సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం | China busts ring projecting sex workers as stars | Sakshi
Sakshi News home page

సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం

Published Fri, Dec 4 2015 6:05 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం - Sakshi

సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం

బీజింగ్: సోషల్ మీడియాను ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 1000 మందికి పైగా సెక్స్ వర్కర్ల ఫొటోలను మోడల్స్, సినీ తారలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత మార్చి నుంచి 103 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

హాంకాంగ్ సరిహద్దుల్లోని షెంజెన్ నగరం కేంద్రంగా నెట్వర్క్ సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యాప్ ద్వారా సెక్స్ వర్కర్ల ఫొటోలు, వారి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏజెంట్ల ద్వారా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సెక్స్ వర్కర్లను మోడల్స్, సినీ తారలుగా నమ్మబలికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement