International Financial Services Centre
-
భారత్‌లో బంగారం.. అంతులేని అవకాశాల వారధి
న్యూఢిల్లీ: భారత్‌లో బంగారం రిఫైనరీ యూనిట్ల ఏర్పాటుకు ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ’ (ఐఎఫ్ఎస్సీఏ) చైర్పర్సన్ కె.రాజారామన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో బంగారం కొనుగోలుకు భారత్ అతిపెద్ద దేశంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘అతిపెద్ద కొనుగోలు దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనరీ ప్లాంట్ల ఏర్పాటుకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. రిఫైనరీ (శుద్ధి) కోసం ఏటా 250 టన్నుల ఓర్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోనూ రిఫైనరీ ప్రారంభించొచ్చు. ఇందుకోసం పన్ను విధానాలు లేదా కస్టమ్స్ టారిఫ్‌లలో కొన్ని మార్పులు అవసరం. కనుక గిఫ్ట్ సిటీలో రిఫైనింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి’’అని పేర్కొన్నారు. ఇండియన్ గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ)తో కలసి ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన బంగారం సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజారామన్ మాట్లాడారు. మన దేశం ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండగా... ఇందులో అధిక భాగం ఆభరణాలకే వినియోగమవుతోంది. మెరుగ్గా వినియోగించుకోవాలి.. బంగారంపై రుణాలు, లీజింగ్ ఎకోసిస్టమ్‌పై ఆర్బీఐతో కలసి పనిచేస్తున్నట్టు రాజారామన్ తెలిపారు. బంగారం కీలక సాధనం కావడంతో దీనికి ఇండెక్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘సామాన్యుల కప్బోర్డులలో బంగారం నిల్వ ఉంటోంది. ఆర్బీఐ ఖజానాలోనూ 800 టన్నులు ఉంది. ఆర్థిక వ్యవస్థ చలామణిలోకి ఇది రావడం లేదు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం దీన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరం’’అని పేర్కొన్నారు. అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారత్‌కు చక్కని డెలివరీ ప్రమాణాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. బంగారం మార్కెట్లో గిఫ్ట్ సిటీ పాత్ర మరింత మెరుగుపడుతుందన్నారు. -
ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభం ఈజీ
న్యూఢిల్లీ: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ... ఇంటర్నేషన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ) బ్యాంకులో ఎటువంటి పాన్ లేకుండా విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, నాన్–రెసిడెంట్లు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటును ఆర్థికశాఖ కలి్పంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల మినహాయింపు కలి్పంచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనిప్రకారం బ్యాంక్ ఖాతాను తెరిచే నాన్–రెసిడెంట్ లేదా విదేశీ కంపెనీ ఫారమ్ 60లో డిక్లరేషన్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. అలాగే భారతదేశంలో ఎలాంటి పన్ను బకాయిలను కలిగి ఉండకూడదు. జీఐఎఫ్‌టీ–ఐఎఫ్ఎస్సీ ఆర్థిక రంగానికి సంబంధించి పన్ను–తటస్థ ప్రాంతంగా ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, ఇతర నాన్–రెసిడెంట్లు ఐఎఫ్ఎస్సీ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతాను తెరవడాన్ని సులభతరం చేస్తుందని నంగియా అండర్సన్ ఎల్ఎల్పీ భాగస్వామి ( ఫైనాన్షియల్ సర్వీసెస్) సునీల్ గిద్వానీ అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్లుసహా ఐఎఫ్ఎస్సీలో రిటైల్ వ్యాపార విభాగం పురోగతికి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని గిద్వానీ చెప్పారు. -
గిఫ్ట్ సిటీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సేవలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థ ఐఎఫ్ఎస్సీలో ‘హెచ్డీఎఫ్సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ప్రారంభించింది. డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్ఆర్ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
కేంద్ర నిర్ణయంపై భగ్గుమన్న శివసేన
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్ఎస్సీ) ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహరాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరికాదని అభిప్రాయపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) శనివారం శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే మోదీ నినాదానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు. ఆర్థిక రాజధాని అనే మాటకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఐఎఫ్ఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించడంపై ఎన్సీపీ నేత శరత్ పవర్ కూడా తప్పబట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు. -
తొలి దేశీ ఐఎఫ్ఎస్సీ ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఎకానమీకి ఊతమివ్వగలదని ఆశాభావం మార్గదర్శకాలు విడుదల గాంధీనగర్: దేశీయంగా తొలి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్సీ) శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్సీ నియమ, నిబంధనలను ఆయన ఆవిష్కరించారు. ఇది గుజరాత్ ఎకానమీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమివ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌ఎస్‌సీకి అనుమతులివ్వడంలో గత యూపీయే ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందంటూ జైట్లీ విమర్శలు గుప్పించారు. అయితే, కొత్త ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో పనులు చురుగ్గా సాగాయని, ఐఎఫ్ఎస్సీ సాకారమైందని ఆయన చెప్పారు. ప్రస్తుతం గిఫ్ట్ సిటీలో తొలి దశ పనులు పూర్తయ్యాయని, మరో రెండు దశల పనులు తదుపరి చేపట్టనున్నట్లు తెలిపారు. దేశాన్ని అధిక వృద్ధి బాట పట్టించే దిశగా.. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమ, నిబంధనలను సరళతరం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి పన్ను విధానాలను అమలు చేయడంపై దృష్టి పెడుతున్నామన్నారు. సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ, ఐఆర్డీఏ చైర్మన్ టి. విజయన్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్, సింగపూర్ వెళ్లక్కర్లేదు.. ఐఎఫ్ఎస్సీ అందుబాటులోకి వచ్చినందున ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు ఇకపై దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ ఆర్థిక హబ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఏర్పాటైన అనేక స్టార్టప్ సంస్థలు దేశీ యంగా నిధుల సమీకరణ కష్టతరంగా ఉండటంతో విదేశాల వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఆయా సంస్థలు విదేశీ బాట పట్టకుండా దేశంలోనే ఉండే విధంగా తగు తోడ్పాటు అవసర మన్నారు. ఐఎఫ్ఎస్సీ ద్వారా ప్రవాస భారతీయులు (ఎన్నారై) విదేశీ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతిస్తున్నామని, అలాగే భారత్‌లోనే ఉంటూ విదేశీ మారకంలో నిధులు సమీకరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని సిన్హా పేర్కొన్నారు. మార్గదర్శకాలు... కరెన్సీ, షేర్లలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లావాదేవీల కోసం ఇన్వెస్టర్లు విదేశీ ఫైనాన్షియల్ హబ్‌లకు తరలిపోకుండా .. ఇక్కడే అవకాశాలు కల్పించేందుకు ఐఎఫ్ఎస్సీని ప్రతిపాదించారు. దుబాయ్, సింగపూర్‌లోని ఆర్థిక సర్వీసుల కేంద్రాలతో పోటీపడే రీతిలో ఐఎఫ్ఎస్సీ మార్గదర్శకాలను రూపొందించారు. వీటి ప్రకారం.. విదేశాల్లో ఏర్పాటైన సంస్థలు ఐఎఫ్ఎస్సీలోని స్టాక్ ఎక్స్చేంజీల్లో తమ షేర్లను లిస్టింగ్ చేయొచ్చు. విదేశీ మారకంలో నిధులు సమీకరించవచ్చు. ఎన్నారైలతో పాటు దేశ, విదేశాలకు చెందిన వ్యక్తులు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.