఫిర్యాదులను మానిటర్ చేస్తారు. వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఈ తరహా నమోదైన కేసుల ఆధారంగా కర్నూలు జిల్లా పోలీసులు ఫోన్‌పే, గూగుల్‌పే వివరాలతో ఆ ప్రాంతాలకు వెళ్లారు. వివరాలు ఆరా తీస్తే ఈ తతంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల వివరాలు తెలుస్తున్నాయి. ఆధార్, బ్యాంక్ ఐడీలు వారికి తెలీకుండానే వారి ఐడీలతో ఫేక్ అకౌంట్లు సృష్టించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జీవితాలు ఛిన్నాభిన్నం ఇంజినీరింగ్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించే కొందరు విద్యార్థినులు, పేద కుటుంబాల నుంచి వచ్చి హాస్టళ్లలో చదివే మరికొందరు విద్యార్థినులు ఆర్థిక అవసరాల కోసం ఈ సైట్లలోకి వెళ్లి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడి, తమది ఫలానా సిటీ అని, డేటింగ్‌కు తాము సిద్ధమని మొబైల్ నంబర్లు ఇస్తున్నారు. వీరికి నార్త్ ఇండియన్స్ ఎస్కార్ట్స్‌గా ఉంటారు. ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడతారు. సిటీని బట్టి, ఆయా సిటీలోని యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపిస్తారు. నగదు బదిలీ చేసిన తర్వాత యువతుల ఫోన్ నంబర్లు ఇస్తారు. వారు చెప్పిన అడ్రస్‌కు వీరు వెళతారు. అడ్వాన్స్ పోనూ మిగిలిన డబ్బులు యువతులకు చెల్లిస్తారు. ఈ తరహా వ్యవహారంలో చాలామంది యువతుల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. పేదరికంతో ఆర్థిక అవసరాల కోసం కొందరు, విలాసాలతో ఇంకొందరు యవ్వనాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డేటింగ్ సైట్లను నిషేధించాలని పలువురు మేధావులు కోరుతున్నారు. -
సైబరాబాద్‌లో ‘థాయ్ మసాజ్’!
- వ్యవస్థీకృతంగా సాగుతున్న స్పా దందా - ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు - 34 మంది థాయ్ మహిళల రెస్క్యూ - సూత్రధారి సిద్ధార్థ్ సహా 19 మంది అరెస్టు సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్లో హైటెక్ వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో నిర్వాహకులు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. దీనికోసం థాయ్‌లాండ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. సమాచారం అందు కున్న సైబరాబాద్ పోలీసులు ఆదివారం వరుస దాడులు చేశారు. మాదాపూర్, రాయదుర్గం, గచ్చి బౌలి ఠాణాల పరిధిలో ఉన్న 12 స్పా, మసాజ్ సెంటర్లపై ఈ దాడులు జరిగినట్లు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 34 మంది థాయ్, 21 మంది ఈశాన్య రాష్ట్రాలు, ఒక పంజాబ్ నగరానికి చెందిన 9 మందితో కలిపి మొత్తం 65 మంది యువతులను రెస్క్యూ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా... ఒక్కో స్పాలో అనేక మందికి సభ్యత్వాలు ఇస్తున్న సిద్ధార్థ్.. వారి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నాడు. ఒక్కో సంస్థలో 300 నుంచి 500 మం ది సభ్యులుగా ఉన్నారు. వీరికి గోల్డ్, సిల్వర్, రెగ్యులర్ పేర్లతో గుర్తింపు కార్డులూ జారీ చేస్తున్నాడు. స్పా, మసాజ్ సెంటర్లలో ఉండే గదుల్లోని ప్రాంతా లు పారదర్శకంగా ఉండాలి. పురుష కస్టమర్లకు మహిళలతో మసాజ్‌లు చేయించాలన్నా.. కొన్ని నిబంధనలు పాటించాలి. అయితే ఈ స్పాల్లో ఇవి పట్టించుకోవట్లేదు. సెంటర్లకు వెనుక వైపు కొన్ని రహస్య గదులూ ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక టీమ్‌ల సాయంతో ఏకకాలంలో దాడులు చేయడంతో ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్‌తో పాటు మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. ఆయా స్పాలను సీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో పర్యవేక్షణలో ఉంచారు. థాయ్ యువతులకు గాలం... ఐటీ జోన్‌లోని మూడు ఠాణాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 స్పా, మసాజ్ సెంటర్లను బంజారాహిల్స్‌కి చెందిన ట్రైపాడ్ వెర్నస్ అండ్ హీలింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని దాసరి సిద్ధార్థ్ నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొన్నాళ్ల క్రితం ముంబైలో థాయ్‌లాండ్ మహిళ కకేతో పరిచయమైంది. ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్న సిద్ధార్థ్ ఆ దేశం నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేయిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మసాజ్ సెంటర్లలో ఉద్యోగాలంటూ థాయ్ యువతులకు కకే గాలం వేస్తోంది. ఆపై వ్యాపార, విజిట్ వీసాలపై వారిని పంపిస్తోంది. నెలకు రూ.90 లక్షలు ఇలా ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చే థాయ్‌లాండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరానికి చెందిన యువతుల్ని సిద్ధార్థ్ వివిధ ప్రాంతాల్లో ఉంచుతు న్నాడు. ప్రాథమికంగా విదేశీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. ఆపై తాను నిర్వహించే స్పా, మసా జ్ సెంటర్లకు వీరిని తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతడికి మాదాపూర్, బంజారాహిల్స్, బెంగళూరుల్లోనూ స్పాలున్నాయి. సిద్ధార్థ్‌కు సర్ఫరోజ్ అలీ, వినయ్, అజయ్ సహకరిస్తున్నారు. వెంకటరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం ప్రధాన భాగస్వాములు. ఈ దందా లో సిద్ధార్థ్ ప్రతి నెలా రూ.90 లక్షల వరకు సం పాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్ ముంబై చింబూరులోనూ ఇలాంటి దందానే నిర్వహించాడు. అక్కడి పోలీసులు గత ఏడాది ఇతడితో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సిటీకి చెందిన తోట విజయ్‌కుమార్ వాంటెడ్‌గా ఉన్నాడు. దాడులు చేసింది ఈ సెంటర్లపైనే... గచ్చిబౌలిలోని సప్తా, తంత్ర, వీ, మందర, మోహ్, ఔరా స్పాలు. మాదాపూర్‌లోని ఔరా, సప్తా, తంత్ర, బ్లిజ్, మోహ్, న్యూ రివైవ్ స్పాలు. ఈ కోణాల్లో దర్యాప్తు ఆన్లైన్ బుకింగ్స్, నగదు లావాదేవీలు, నిందితుల బ్యాంక్ ఖాతాల వివరాలు. స్వాధీనం చేసుకుంది ల్యాప్‌టాప్/కంప్యూటర్లు 10, రూ.3.38 లక్షల నగదు, 28 సెల్ఫోన్లు, 11 స్వైపింగ్ మిషన్లు, బిల్ బుక్స్ 27, డీవీఆర్లు 10తో పాటు భారీగా కండోమ్స్. -
సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం
బీజింగ్: సోషల్ మీడియాను ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 1000 మందికి పైగా సెక్స్ వర్కర్ల ఫొటోలను మోడల్స్, సినీ తారలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత మార్చి నుంచి 103 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. హాంకాంగ్ సరిహద్దుల్లోని షెంజెన్ నగరం కేంద్రంగా నెట్వర్క్ సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యాప్ ద్వారా సెక్స్ వర్కర్ల ఫొటోలు, వారి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏజెంట్ల ద్వారా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సెక్స్ వర్కర్లను మోడల్స్, సినీ తారలుగా నమ్మబలికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
హైటెక్ వ్యభిచారంలో బుల్లితెర నటి శ్రావణి.. రెస్క్యూ హోంకు తరలింపు
రాష్ట్ర రాజధానిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ ప్రాంతంలో హైటెక్ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స టీమ్) పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ‘లయ’, ‘హిమబిందు’ సీరియళ్లలో నటించిన శ్రావణితో పాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసు వివరాలను ఎస్వోటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. బంజారాహిల్స్ కు చెందిన మధు అలియాస్ మదన్ మాదాపూర్‌లోని ఫార్చ్యూన్ టవర్‌సలో ఫ్లాట్ నెంబర్ 203ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్నాడు. సమాచారమందుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం ఫార్చ్యూన్ టవర్‌సపై దాడి చేయగా టీవీ సీరియల్ ఆర్టిస్టు, గుంటూరుకు చెందిన శ్రావణి(23), జీడిమెట్లకు చెందిన ‘జయరాజ్ స్టీల్ కంపెనీ’ యజమాని సజ్జన్‌కుమార్ గోయెంక(55) పట్టుబడ్డారు. దాడిని పసిగట్టిన మదన్ పరారయ్యాడు. అతని సహాయకుడు వెంకటరమణ(20)ను పోలీసులు అరెస్టు చేశారు. టీవీ ఆర్టిస్టుతో ఒక రోజు గడిపేందుకు రూ. లక్ష చెల్లించేలా మదన్, గోయెంక మధ్య ఒప్పందం కుదిరింది. పోలీసులు గోయెంక నుంచి రూ.2 లక్షలు, రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గురువారం నాడు శ్రావణిని రెస్క్యూహోంకు తరలించగా, మదన్ ను రిమాండుకు పంపారు.