arvind sawant
-
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన ఎంపీ
శివసేన (ఏక్నాథ్ షిండే) నేత షాయినా ఎన్సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన ఎంపీపై కేసు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో టికెట్ దక్కని మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ ఎంపీ సంచలన కామెంట్స్ చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు అని కామెంట్స్ చేయడం వివాదం తెచ్చిపెట్టింది.మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి షాయినా ఎన్సీ టికెట్ ఆశించారు. అయితే, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా బీజేపీని వీడి షిండే వర్గం శివసేనలో చేరారు. ఆమె చేరికపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ అరవింద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ.. షాయినా ఎన్సీ ఇంతకాలం బీజేపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్ రాలేదని ఇప్పుడు మా పార్టీలో చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు(దిగుమతి చేసుకున్న మెటీరియల్). మా వస్తువులు ఒరిజినల్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, మహిళా నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఇక, ఎంపీ సావంత్ వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అరవింద్ సావంత్ వ్యాఖ్యలు బాధాకరం. ఆయన గతంలో నన్ను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారు. నేను మెటీరియల్‌ను కాదు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. సావంత్ వ్యాఖ్యలను బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది. Surprising to see @ShainaNC quitting BJP and filing her nomination from Mumbadevi as a Shiva Sena(Shinde) Candidate for #MaharashtraElection2024 Hope all is well between the current alliance partners of BJP in Maharashtra. pic.twitter.com/JeToDqqOFs— Rajesh Shenoy (@rshenoy87) October 29, 2024 -
మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేర్పండి
మీరొక మహిళ అయుండి, మీ పేరో లేక మీకు తెలిసిన మహిళ పేరో ‘నవనీత’ అయుండి.. ఆ పేరును అలానే పలకాలా లేక నవ్‌నీత అని పలకాలా లేక ఇంకోలా పలకాలా అని సందేహం వచ్చినప్పుడు మీ దరిదాపుల్లో ఉన్న ఏ పురుషుడినైనా అడిగి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. పేరు ఒక్కటే కాదు, మీ తీరు ఎలా ఉండాలో కూడా ఎనీ గన్నాయిని అడిగినా వారు చెప్పేస్తారు. అడగకున్నా చెప్పే జ్ఞానధనులు పురుషులు. బై బర్త్ ఎందుకనో వాళ్లు అలా నాలెడ్జిబుల్ గా ఉంటారు! ‘తిక్కల్’ అని మృదువుగా చేతిలోని నాలుగు వేళ్లతో స్త్రీ తలను తడితే చాలు ఇక ఏ మాత్రపు పురుషుడైనా ఆమెకు విషయ దిగ్దర్శనం చేసేయొచ్చు. అలా తనకు మాన్స్‌ప్లెయినింగ్ చేయబోయిన అరవింద్ అనే ఎంపీకి, నవనీత అనే ఎంపీ తగిన రీతిలోనే సమాధానం ఇచ్చారు. ‘‘సీఎంతో అలాగేనా మాట్లాడేది! నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో’’ అని ఆయన. ‘‘ఆడవాళ్ల బాడీల పై ధ్యాస తగ్గించి, నీ లాంగ్వేజ్ సరి చేసుకో’ అని నవనీత. చెప్పడానికి అలవాటు పడిన పురుషులు వినడానికి ఇష్టపడతారా! నవనీత పూర్తి ప్రొఫైల్ తెలిస్తే అరవింద్ సావంతే కాదు, ఎవరైనా వింటారు. నవనీత్ కౌర్ లోక్‌సభ సభ్యురాలు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. స్వతంత్ర భావాలున్న వ్యక్తి కూడా. తండ్రి ఆర్మీ ఆఫీసర్. నటిగా, మోడల్‌గా రాణించారు. పంజాబీ అమ్మాయి. ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువ సినిమాలు తెలుగువే. ‘‘సీఎంతో మాట్లాడేటప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ సరిగా లేదు’’ అని తన గురించి మహారాష్ట్ర అధికార పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ అన్నట్లు ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. ‘‘సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడేటప్పుడు మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేర్పితే నేర్చుకుంటాం’’ అని ఆమె అన్నారు. మహిళల బాడీ మీద ధ్యాస తగ్గించి, లాంగ్వేజ్‌ని అదుపులో పెట్టుకోవాలని కూడా ఆమె సావంత్‌కు సలహా ఇచ్చారు. అతడి మీద నవనీత్ చేసిన ఆరోపణ లు ఇంకా ఉన్నాయి. మనుషుల చేత ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు. జైల్లో తోయిస్తానని అంటున్నాడు. ఆసిడ్ దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నాడు. వీటన్నిటి పై ఇప్పుడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. సస్పెండ్ అయిన ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజెను అవినీతి కేసు నుంచి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తను లోక్‌సభలో ప్రస్తావించినందుకే సావంత్ తనను బెదరిస్తున్నారని ఆమె లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో మొదలైన వివాదం ఇది. సినిమా, రాజకీయాలు, వ్యక్తిగత జీవితం.. ఈ మూడింటిలో నవనీత్ వ్యక్తిగతం జీవితం మరింత స్ఫూర్తిదాయమైనది. ఆమె భర్త రవి రాణా కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన బద్నేరా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడోసారి కొనసాగుతున్నారు. ఆయనా స్వతంత్ర పార్టీ అభ్యర్థే. 2004 నుంచీ సినిమాల్లో నటిస్తున్న నవనీత 2011లో రాణాను వివాహం చేసుకున్నాక సినిమాలు మానేశారు. వాళ్ల పెళ్లి ఆదర్శవంతంగా జరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరి 3 న ముంబైలో 3720 మంది వధూవరులతో ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సవంలో వీళ్లదీ ఒక జంట! నాటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, బాబా రామ్ దేవ్ వంటి ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అప్పటికే రవి రాణా ఎమ్మెల్యే. తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నవనీత్ ఎన్.సి.పి. తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ముప్పై ఐదేళ్ల నవనీత్ ముక్కుసూటిగా ఉంటారు. ఆ స్వభావం వల్లనే మహారాష్ట్ర రాజకీయాలలో బలమైన మహిళా శక్తిగా రాణిస్తున్నారు. అంతటి మహిళను బాడీ లాంగ్వేజ్ బాగోలేదని సావంత్ అనడంపై సాధికా సెహ్గల్ అనే కాలమిస్ట్ ‘అవుటర్ఫ్లై’ అనే వెబ్సైట్లో రాస్తూ.. ‘‘పేరు ఎలా పలకాలో పురుషులే నేర్పిస్తారు. ఏ బ్రాండ్ టాంపన్లు మంచివో పురుషులే సూచిస్తారు. ఆఖరి కి కరెక్ట్ బ్రా సైజ్ ఏదో కూడా వాళ్లే చెప్పడానికి వస్తారు. ఈ మాన్స్‌ప్లెయినింగ్ ఎంతకాలం సాగుతుంది’’ అని ప్రశ్నించారు. మ్యాన్స్‌ప్లెయినింగ్ అంటే మగవాళ్లు ఆడవాళ్లకు నిరంతరం సలహాలు ఇస్తూ ఉండటం. -
కేంద్ర నిర్ణయంపై భగ్గుమన్న శివసేన
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్ఎస్సీ) ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహరాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరికాదని అభిప్రాయపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) శనివారం శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే మోదీ నినాదానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు. ఆర్థిక రాజధాని అనే మాటకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఐఎఫ్ఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించడంపై ఎన్సీపీ నేత శరత్ పవర్ కూడా తప్పబట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు. -
శివసేన నుంచి అరవింద్ సావంత్‌కు బెర్త్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా శివసేన నుంచి అరవింద్ సావంత్‌ను తన క్యాబినెట్లోకి తీసుకుంటారని ఆ పార్టీ ప్రతనిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రధానితో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా క్యాబినెట్లోకి అరవింద్ సావంత్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీతో పాటు సావంత్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పదివేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో అతిధులు తరలివస్తున్నారు. బిమ్స్టెక్ నేతలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్‌లు, వివధ రంగాల ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. -
'లాహోర్‌లో మన త్రివర్ణ పతాకం ఎగరాలి'
భారతసైన్యం నియంత్రణ రేఖ వెంబడి చేసిన దాడులను పలు రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత దూరంగా కూడా ఉంటున్న శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారంటూ శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఆగేందుకు సమయం లేదని, లాహరో వెళ్లి మరీ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఆయన అన్నారు. అంటే ఒక రకంగా పాకిస్తాన్‌ను ఆక్రమించాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా కూడా సైన్యం చర్యలను ప్రశంసలలో ముంచెత్తారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపించిన అసమాన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని ఆయన అన్నారు. ఈ శిబిరాల వల్లే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పారు. మే 9వ తేదీన, తర్వాత మళ్లీ 20, 21 తేదీలలో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, ఆటోమేటెడ్ గ్రనేడ్ లాంచర్లు, రికోయిలెస్ గన్లు ఉపయోగించినట్లు భారత సైన్యం తెలిపింది. కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో భాగంగా నియంత్రణ రేఖను పూర్తిగా డామినేట్ చేస్తోందని, ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే ప్రాంతాలను మనం టార్గెట్ చేసుకున్నామని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాలని, తద్వారా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిస్తే అక్కడి యువత మీద దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయని ఆయన అన్నారు.