కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎవరికి వారే పైరవీ లు చేస్తున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంధవరపు కోటేశ్వరరావు,
కురుపాం : కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎవరికి వారే పైరవీ లు చేస్తున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంధవరపు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుంటముక్కల వెంకటరమణమూర్తి మధ్య పోటీ నెల కొంది. ఇప్పటికే ఇద్దరూ తమ మనసులో మాటను, బలాబలాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.కోటేశ్వరరావుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీటీ జనార్దన థాట్రాజ్ ఆశీస్సులు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయం లో మాజీ ఎంపీపీ రమణ మూర్తి కురుపాం, గు మ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, సర్పం చులు, మండల కన్వీనర్లు, నాయకుల బలం కూడగట్టుకొని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ , జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి సహకా రం కోరుతున్నట్టు తెలిసింది.
తాను మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నందుకు ఏఎంసీ పదవి తనకే వచ్చేలా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. అలాగే మూడు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, పలు పంచాయతీలకు చెందిన సర్పంచుల అభిప్రాయాలతో పాటు మూడు మండలాల్లో ఇటీవల నిర్వహిం చిన క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు వివరాలను లిఖిత పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ పార్టీ యువ నాయుకుడు నారా లోకేష్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు సమాచారం. దీంతో కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఆది నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు కనీసం ఏఎంసీ పదవైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల వ్యక్తిగత స్వార్థాల కోసం కాంగ్రెస్ నుంచీ టీడీపీలో చేరిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.