సైబరాబాద్‌లో ‘థాయ్‌ మసాజ్‌’! | 34 Thai women's rescue | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌లో ‘థాయ్‌ మసాజ్‌’!

Published Mon, Aug 21 2017 12:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

సైబరాబాద్‌లో ‘థాయ్‌ మసాజ్‌’!

సైబరాబాద్‌లో ‘థాయ్‌ మసాజ్‌’!

- వ్యవస్థీకృతంగా సాగుతున్న స్పా దందా
ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు  
34 మంది థాయ్‌ మహిళల రెస్క్యూ  
సూత్రధారి సిద్ధార్థ్‌ సహా 19 మంది అరెస్టు  
 
సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌లో హైటెక్‌ వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. స్పా, మసాజ్‌ సెంటర్‌ ముసుగులో నిర్వాహకులు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. దీనికోసం థాయ్‌లాండ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. సమాచారం అందు కున్న సైబరాబాద్‌ పోలీసులు ఆదివారం వరుస దాడులు చేశారు. మాదాపూర్, రాయదుర్గం, గచ్చి బౌలి ఠాణాల పరిధిలో ఉన్న 12 స్పా, మసాజ్‌ సెంటర్లపై ఈ దాడులు జరిగినట్లు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. 34 మంది థాయ్, 21 మంది ఈశాన్య రాష్ట్రాలు, ఒక పంజాబ్‌ నగరానికి చెందిన 9 మందితో కలిపి మొత్తం 65 మంది యువతులను రెస్క్యూ చేశామన్నారు.  
 
నిబంధనలకు విరుద్ధంగా...  
ఒక్కో స్పాలో అనేక మందికి సభ్యత్వాలు ఇస్తున్న సిద్ధార్థ్‌.. వారి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నాడు. ఒక్కో సంస్థలో 300 నుంచి 500 మం ది సభ్యులుగా ఉన్నారు. వీరికి గోల్డ్, సిల్వర్, రెగ్యులర్‌ పేర్లతో గుర్తింపు కార్డులూ జారీ చేస్తున్నాడు. స్పా, మసాజ్‌ సెంటర్లలో ఉండే గదుల్లోని ప్రాంతా లు పారదర్శకంగా ఉండాలి. పురుష కస్టమర్లకు మహిళలతో మసాజ్‌లు చేయించాలన్నా.. కొన్ని నిబంధనలు పాటించాలి. అయితే ఈ స్పాల్లో ఇవి పట్టించుకోవట్లేదు. సెంటర్లకు వెనుక వైపు కొన్ని రహస్య గదులూ ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక టీమ్‌ల సాయంతో ఏకకాలంలో దాడులు చేయడంతో ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్‌తో పాటు మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. ఆయా స్పాలను సీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో పర్యవేక్షణలో ఉంచారు.  
 
థాయ్‌ యువతులకు గాలం...  
ఐటీ జోన్‌లోని మూడు ఠాణాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 స్పా, మసాజ్‌ సెంటర్లను బంజారాహిల్స్‌కి చెందిన ట్రైపాడ్‌ వెర్నస్‌ అండ్‌ హీలింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ యజమాని దాసరి సిద్ధార్థ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొన్నాళ్ల క్రితం ముంబైలో థాయ్‌లాండ్‌ మహిళ కకేతో పరిచయమైంది. ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్న సిద్ధార్థ్‌ ఆ దేశం నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేయిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మసాజ్‌ సెంటర్లలో ఉద్యోగాలంటూ థాయ్‌ యువతులకు కకే గాలం వేస్తోంది. ఆపై వ్యాపార, విజిట్‌ వీసాలపై వారిని పంపిస్తోంది.  
 
నెలకు రూ.90 లక్షలు
ఇలా ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చే థాయ్‌లాండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరానికి చెందిన యువతుల్ని సిద్ధార్థ్‌ వివిధ ప్రాంతాల్లో ఉంచుతు న్నాడు. ప్రాథమికంగా విదేశీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. ఆపై తాను నిర్వహించే స్పా, మసా జ్‌ సెంటర్లకు వీరిని తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతడికి మాదాపూర్, బంజారాహిల్స్, బెంగళూరుల్లోనూ స్పాలున్నాయి. సిద్ధార్థ్‌కు సర్ఫరోజ్‌ అలీ, వినయ్, అజయ్‌ సహకరిస్తున్నారు. వెంకటరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం ప్రధాన భాగస్వాములు. ఈ దందా లో సిద్ధార్థ్‌ ప్రతి నెలా రూ.90 లక్షల వరకు సం పాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్‌ ముంబై చింబూరులోనూ ఇలాంటి దందానే నిర్వహించాడు. అక్కడి పోలీసులు గత ఏడాది ఇతడితో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సిటీకి చెందిన తోట విజయ్‌కుమార్‌ వాంటెడ్‌గా ఉన్నాడు.  
 
దాడులు చేసింది ఈ సెంటర్లపైనే...  
గచ్చిబౌలిలోని సప్తా, తంత్ర, వీ, మందర, మోహ్, ఔరా స్పాలు. మాదాపూర్‌లోని ఔరా, సప్తా, తంత్ర, బ్లిజ్, మోహ్, న్యూ రివైవ్‌ స్పాలు.  
 
ఈ కోణాల్లో దర్యాప్తు
ఆన్‌లైన్‌ బుకింగ్స్, నగదు లావాదేవీలు, నిందితుల బ్యాంక్‌ ఖాతాల వివరాలు. 

స్వాధీనం చేసుకుంది
ల్యాప్‌టాప్‌/కంప్యూటర్లు 10, రూ.3.38 లక్షల నగదు, 28 సెల్‌ఫోన్లు, 11 స్వైపింగ్‌ మిషన్లు, బిల్‌ బుక్స్‌ 27, డీవీఆర్‌లు 10తో పాటు భారీగా కండోమ్స్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement