
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా శివసేన నుంచి అరవింద్ సావంత్‌ను తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ఆ పార్టీ ప్రతనిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రధానితో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా క్యాబినెట్‌లోకి అరవింద్ సావంత్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీతో పాటు సావంత్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పదివేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో అతిధులు తరలివస్తున్నారు. బిమ్స్‌టెక్ నేతలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్‌లు, వివధ రంగాల ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment