ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్‌ఎస్సీ) ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహరాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న ముంబై నుంచి ఐఎఫ్‌ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరికాదని అభిప్రాయపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)
శనివారం శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబై నుంచి ఐఎఫ్‌ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే మోదీ నినాదానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు.
ఆర్థిక రాజధాని అనే మాటకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఐఎఫ్‌ఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించడంపై ఎన్సీపీ నేత శరత్ పవర్ కూడా తప్పబట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment