మనీ సర్క్యులేషన్‌ స్కామ్‌ బట్టబయలు | Cyberabad Police Bust Money Circulation Scam | Sakshi
Sakshi News home page

మనీ సర్క్యులేషన్‌ స్కామ్‌ బట్టబయలు

Published Sat, Mar 6 2021 1:08 PM | Last Updated on Sat, Mar 6 2021 7:35 PM

Cyberabad Police Bust Money Circulation Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ మనీ సర్క్యులేషన్‌ స్కామ్‌ను సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మనీ స్కీమ్‌ గ్యాంగ్‌ రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. మాదాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్లో నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. డైరెక్టర్స్‌ సహా 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్‌ చేశారు. సాయంత్రం మూడు గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.


చదవండి:
కేటీఆర్‌ పీఏనంటూ టోకరా
మిస్సింగ్‌ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement