రోగుల బెడ్‌ల వద్ద ఫ్యాన్‌లు వాడుతున్న దృశ్యం
ఎయిర్ కండీషనర్లు పనిచేయక రోగుల అవస్థలు
అధ్వానంగా నిమ్స్ ఏఎంసీ నిర్వహణ
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్‌లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది.
లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.
ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్‌లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది.
కాలం చెల్లిన ఏసీలు..
దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.
మరమ్మతులు చేయిస్తాం..
‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
హెచ్‌డీయూ లేదు..
సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్‌డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్‌లో హెచ్‌డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్‌డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్‌గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment