vulgar messages
-
నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతికి వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి అసభ్యకర సందేశాలు పంపుతూ ఓ యువతిని వేధిస్తున్న ప్రైవేట్ ఉద్యోగిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధూలపల్లికి చెందిన మోహన్ కృష్ణ వర్మ ఫేస్బుక్ ఖాతా నుంచి మన్సూరాబాద్‌కు చెందిన ఓ యువతి ఫొటోలను డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం స్వాతిరెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని బాధితురాలి ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్‌లు పంపాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపిస్తూ బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించాడు. తన స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహన్ కృష్ణ వర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: అసభ్య సందేశాలతో దుండగుడు ఒకరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ పోలీసులను ఆశ్రయించారు. వాట్సాప్, ఎసెమ్మెస్ ద్వారా తనకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆమె ఫిర్యాదు చేశారు. దుండగుడు గత డిసెంబర్ నుంచి తనకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. నిత్యం అభ్యంతకర మెసేజ్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్టు షైనా తెలిపారు. తనలా మరొకరు వేధింపులకు గురికాకుడదన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దుండగుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు...
బంజారాహిల్స్: గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపి మానసికంగా వేధిస్తున్నాడని బుల్లితెర నటి ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకా రం... శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్.భారతి (40) టీవీ షోల్లో నటిస్తోంది. మూడు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో తాను తీవ్రమానసిక క్షోభకు గురవుతున్నానని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అసభ్యకర సందేశాలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ఓ మహిళ పట్ల అభ్యకరంగా వ్యవహరిస్తున్న యువకుడ్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్స్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు చింతల్‌బస్తీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అసభ్యకరంగా సంక్షిప్త సందేశాలను పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్థినితో ‘సెల్’గాటం
* ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువుల దాడి * అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపణ కాకినాడ క్రైం : అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించి విద్యార్థిని బంధువులు, పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ... కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ఉషోదయ మెరిట్ స్కూల్లో ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో యు.కొత్తపల్లికి చెందిన మురళి మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. స్కూల్ రికార్డుల్లో ఆ విద్యార్థిని ఫోన్ నంబర్ చూసిన ఈ ఉపాధ్యాయుడు ఆ నంబర్‌కు మెసేజ్‌లు పంపుతూ... మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు. ఇది గమనించిన ఆ విద్యార్థిని తాత తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆయన తన స్నేహితుల ద్వారా ఆ సెల్ నంబర్ చిరునామా తెలుసుకున్నాడు. ఆ ఫోన్ ఉషోదయ స్కూల్లోని తెలుగు ఉపాధ్యాయుడిదిగా గుర్తించాడు. దీంతో సోమవారం ఉదయం అతడితో మాట్లాడే పని ఉందని కొంత మంది స్కూల్ వద్దకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. స్కూల్ ప్రతినిధులు ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆకుల మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మురళిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై దాడికి పాల్పడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఉషోదయ స్కూల్లో ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువులు దాడికి పాల్పడిన సంగతి తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నాడు. ఇరు వర్గాలతో చర్చించి సమస్యను ‘సెటిల్’ చేసుకుందామంటూ పైరవీలకు దిగాడు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గుణపాఠం చెప్పకుండా సెటిల్మెంట్ వ్యవహారానికి తెరలేపేందుకు ప్రయత్నాలు సాగించిన తెలుగు తమ్ముడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీవీ నటిని వేధిస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్: టీవీ నటికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపి వేధిస్తున్న ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఎస్ఐ అవినాష్‌బాబు కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీ రోడ్ నెం-2లో ఓ టీవీ నటి నివాసముంటోంది. నల్లగొండజిల్లా పెన్పాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచపల్లి భరత్ కొత్తపేట మోహన్‌నగర్‌లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. ఇతను కొంతకాలంగా సదరు టీవీ నటి ఫోన్‌కు అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 15న రాత్రి 7.30కి మెస్సేజ్ పంపాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసి భరత్‌ను రిమాండ్‌కు తరలించారు. -
అసభ్య సందేశాలను పంపడం స్త్రీల గౌరవాన్ని హరించడమే
ఛండీఘర్: అసభ్య సందేశాలు, యువతుల అశ్లీల చిత్రాలను పంపడం.. ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం మహిళల గౌరవానికి భంగం కగిలించడంతో సమానమని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తరహా ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. సమాజానికి వినాశ హేతువులుగా మారుతున్న ఈ తరహా ఘటనలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. అమత్సర్కు చెందిన ఆదర్శ సింగ్ అనే వ్యక్తి ఓ యువతికి అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలు పంపడమేకాక, ఆమె అభ్యంతరకర చిత్రాలను ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆదర్శ్సింగ్తో పాటు మరో వ్యక్తిపై అమత్సర్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 24న కేసు నమోదు చేశారు. వీరిపై మహిళల గౌరవాన్ని భంగం కలిగించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆదర్శ్ సింగ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మహీంధర్సింగ్సుల్లార్ పై విధంగా వ్యాఖ్యానిస్తూ.. ఆదర్శ్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ఆదర్శ్‌సింగ్ పంపిన అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాల తాలుకూ ప్రతులను కోర్టుకు సమర్పించారు. బాధితురాలి వివాహాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో.. ఆ యువతికి, ఆమె బంధువులకూ ఆదర్శ్ సింగ్ అసభ్యకరమైన సందేశాలు, అశ్లీల చిత్రాలను పంపినట్టు ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి ఆదర్శ్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.