న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సీ) నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థ ఐఎఫ్‌ఎస్‌సీలో ‘హెచ్‌డీఎఫ్‌సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్‌ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ప్రారంభించింది.
డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్‌ఆర్‌ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment