సాక్షి, హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్‌కు చెందిన చాట్ల సంజీవ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో సంజీవ్ కుమారుడికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్‌ను నమ్మించారు. అమెరికాలోని వైట్ హౌస్‌లో పనిచేసే సుమంత్ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్‌కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు.
అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లి సుమంత్‌ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్‌కు చెక్కేశారు. కొత్త సిమ్ కార్డును తీసుకొని యూఎస్‌లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్ చాట్‌లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్ పత్రాలను సృష్టించి, సంజీవ్‌కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment