
కాజీపేట: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూని వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నాడు.
ఈనెల 9న మిత్రులతో కలిసి వెస్ట్‌ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడు తుండగా, వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment