amc
-
ఏఎంసీలో ఏమైంది?
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్‌లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్‌లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్‌డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్‌డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్‌లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్‌డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్‌గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
గిఫ్ట్ సిటీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సేవలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థ ఐఎఫ్ఎస్సీలో ‘హెచ్డీఎఫ్సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ప్రారంభించింది. డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్ఆర్ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. -
ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 13.5 శాతం వాటాకు సమానమైన 3.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థలు ఏబీ క్యాపిటల్ 28.51 లక్షలు, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లు చొప్పున ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఆస్తుల నిర్వహణ జేవీ.. ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ ఏప్రిల్‌లోనే సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,500–2,000 కోట్లు సమకూర్చుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. ఇప్పటికే ఏఎంసీలు.. నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యూటీఐ లిస్టింగ్ సాధించిన సంగతి తెలిసిందే. -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
అంతర్జాతీయ ట్రెండ్, ఫలితాలే ఆధారం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) కార్పొరేట్ ఫలితాలు.. దేశీ స్టాక్ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు పర్వాలేదనిపించుకోగా.. ఇండెక్స్ హెవీవెయిట్ అయిన ఐటీసీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. బుధవారం వెల్లడికానున్న ఈ సంస్థ ఫలితాలు.. శుక్రవారం విడుదలకానున్న ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ ఫలితాలు ఈవారంలో మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత విప్రో.. శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికాగా, దీని ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంపై కనిపించనుంది. క్యూ3 ఫలితాలతో పాటు కంపెనీల యాజమాన్యం చేసే వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఈవారంలో జోరుగా బ్యాంకింగ్ ఫలితాలు.. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. టీవీఎస్ మోటార్ గణాంకాలు మంగళవారం వెల్లడికానుండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫలితాలు బుధవారం.. యస్ బ్యాంక్, కాల్గేట్–పామోలివ్ (ఇండియా), అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ3 ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు పర్వాలేదు.. ‘ఆశాజనక ఫలితాలతో చాలా వరకు ఐటీ కంపెనీలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఐటీ సంస్థల క్యూ3.. అంచనాలను అధిగమించాయి. యాజమాన్యాలు చేసిన వ్యాఖ్యలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ ఫలితాల సీజన్ ఆశాజనకంగా ఉండనుందనే అంశానికి ఇవి సంకేతాలుగా ఉన్నాయి.’ అని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా–చైనాల వాణిజ్య యుద్ధం ముగిసిన సూచనలు ఏవీ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని ఇప్పటికే వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధం అంశంపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మే స్వల్ప ఆధిక్యంతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. సోమవారం మరో కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని సభ ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. ముడిచమురు ధరల ప్రభావం.. ఒపెక్ సప్లై కోత నిర్ణయాలతో గతకొంతకాలంగా క్రూడ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 61 డాలర్లను అధిగమించింది. ఈ ర్యాలీ ఇలానే కొనసాగితే, డాలరుతో రూపాయి మారకం విలువపై ఒత్తిడి కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుందని రాయిటర్స్ విశ్లేషించింది. ఈ అంశం ఆధారంగానే వడ్డీ రేట్ల కోతపై వచ్చే ఆర్బీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనుందని వివరించింది. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. ఈఏడాది జనవరి 1–18 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ నుంచి రూ. 4,040 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
‘బ్యాడ్ బ్యాంక్’కు బ్యాంకర్ల సై
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి మద్దతు లభించింది. వ్యావహారికంగా ’బ్యాడ్ బ్యాంక్’ కింద పరిగణిస్తున్న ఈ సంస్థ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఏర్పాటైన సునీల్ మెహతా కమిటీ ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు సోమవారం సమర్పించింది. ఇప్పటికే బ్యాంకులు ప్రమోట్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్సిల్ కింద ఈ తరహా ఏఎంసీని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. అలాగే, ఇందులో వెలుపలి నిపుణులను నియమించాలని ఇందులో సిఫార్సు చేసింది. అలాగే కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా.. దీని ఏర్పాటుకు ప్రజాధనం లేదా విదేశీ మారక నిల్వల నిధులను వినియోగించుకోవడం కాకుండా బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమకూర్చుకోవాలని సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఎంసీ పనితీరు ఇలా.. కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రతిపాదిత నేషనల్ ఏఎంసీ పనితీరు ఇలా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ♦ బ్యాంకుల నుంచి కొనుగోలు చేసే మొండి ఖాతాలను మదింపు చేసిన తర్వాత నేషనల్ ఏఎంసీ నిర్దిష్ట ధరను ఖరారు చేస్తుంది. ♦ సదరు అసెట్‌కి సంబంధించి ముందస్తుగా 15 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. ♦ ఆ తర్వాత అసెట్ విక్రయానికి ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, అసెట్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లు ఆహ్వానిస్తుంది. ♦ ఒకవేళ ప్రైవేట్ సంస్థ గానీ బిడ్ దక్కించుకున్న పక్షంలో.. నేషనల్ ఏఎంసీ ముందస్తుగా బ్యాం కులకు ఇచ్చిన 15% మొత్తాన్ని కూడా దానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా వేలంలో ప్రైవేట్ బిడ్డరు ఎవరూ ముందుకు రాని పక్షంలో బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగతా 85% మొత్తాన్ని ఏఎంసీనే చెల్లించేస్తుంది. ♦ ఆ తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్న అసెట్స్‌ను నిపుణుల పర్యవేక్షణలో క్రమానుగతంగా విక్రయించి నిధులు రాబట్టుకుంటుంది. గుదిబండలా మొండిబాకీలు .. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీలు 11.6 శాతానికి ఎగిశాయి. ఇవి వచ్చే మార్చి నాటికి 12.2 శాతానికి ఎగియొచ్చంటూ ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబాకీల్లో.. భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సార్ స్టీల్ వంటి కేవలం 40 కంపెనీల వాటానే దాదాపు 40 శాతం పైచిలుకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేయడంతో వీటి నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా స్వతంత్ర అసెట్ మేనేజ్మెంట్ సంస్థలను (ఏఎంసీ), స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. రూ. 500 కోట్ల పైబడిన నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిష్కారానికి ఏఎంసీ లేదా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను నెలకొల్పాలంటూ సునీల్ మెహతా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కోవకి చెందిన ఖాతాలు దాదాపు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు సుమారు రూ. 3.1 లక్షల కోట్లు బాకీపడ్డాయి. మెహతా కమిటీ నిర్దిష్టంగా బ్యాడ్ బ్యాంక్‌ను సిఫార్సు చేయలేదని, ఏఎంసీ ఏర్పాటే ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ. 50 కోట్ల దాకా మొండిబాకీలపై స్టీరింగ్ కమిటీలు, రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా బాకీలపై అంతర్‌బ్యాంకుల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి. -
ఎంఎఫ్ ఆస్తులు పదేళ్లలో.. రూ.100 లక్షల కోట్లకు!
న్యూఢిల్లీ: ఇండియన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ వచ్చే పదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేరుతుందని మహీంద్రా ఏఎంసీ అంచనా వేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ రూ.22.36 లక్షల కోట్లుగా ఉంది. ‘ప్రజలు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించొచ్చనే నిజాన్ని వీరు తెలుసుకున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయిక ఇన్వెస్ట్మెంట్ ఉత్పత్తులకు దూరం జరుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీని వల్ల పరిశ్రమ ఏయూఎం విలువ వచ్చే పదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేరొచ్చు’ అని మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. గురువారమిక్కడ ‘మహీంద్రా ఉన్నతి ఎమర్జింగ్ బిజినెస్ యోజన’ కొత్త స్కీమ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్ఎఫ్వో జనవరి 8 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ‘‘2017లో 42 యాక్టివ్ ఫండ్ హౌస్‌ల ఏయూఎం విలువ 32% పెరిగింది. గత ఐదేళ్లలో చూస్తే వీటి ఏయూఎం విలువ 24% ఎగసింది. ఏయూఎం విలువ పెరుగుతూ రావడం ఇది వరుసగా ఐదో సంవత్సరం’’ అని బిష్ణోయి వివరించారు. -
అత్యవసరమైతే నరకమే!
► క్యాజువాలిటీలో కుట్టు వేసే కిట్లకు కొరత ► ఏఎంసీలో పడకల కొరత ► అందుబాటులో లేని స్ట్రెచ్చర్లు, వీల్చైర్లు ► వార్డుబాయ్‌ల సంఖ్య అంతంతే.. ► స్పందించని అధికారులు ఏదైనా ప్రమాదంలో, దాడిలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అత్యవసర చికిత్సకు వెళ్లారా? అయితే మీలో సహనం కాస్త ఎక్కువగా ఉండాల్సిందే. ఎందుకంటే.. మరో నలుగురైదుగురు అక్కడ అప్పటికే చికిత్స పొందుతుంటే మీరు వేచి ఉండకతప్పదు. కారణం.. అత్యవసరంగా కుట్లు వేయాల్సిన కిట్లు అవసరమైనన్ని లేవు మరి. దీనికి తోడు పడకల కొరతతో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి ప్రతిరోజూ అత్యవసర చికిత్స కోసం 100 నుంచి 150 మంది దాకా వస్తుంటారు. వీరికి అక్కడ ఉండే క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు డ్యూటీ డాక్టర్లైన ఫిజీషియన్లు, సర్జన్లు, ఆర్థోపెడిస్ట్, ఇదే విభాగాల నుంచి పీజీలు, హౌస్ సర్జన్లు సేవలందించాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది అత్యవసర చికిత్స నిమిత్తం వస్తే వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తూ వస్తారు. కొన్నిసార్లు రక్తగాయాలైన వారు అధిక సంఖ్యలో వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గాయాలకు కుట్లు వేసే కిట్లు(సూటు ప్యాక్స్) లేదా 10, 20, 30 ప్రోలైన్లు కొరత ఉండటంతో రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని కొనుగోలు చేయాలని ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. ఒక్కో కిట్టు ధర రూ.500లకు మించదు. ఆసుపత్రిలో అత్యవసరం కాని పరికరాలకు లక్షల రూపాయలు వెచ్చిస్తుండగా.. రోగులకు అత్యవసర చికిత్సనందించే ఇలాంటి కిట్లకు మాత్రం నిధుల కొరతను సాకుగా చూపడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ఓపీలో ఏసీ, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అటు చికిత్స అందించే వైద్యులు, రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఏఎంసీలో బెడ్ల కొరతతో పడిగాపులు అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులకు ముందుగా క్యాజువాలిటీలో ప్రాథమిక వైద్యం అందిస్తారు. అనంతరం వీలును బట్టి రోగులను అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో చేరుస్తారు. ఏఎంసీలో 40 పడకలు ఉన్నాయి. అయితే నిత్యం ఈ పడకలు రోగులతో నిండి ఉంటాయి. క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చిన రోగిని ఏఎంసీలో చేర్చాలంటే అక్కడున్న రోగులను సాధారణ వార్డులకు తరలించాల్సి ఉంటుంది. ఒక్కోసారి రోగులందరూ ఏఎంసీలో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న సమయంలో ఎవరిని సాధారణ వార్డుకు తరలించాలో వైద్యులకు అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ధైర్యం చేసి కాస్త బాగైన రోగులను సాధారణ వార్డుకు తరలించి పడకలు ఖాళీ చేసి, క్యాజువాలిటీ రోగుల కోసం ఉంచుతున్నారు. ఏఎంసీలో బెడ్లు ఖాళీగా మారేంత వరకు క్యాజువాలిటీలోనే అవసరమైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఏఎంసీకి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో ఇప్పటికీ ఇది అనధికారికంగానే కొనసాగుతోంది. గుర్తింపు లేకపోవడంతో మెడికల్ విభాగాల నుంచి వైద్యులు రెఫరల్ పద్ధతిలో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎమెర్జెన్సీ మెడిసిన్ విభాగం మంజూరైతే గానీ రోగులకు ఇబ్బందులు తీరని పరిస్థితి నెలకొంది. స్ట్రెచ్చర్లు, బాయ్స్ కొరత క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చి వార్డు బాయ్ వస్తాడు, స్ట్రెచ్చర్ తెస్తాడని ఎదురుచూస్తే రోగి ప్రాణం బయటే పోయినట్లే. అందుకే చాలా మంది క్యాజువాలిటీకి వెళ్లాలంటే రోగులను నడిపించుకుంటూనో.. లేదా చేతులపై, భుజాలపై మోసుకుని వెళ్తుంటారు. క్యాజువాలిటీ నుంచి ఇతర వార్డులకు, వైద్యపరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచ్చర్లు, వీల్చైర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా గంటల తరబడి రోగులు స్ట్రెచ్చర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వార్డుబాయ్స్ కొరత కూడా ఉండటంతో శానిటేషన్ వర్కర్లు రోగులను పరీక్షలకు, వార్డులకు తరలిస్తూ కనిపించడం ఇక్కడ పరిపాటిగా మారింది. -
ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు అండగా ఉండాలి ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలకు దూరంగా ఉండాలి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు. -
ఎట్టకేలకు ఏఎంసీ పోస్టుల భర్తీ
ఆచంట: ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ఆచంట, పెనుగొండ ఏఎంసీల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఈమేరకు మార్కెటింగ్ శాఖ కమీషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆచంట ఏఎంసీ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సురేష్‌బాబు, వైఎస్ ఛైర్మన్‌గా రుద్రరాజు సీతారామరాజు(రవిరాజు), పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్‌గా సానబోయిన గోపాలకష్ణ, వైఎస్ ఛైర్మన్‌గా బడేటి బ్రహ్మజీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో ఈరెండు పాలకవర్గాలకు సబంధించి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల తర్వాత కీలకమైన నామిటేటెడ్ పోస్టులు భర్తీకావడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెనుగొండ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎంపిక చేసిన అభ్యర్థులనే ప్రకటించంటం పట్ల పట్ల ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్‌వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్‌వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
ఉత్సవ విగ్రహాల్లా ఎస్ఎంసీ చైర్మన్లు
ఎన్నికై రెండు నెలలైనా శిక్షణా లేదు, చెక్ పవరూ లేదు.. ∙ విధులూ, అధికారాలూ తెలియని స్థితిలో కమిటీలు బాలాజీచెరువు (కాకినాడ) : పాఠశాలల అభివృద్ధికి అవసరమైన ని««దlులు ఉన్నా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయ స్థితి లో పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)ల చైర్మన్లు ఉన్నారు. జిల్లావాప్తంగా ఉన్న పాఠశాలలకు ఆయా కమిటీల ఖాతాలలో స్కూల్ గ్రాంట్ రూపేణా రూ.2,60,86,000 ఉన్నా ఫలితం లేకపోతోంది. అలాగే మెయింటెనెన్స్ గ్రాంట్ రూపేణా రూ.2,90,55,000 ఈ నెల 18న ప్రభుత్వం జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎంసీలను జన్మభూమి కమిటీల తరహాలో ఏర్పాటు చేద్దామని తొలుత ఆలోచించినా ఉపాధ్యాయసంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఎస్ఎంసీ ఎన్నికలను రెండు సార్లు వాయిదావేసి చివరికి నిర్వహించింది. అయితే ఎన్నికైన వారికి శిక్షణ ఇవ్వక పోవడమే నిధుల వినియోగానికి సంబంధించి కమిటీ చైర్మన్లతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభింపజేయలేదు. దీంతో వారు ఎన్నికై రెండు నెలలు గడిచినా ఇప్పటికీ వారికి ఉన్న విధులు, అధికారాలు తెలియకపోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసిన నిధులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 4,308 పాఠశాలలకు విద్యాకమిటీ చైర్మన్లు ఎన్నికయ్యారు. ఎన్నికైన పదిరోజులకు వారికి ఆయా మండలాల వారీగా విధులు, అధికారాలపై మండల వనరుల కేంద్రంలో శిక్షణ తరగతులు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ వారికి ఏ విధమైన సమాచారం లేదు. దీంతో ఎన్నికైన చైర్మన్లు తమ విధులేమిటో తెలియని అయోమయంలో పడ్డారు. అధికారులను అడిగితే శిక్షణ తరువాతే అన్ని తెలుస్తాయని చెబుతున్నారు. శిక్షణ బాధ్యత ప్రైవేట్ సంస్థకు గతంలో అనుసరించిన విధానం ప్రకారం.. ఎంపిక చేసిన ఆరుగురు ఉపాధ్యాయులు ప్రతి జిల్లాలో ఆరుగురికి చొప్పున ఎస్ఎంసీలకు శిక్షణ ఇవ్వాలి. జిల్లాలో శిక్షణ పొందిన వారు ప్రతి మండలానికీ ఆరుగురికి చొప్పున అదే శిక్షణ ఇవ్వాలి. మండలస్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గ్రామాల్లో ఎస్‌ఎంసీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలి. అయితే ఈసారి ఎస్ఎంసీ సభ్యులకు ఇచ్చే శిక్షణ బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఓ మంత్రికి కావలసిన సంస్థకు ఆ బాధ్యతను అప్పగించడం ద్వారా లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని, శిక్షణ జాప్యమౌతోందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. కాగా ఆగస్టు ఒకటిన నిర్వహించాల్సిన ఎస్ఎంసీ ఎన్నికల్లో కోరం సరిపడక, ఏకాభిప్రాయం కుదరక, వివిధ కారణాలతో వాయిదా పడిన 50 పాఠశాలల్లో ఎస్ఎంసీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. -
కురుపాం ఏఎంసీ రేసులో ఇద్దరు..!
కురుపాం : కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎవరికి వారే పైరవీ లు చేస్తున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంధవరపు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుంటముక్కల వెంకటరమణమూర్తి మధ్య పోటీ నెల కొంది. ఇప్పటికే ఇద్దరూ తమ మనసులో మాటను, బలాబలాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.కోటేశ్వరరావుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వీటీ జనార్దన థాట్రాజ్ ఆశీస్సులు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయం లో మాజీ ఎంపీపీ రమణ మూర్తి కురుపాం, గు మ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, సర్పం చులు, మండల కన్వీనర్లు, నాయకుల బలం కూడగట్టుకొని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ , జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి సహకా రం కోరుతున్నట్టు తెలిసింది. తాను మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నందుకు ఏఎంసీ పదవి తనకే వచ్చేలా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. అలాగే మూడు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, పలు పంచాయతీలకు చెందిన సర్పంచుల అభిప్రాయాలతో పాటు మూడు మండలాల్లో ఇటీవల నిర్వహిం చిన క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు వివరాలను లిఖిత పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ పార్టీ యువ నాయుకుడు నారా లోకేష్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు సమాచారం. దీంతో కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఆది నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు కనీసం ఏఎంసీ పదవైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల వ్యక్తిగత స్వార్థాల కోసం కాంగ్రెస్ నుంచీ టీడీపీలో చేరిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీలో పదవుల పండుగ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోని చిన్నా చితకా నేతలకు పదవుల కరువు తీరే సమయం ఆసన్నమైంది. నామినేటెడ్ పదవుల పందేరానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీయడంతో పార్టీలో కోలాహలం కనిపిస్తోంది. అదే సమయంలో పదవుల కోసం పార్టీ నేతల మధ్యే తీవ్ర పోటీ నెలకొనడంతో జిల్లా నాయకులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. నామినేటెడ్ పదవులకు పేర్లు సూచించడానికి ఈ నెల 20వ తేదీని అధినేత డెడ్‌లైన్‌గా సూచించడంతో ఎవరికి వారు తమ పేర్లు ప్రతిపాదించాలని మంత్రులు, సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందని నేతలు చెబుతున్నా ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లాలో అందుబాటులో ఉన్న పదవుల విషయం పరిశీలిస్తే.. ఏఎంసీ, దేవాలయ కమిటీలతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులకు ఆశావహుల జాబితా ఇప్పటికే చాంతాడంత ఉంది. మార్కెట్, దేవాలయ కమిటీలను రద్దు చేయడంతో రెండు నెలల నుంచే ఈ పదవులపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 14 ఏఎంసీలు ఉండగా ఒక్కో కమిటీలో 9 మంది సభ్యులకు చోటుంటుంది. ప్రముఖ ఆలయాలైన అరసవిల్లి, శ్రీ కూర్మం, శ్రీముఖలింగం దేవాలయ కమిటీలను నియమించాల్సి ఉంంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రంథాలయ సంస్థ పదవి ఆశిస్తున్న ఓ నేత పొరుగు జిల్లా మంత్రిని ఆశ్రయించినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది. అయితే ఇక్కడి వారు మాత్రం ససేమిరా అంటున్నారు. పదేళ్లుగా తాము పార్టీ జెండా మోస్తుంటే ఇప్పుడిప్పుడే పార్టీలో హడావుడి చేస్తున్న వ్యక్తికి పదవేంటని మండిపడుతున్నారు. జిల్లా మంత్రి, విప్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కమిటీ సూచనలతోనే..నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితమే ఓ ఆదేశం వచ్చింది. జిల్లాకు చెందిన అగ్రనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారి సూచన మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సూచించిన వా రినే పదవులకు సిఫారసు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సూచించిన వారికంటే ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి పదవులు కట్టబెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. పార్టీకి పట్టులేని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో ఎలాంటి కార్యకర్తల సమావేశం పెట్టకపోవడం, పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలి కాలం లో జిల్లాలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. సీనియర్ నేత చుట్టూ ఓ వర్గం, ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న ఇతర నేతల చుట్టూ మరో వర్గం అన్నట్లు టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని గమనించిన అధిష్టానం సీనియర్ నేతను ఖాళీగా ఉంచకుండా పార్టీ పని అప్పగించింది. రెండు రోజుల క్రితం సమన్వయ సమావేశం నిర్వహించినా స్థానికంగానే ఉన్నప్పటికీ ఇద్దరు అగ్రనేతలు దానికి హాజరుకాకపోవడం, సమావేశంలో డీసీఎంఎస్ పదవి విషయంలో అభిప్రాయభేదాలు వ్యక్తం కావడం రానున్న పరిణామాలకు సూచికగా నిలుస్తోంది. జిల్లా నేతల సిఫారసులు పని చేస్తాయా.. పొరుగు జిల్లాల నేతల ఒత్తిళ్లు పనిచేస్తాయో త్వరలో తేలనుంది. -
‘పుంత’పై చింత
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పుంత రోడ్ల అభివృద్ధికి ఇప్ప ట్లో మోక్షం కలిగే అవకాశాలు కనిపించడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఎంసీ ఆదాయంలో 20 శాతం నిధులను పుంత రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పటికి కొద్ది నెలలు క్రితమే వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న లింకురోడ్ల అభివృద్ధిని పట్టించుకోకపోతే ఉత్సవ విగ్రహాల్లా మారిపోతామనే ఆందోళనతో పాలకవర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 40 శాతం నిధులను విడుదల చేయాలని కోరాయి. అయితే 20 శాతం నిధుల విడుదలకు అవకాశం కల్పిస్తూ మార్కెటింగ్ శాఖ జీవో జారీ చేసింది. దీంతో జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రూ.20 కోట్లతో పుంత రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కలెక్టర్ పరిపాలనా ఆమోదం ఇచ్చే దశలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో టెండర్లు ప్రక్రియ నిలిచిపోయింది.ఏ ఒక్క పనికి ఆమోదముద్ర పడలేదు. దీంతో పనులు ప్రారంభించడానికి అవకాశం లభించలేదు. కొలువుతీరనున్న కొత్త సర్కారు ఆ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపుతుందా? లేదా రద్దు చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి అనుమానమే..! టీడీపీ సర్కార్ ఈ వారంలో కొలువుతీరనుండటంతో జిల్లాలోని 18 ఏఎంసీ పాలకవర్గాలు రాజీనామాలు ప్రకటించాల్సి ఉంది. వీటికి కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవి మూడేళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. పాలకవర్గాల చొరవ తీసుకుంటే పుంత రోడ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగనుంది. టీడీపీ హయాంలోనే గతంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణలో పుంతరోడ్ల పనులు జరిగాయి. అయితే ఇవి లోపభూయిష్టంగా ఉండటంతో దివంగత పుంత రోడ్ల నిర్మాణాలపై నిషేధం విధించారు. దాదాపుగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఈ పనులను చేపట్టడానికి ముందుకు వచ్చినా అమలులో నిర్మాణాత్మంగా వ్యవహరించకపోవడంతో పుంత రోడ్ల నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన కారణంగా లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల కొరత ఎదుర్కోనున్న నేపథ్యంలో టీడీపీ సర్కార్ ఈ రోడ్ల అభివృద్ధికి ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. -
‘లింకు’ వివాదం
ఏలూరు, న్యూస్‌లైన్ :వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల నిధులతో గ్రామాల్లో లింకురోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని తోసిరాజని పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ శాఖలకు నేరుగా నిధులు మళ్లించాలన్న నిర్ణయంపై ఏఎంసీ చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. తమ శాఖ నిధులపై వేరే శాఖల పెత్తనం ఏమిటని భావించిన వారు అమీతుమీకిసిద్ధపడటంతో రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంసీల నిధలుఉ రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందలాది కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం రూ.100 కోట్ల పనులకే అనుమతినివ్వడంపైనా విమర్శలు రేగుతున్నాయి. ఒక్కో ఏఎంసీ పరిధిలో పనులకు రూ.50 లక్షలు మంజూర య్యే అవకాశం కూడా కనిపించటం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 18 కమిటీల్లో రూ.75 కోట్లకుపైగా నిధులు మూలుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవలే ఐదారు కమిటీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఏలూరు కమిటీ పాలకవర్గం గడువు ముగిసి నెల అవుతున్నా ఇంకా కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. నిషేధం తొలగిందనే ఆనందం మిగలలేదు ఏఎంసీల పరిధిలో లింకురోడ్ల అభివృద్ధిపై నిషేధాన్ని 2005లో విధించారు. ఎన్నికల సీజన్ తరుమకొస్తుండటంతో ఎమ్మెల్యేలు, ఏఎంసీల చైర్మన్ల కోరిక మేరకు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో జీవో జారీ చేసింది. ఆ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు కోరింది. అయితే ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని విస్మరించి పాత పద్ధతిలోనే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ విభాగాలకు పనులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. పైగా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి గతంలో అభివృద్ది చేసిన గ్రావెల్ రోడ్లును బీటీ రోడ్లుగా మార్చేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో చైర్మన్లు ప్రతిపాదనలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఏ ఏఎంసీలోను ప్రతిపాదనలను రూపొందించే పరిస్థితి లేదు. కొద్ది నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పనులు ప్రారంభించే అవకాశం ఎలాగూ ఉండదు. సమీక్షించనున్న కలెక్టర్ మార్కెటింగ్ శాఖ పరిధిలో అన్ని కమిటీలకు పూర్తిస్థాయి కార్యదర్శుల నియామకం ఇటీవలే జరిగింది. దీంతో ఈ శాఖ పనితీరు, లింకురోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ రెండు మూడు రోజుల్లో జిల్లాలోని ఏఎంసీ మంది కార్యదర్శులతోను సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ విషయంపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. -
మూడురోజులకోసారే
ఔరంగాబాద్: తాగునీరు దొరక్క పట్టణవాసులు నానాతంటాలు పడుతున్నారు. ఇందుకు కారణం జయక్వాడి జలాశయం నుంచి చేపట్టిన సమాంతర పైప్‌లైన్ ప్రాజెక్టు సాంకేతిక అవరోధాల కారణంగా నిలిచిపోవడమే. దీంతో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) మూడురోజులకోసారి పట్టణవాసులకు నీటిని సరఫరా చేస్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు పనులను ఏఎంసీ ఓ ప్రైవేటు సంస్థకు కార్పొరేషన్ అప్పగించింది. జయక్వాడి జలాశయంలోని నీటిని ఈ పైప్లైన్లద్వారా పట్టణవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకు సంబంధించిన పనులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. దాదాపు పది రోజులపాటు పనులు నిర్వహించిన సదరు ప్రైవేటు సంస్థ ఆ తర్వాత నిలిపివేసింది. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశించినరీతిలోనేపడ్డాయి. దీంతోజయక్వాడి జలాశయంలో నీటిమట్టం బాగా పెరిగింది. అయినప్పటికీ నీటి నిర్వహణ విషయంలో ఏఎంసీ విఫలమవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వాస్తవానికి జయక్వాడి జలాశయంలో నీటిమట్టం ఈ ప్రాంత ప్రజల తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చగలుగుతుంది. అయినప్పటికీ నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై హేమంత్శుక్లా అనే స్థానికుడు మాట్లాడుతూ కార్పొరేషన్ నీటి నిర్వహణలో విఫలమైందన్నాడు. తమ అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతోందన్నాడు. ఇదే విషయమై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ వివిధ పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ జయక్వాడి జలాశయం నుంచి 140 మిలియన్ లీటర్ల నీటిని పట్టణవాసులకు సరఫరా చేస్తున్నామన్నారు. సమాంతర పైప్‌లైన్ ప్రాజెక్టు పనులు పూర్తయితే పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయగలుగుతామన్నారు. కాగా జయక్వాడి జలాశయంలో దాదాపు 637 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీరు ఉంది. అయితే నగరవాసులకు రోజుకు 45 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీటిని సరఫరా చేయగలిగితే వారి కనీస అవసరాలు తీరతాయి. ఔరంగాబాద్ పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడానికి కారణం కార్పొరేషన్ అధికారుల వైఫల్యమేనని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (సీఏడీఏ) అధికారి ఒకరు ఆరోపించారు. ఆవిరి నష్టం కింద 228 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీరు గాలిలో కలసిపోయిందన్నారు. ఇంక పారిశ్రామిక అవసరాల కోసం కార్పొరేషన్ 105 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఇదంతాపోగా కూడా పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు ఈ జలాశయంలో ఉందన్నారు. వినియోగదారులు క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నప్పటికీ వారి అవసరాలకు సరిపడా నీరు అందడం లేదన్నారు. వివక్ష చూపుతున్నారు నీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని పట్టణంలోని దేవనగ్రి ప్రాంతనివాసి అశోక్ బర్డే ఆరోపించారు. కొన్ని ప్రాంతాలకు బాగానే సరఫరా చేస్తున్నారని, మరికొన్ని ప్రాంతాలకు వారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే అందుతున్నాయన్నారు. చర్చించిన మంత్రులు నీటి సమస్యపై ముంబైలో గురువారం మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో ప్రస్తుత నీటిమట్టం వివరాలను సమగ్రంగా విశ్లేషించారు. ఈ నెల 15వ తేదీన మరోసారి వారంతా సమావేశమవనున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్ పంట కోసం ఏయే జలాశయాలనుంచి ఎంత మొత్తంలో నీటిని విడుదల చేయాలనే అంశంపై వారంతా ఓ నిర్ణయానికొచ్చే అవకాశముంది. కాగా మరాఠ్వాడా ప్రాంతంలో మొత్తం వ్యవసాయ భూమి పరిమాణం 1.87 లక్షలు. ఈ ప్రాంతంలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఇదిలాఉంటే మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతాలైన అహ ్మద్నగర్, నాసిక్ జిల్లాల్లోని అన్ని జలాశయాల్లో కలిపి మొత్తం 72 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (ఎంసీటీ) నీరు ఉంది. మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతంలో మొత్తం 16 జలాశయాలు ఉండగా అందులో 11 జలాశయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో ఎగువ ప్రాంత వాసులకు ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తడం లేదు.