సత్వరం స్పందించిన ఇండస్‌ఇండ్ బ్యాంక్
11 ఖాతాల్లోని రూ.32.89 కోట్లు ఫ్రీజ్
ముగ్గురిపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఖాతాదారుకు తెలియకుండా రూ.40 కోట్ల నగదును మ్యూల్ అకౌంట్లలోకి మళ్లించాడు ఓ బ్యాంక్ మేనేజర్. దీంతో మేనేజర్ సహా ముగ్గురిపై సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్‌లో భాగంగా ఈ అకౌంట్ నుంచి శంషాబాద్‌లోని మధురానగర్ బ్రాంచ్‌కు రూ.15 కోట్లు, రూ.25 కోట్లుగా రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతా పథకం ప్రకారమే..
రూ.40 కోట్ల నగదుతో ఈ ఏడాది జులై మొదటి వారంలో కొత్తగా తెరిచిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయింది. ఇక్కడి నుంచి దేశంలోని జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో బ్రాంచ్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ అనుమానాస్పద లావాదేవీలపై బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించగా అతని బ్యాంక్‌కు రావడం మానేశాడు. అప్పటి నుంచి అతను పరారీలోనే ఉన్నాడు. ఖాతాదారుకు తెలియకుండా డబ్బు ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు సాగుతోందని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు తెలిపారు.
సత్వర స్పందనతో రికవరీ..
అనధికారిక నగదు బదిలీని గుర్తించిన బ్యాంకు ప్రతినిధులు సత్వరమే స్పందించి నేషనల్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్‌సీసీఆరీ్ప) ద్వారా సైబర్ మోసాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర సైబర్ పోలీసులు దేశంలోని 11 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయిన రూ.32.89 కోట్లను ఫ్రీజ్ చేశారు. లేకపోతే మహారాష్ట్రలో సైబర్ మోసాల్లో ఇది అతిపెద్ద కేసుగా నిలిచేది. నిందితులు మరో రూ.4.24 కోట్ల నగదును వివిధ ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2.87 కోట్ల నగదును గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment