ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో టికెట్ దక్కని మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ ఎంపీ సంచలన కామెంట్స్ చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు అని కామెంట్స్ చేయడం వివాదం తెచ్చిపెట్టింది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి షాయినా ఎన్‌సీ టికెట్ ఆశించారు. అయితే, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా బీజేపీని వీడి షిండే వర్గం శివసేనలో చేరారు. ఆమె చేరికపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ అరవింద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ.. షాయినా ఎన్‌సీ ఇంతకాలం బీజేపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్ రాలేదని ఇప్పుడు మా పార్టీలో చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు(దిగుమతి చేసుకున్న మెటీరియల్). మా వస్తువులు ఒరిజినల్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, మహిళా నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇక, ఎంపీ సావంత్ వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అరవింద్ సావంత్ వ్యాఖ్యలు బాధాకరం. ఆయన గతంలో నన్ను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారు. నేను మెటీరియల్‌ను కాదు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. సావంత్ వ్యాఖ్యలను బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది.
Surprising to see @ShainaNC quitting BJP and filing her nomination from Mumbadevi as a Shiva Sena(Shinde) Candidate for #MaharashtraElection2024
Hope all is well between the current alliance partners of BJP in Maharashtra. pic.twitter.com/JeToDqqOFs— Rajesh Shenoy (@rshenoy87) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment