నిమ్స్ యాజమాన్యాన్ని వివరణ కోరిన ప్రభుత్వం
సంజాయిషీ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్‌లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్‌లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్‌లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment