బీజేపీ నాయకురాలికి వేధింపులు | BJP's Shaina NC receives vulgar messages, files complaint against stalker | Sakshi

బీజేపీ నాయకురాలికి వేధింపులు

Published Fri, Mar 3 2017 7:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

బీజేపీ నాయకురాలికి వేధింపులు

బీజేపీ నాయకురాలికి వేధింపులు

ముంబై: అసభ్య సందేశాలతో దుండగుడు ఒకరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ పోలీసులను ఆశ్రయించారు. వాట్సాప్, ఎసెమ్మెస్ ద్వారా తనకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆమె ఫిర్యాదు చేశారు.

దుండగుడు గత డిసెంబర్ నుంచి తనకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. నిత్యం అభ్యంతకర మెసేజ్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్టు షైనా తెలిపారు. తనలా మరొకరు వేధింపులకు గురికాకుడదన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దుండగుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement