Shaina NC
-
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన ఎంపీ
శివసేన (ఏక్నాథ్ షిండే) నేత షాయినా ఎన్సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఆ వివాదంలోకి మహిళలను లాగడం ఎందుకు?
జమ్ము కశ్మీర్లో స్థానిక యువకుడికి బదులు అరుంధతీ రాయ్‌ని జీపుకు కట్టేసి ఉండాల్సిందంటూ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు షైనా ఎన్సీ ఖండించారు. ఈ వివాదంలోకి ఒక మహిళను లాగడం ఎందుకని, ఆమె సిద్ధాంతాలు ఎలాంటివైనా ఇలా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్పారు. పరేష్ రావల్‌కు తన అభిప్రాయం వెల్లడించే హక్కు ఉందని, కానీ మహిళలను ఇందులోకి లాగకుండా ఉంటే బాగుండేదని ఆమె చెప్పారు. అవతలి మహిళ ఎలాంటి సిద్ధాంతాలు పాటిస్తున్నా వాళ్లను అగౌరవపరిచేముందు ఆలోచించాలని షైనా అన్నారు. అయితే, బీజేపీకే చెందిన మరోనాయకుడు ఎస్. ప్రకాష్ మాత్రం రావల్‌కు అండగా నిలిచారు. పలు విషయాలపై ఆయన ఎప్పుడూ ట్విట్టర్లో కామెంట్లు చేస్తుంటారని, అందువల్ల దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దానిపై లేనిపోని వివాదాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్లో తమమీద పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడులు చేస్తున్నవారిపై కాల్పులు జరపడానికి బదులుగా మానవకవచంగా రాళ్లు విసురుతున్న ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నందుకు మేజర్ లితుల్ గొగోయ్‌పై ఒకవైపు విమర్శలు వస్తుండగా మరోవైపు ఆర్మీ ఆయనను సమున్నతంగా గౌరవించింది. దీనిపై అరుంధతీ రాయ్ విమర్శించడంతో ఆ వ్యక్తికి బదులు అరుంధతీరాయ్‌ని కట్టేయాల్సిందని పరేష్ రావల్ ట్వీట్ చేశారు. -
బాలీవుడ్ నటికి, బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: ఇద్దరు ప్రముఖ మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వారిలో ఒకరు బాలీవుడ్ నటి కాగా.. మరొకరు బీజేపీలో ప్రముఖ నాయకురాలు. కొంతకాలంగా వేధింపులను భరిస్తూ వచ్చిన వాళ్లిద్దరూ చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాలీవుడ్లో అలనాటి కలల రాణి సోనూ వాలియాను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె ముంబైలోని బంగూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖూన్ భరీ మాంగ్ లాంటి చిత్రాల్లో హాట్‌గా నటించిన సోను వాలియా (53), ఇప్పుడు ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతడు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు అసభ్య వీడియోలు కూడా పంపుతున్నాడని వాలియా తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వేధింపులు ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అతడిని తాను హెచ్చరించినా ఫలితం కనిపించలేదని, పైపెచ్చు అసభ్య ఫోన్ కాల్స్ మరింత పెరిగాయని అన్నారు. ఒక్కోసారి ఒక్కో నెంబరు నుంచి అతడు ఫోన్ చేస్తున్నాడని, అవేవీ ఇప్పుడు పనిచేయడం లేదని ఇన్స్పెక్టర్ శిరీష్ గైక్వాడ్ తెలిపారు. బీజేపీ నాయకురాలికి కూడా... ముంబై నగరానికే చెందిన ప్రముఖ బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీకి కూడా వేధింపులు తప్పలేదు. తనకు ఒక వ్యక్త అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షైనా.. తనకు గత డిసెంబర్ నెల నుంచి ఆ వ్యక్తి వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ముంబై బీకేసీలోని సైబర్ క్రైం విభాగంలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉండటంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల వద్దకు వెళ్లలేదన్నారు. -
బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: అసభ్య సందేశాలతో దుండగుడు ఒకరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ పోలీసులను ఆశ్రయించారు. వాట్సాప్, ఎసెమ్మెస్ ద్వారా తనకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆమె ఫిర్యాదు చేశారు. దుండగుడు గత డిసెంబర్ నుంచి తనకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. నిత్యం అభ్యంతకర మెసేజ్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్టు షైనా తెలిపారు. తనలా మరొకరు వేధింపులకు గురికాకుడదన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దుండగుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.