Hospital Staff Negligence
-
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్‌డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్‌డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్‌లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్‌డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్‌గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
ఆ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్
సాక్షి, విజయవాడ: నగరంలోని డోర్నకల్ రోడ్డులో ఉన్న ఫ్యామిలీ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో.. పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి వెంటనే స్పందించారు. సత్వరమే ఆసుపత్రికి వెళ్లి ఘటనపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుహాసినిని మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలపై ప్రతి రోజు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణీ కుటుంబ సభ్యుల నుండి వివరాలు తెలుసుకుని పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. రోగులకు వైద్యం అందించే విషయంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: జేసీ పవన్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి) -
ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి..
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసిన ఘటన పలువురిని తీవ్రంగా కలచివేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన ఆస్పత్రిలోని మెటర్నిటీ విభాగం భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో చోటు చేసుకుంది. అక్కడున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ అనారోగ్య కారణంగా చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు మూడురోజుల క్రితం వచ్చింది. ఆమె ఆస్పత్రి భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద సేద తీరేది. అక్కడే ఉన్న అనేక మంది రోగుల అటెండర్లు ఆమెను చూశారు. అయితే వివరాలు ఎవరికీ తెలియదు. ఆమె బుధవారం రాత్రి మృతి చెందినా ఎవరూ గుర్తించలేదు. ఆమె నిద్రపోతోందని భావించారు. గురువారం ఉదయం శానిటేషన్ సిబ్బంది చూడగా ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి ఉన్నాయి. మృతదేహంపై దుస్తులు లేవు. శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసుకున్న అనంతరం మార్చురీకి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనే విమర్శలున్నాయి. కొంతమంది వృద్ధ అనాథలు ఇక్కడి ప్రాంగణంలోకి వచ్చి మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వైద్య కళాశాలకు సంబంధించి 120 మంది సిబ్బంది ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుర్తించి చర్యలు తీసుకున్నాం.. జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న మెటర్నిటీ విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద రోజూ రోగుల అటెండెంట్లు సేద తీరుతుంటారు. అయితే ఎవరో గుర్తు తెలియని ఓ మహిళ బుధవారం రోజున వచ్చి ఆచెట్ల కింద ఉన్నట్లుంది. అదేరోజు రాత్రి మృతి చెందినట్లు భావిస్తున్నాం. గురువారం ఉదయం 6గంటలకు శానిటేషన్ సిబ్బంది గుర్తించి తమకు తెలియజేయగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎవరైనా గుర్తుపట్టి వస్తే మృతదేహాన్ని అప్పగిస్తాం. సమాచారం తెలిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తక్షణమే తీసుకున్నాం. –డాక్టర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
పురిటి నొప్పులతో అరిస్తే చెంపదెబ్బలు
పాకాలకు చెందిన స్వర్ణ రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆదివారం నొప్పులు ఎక్కువయ్యాయి. నరకయాతన పడింది. పక్కనే ఉన్న నరుసమ్మ ఎందుకు అరుస్తున్నావ్..అంటూ రెండు చెంపలూ చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా పచ్చి బూతుల దండకం అందుకుంది. ఇది ఒక్క స్వర్ణ పరిస్థితే కాదు. ప్రసూతి ఆస్పత్రికి వస్తున్న పలువురు గర్భవతులు ఎదుర్కొంటున్న సమస్య.. తిరుపతి (అలిపిరి): ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. నిరుపేద గర్భవతులకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడే మహిళలకు ఛీదరింపులు తప్పడంలేదు. గర్భవతుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళలను ఓదార్చాల్సిన వైద్యసిబ్బంది పచ్చి బూతుల దండ కం అందుకుంటున్నారు. కేకలు పెడితే చెంప చెల్లుమనిపిస్తున్నారు. సభ్యసమాజం నివ్వెరపోయేలా ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వైద్య సిబ్బంది వైలెంట్ వైద్యానికి దిగుతున్నారు. రోజుకు 30 నుంచి 50 ప్రసవాలు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పేద గర్భిణుల సంఖ్య పెరగడంతో 300 పడకలకు పెంచి సేవలందిస్తున్నారు. రోజుకు 30 నుంచి 50 ప్రసవాలను వైద్యబృందం చేస్తోంది. ఆస్పత్రిలో కాన్పునకు ముందు పేద గర్భిణులకు నరకం చూపిస్తున్నారు. యాంటినెటల్ వార్డులో పురిటి నొప్పులు ప్రారంభమైన మహిళలను ఉంచి వైద్యం చేస్తుంటారు. ఈ వార్డులో చేరే మహిళల పట్ల వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాత్రయితే ప్రవేశం లేదు యాంటినెటల్ వార్డులో సేవలు పొందుతున్న గర్భిణులకు పుట్టెడు కష్టాలు తప్పడం లేదు. రాత్రయితే సహాయకులను బయటకు పంపేస్తున్నారు. గర్భవతులకు వైద్య సేవలందుతున్నాయా లేవా..? అన్న విషయాలు బంధువులకు చేరవేయడం లేదు. కాన్పు అయిన తర్వాత బంధువులకు తెలియజేస్తున్నారు. పురిటి నొప్పుల సమయంలో తనను కొట్టారు.. తిట్టారు అని బాలింత చెబితే తప్ప వారి బంధువులకు తెలిసే అవకాశం లేదు. రాయలసీమ ప్రాంత ప్రభుత్వ కాన్పుల ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరు ఇది. పోస్ట్‌నెటల్ వార్డులో మరీ దారుణం కాన్పు అనంతరం బాలింతలను పోస్ట్‌నెటల్ వార్డులోకి తరలిస్తారు. అక్కడ బాలింతలు అవస్థలు పడక తప్పడం లేదు. పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు వైద్యసేవలు పొందాల్సివస్తోంది. ఎవరైనా ప్రశ్ని స్తే వారికి వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారు. బాలింతలకు మౌలికసదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సిజేరియన్‌కు రూ.500 ప్రసూతి ఆస్పత్రిలో సాధారణ ప్రసవం సాధ్యంకాని పక్షంలో గర్భిణులకు సిజేరియన్లు చేసి శిశువును వెలికి తీస్తారు. ఇదే అదునుగా చేసుకుని కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సిజేరియన్ అయిన మహిళ బంధువుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్ చేస్తున్నారు. గర్భిణుల బంధువులు చేసేది లేక వారి దగ్గర ఉన్న నగదులో ఎంతో కొంత ఇవ్వడం మామూలైపోయింది. సిబ్బంది చేతివాటంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఫలితం లేకుండా పోయింది. గర్భవతి మృతి ప్రసూతి ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో రాజంపేటకు చెందిన మణి (35) అనే గర్భవతి మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన గర్భవతి హఠాత్తుగా మృతి చెందింది. ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయావాలకు చేరడం వల్ల ఆమె మృతి చెందిందని ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవాని వెల్ల్లడిం చారు. నాలుగో కాన్పు కావడంతో పాటు మహిళ వయస్సు 35 సంవత్సరాలు దాటడడం కూడా మృతికి కారణమని చెప్పారు. బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే్ల మృతి చెందిందని ఆరోపించారు. మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భుణులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదు. కాన్పు సమయంలో మహిళ ఆరోగ్యం క్షీణిస్తే తప్ప మృతి చెందదు. మణి అనే గర్భిణి ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయవాల్లోకి వెళ్లడం వల్లే మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు.– డాక్టర్ విద్యావతి, ఆర్ఎంఓ,ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, తిరుపతి -
టాయ్లెట్లో ప్రసవం.. పరిస్థితి విషమం
సాక్షి,భోపాల్: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. ఎవరూ పట్టించుకోకపోవటంతో ఓ గర్భిణి టాయ్ లెట్ లో ప్రసవించగా, ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సుల్తానియా ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో ముస్కన్ అనే ఏడు నెలల గర్భిణిని ఆమె భర్త చికిత్స కోసం చేర్పించారు. గురువారం ఉదయం నొప్పులు రావటంతో విషయాన్ని ఆమె అత్త హీరా బాయ్, ఆన్ డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే అతను ఆ విషయం పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావటంతో చివరకు టాయ్ లెట్‌లోకి వెళ్లిన ముస్కన్ అతికష్టం మీద బిడ్డను ప్రసవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కోడలు ఎంతకూ రాకపోవటంతో హీరా బాయ్ వెళ్లి చూడగా, బిడ్డ టాయ్లెట్లో పడి ఉన్న విషయం గమనించింది. వెంటనే బిడ్డను దగ్గర్లోని మరో ఆస్పత్రికి తరలించగా, శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సుల్తానియా ఆస్పత్రి సిబ్బందిని నిలదీస్తే తనని బయటకు గెంటేశారని బాధితురాలి అత్త చెబుతున్నారు. అంతా ఆరోపణలే.. నెలలు నిండకుండానే మస్కన్ ప్రసవించిందని, అందుకే శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి సూపరిండెంట్ కరణ పీప్రె చెబుతున్నారు. వైద్యులపై, సిబ్బందిపై బాధితులు చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.