శివసేన (ఏక్‌నాథ్ షిండే) నేత షాయినా ఎన్‌సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.
కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్‌సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment