lobbying
-
TS: ఎవరికి వారే.. మంత్రి పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్
సాక్షి, ఢిల్లీ: మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. డీకే శివకుమార్‌ను కలిసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంత్రి పదవిని ఇస్తే తీసుకుంటా.. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశా.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శ్రీధర్‌బాబు తెలిపారు. అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలని ఖర్గే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు -
కోవర్టు లాబీయింగ్ చేశాయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు.. ► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. ► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్పీ తెలిపింది. ► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది. ► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్పీ తెలిపింది. వేదాంత స్పందన ఇదీ.. ఓసీసీఆర్పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ
మైనింగ్ దిగ్గజం వేదాంతకు భారీ షాక్ తగిలింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసింది. గ్రీన్ నిబంధనలను బలహీనపరిచేందుకు లాబీయింగ్ ప్రచారాన్ని నడిపింది. అంతేకాదు వేదాందకు చెందిన చమురు సంస్థ కెయిర్న్ ఇండియా కూడా అక్రమాలను పాల్పడిందని జార్జ్ సొరోస్‌కు చెందిన ఓసీసీఆర్పీ పేర్కొంది. ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాకులలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసిందని తెలిపింది.(మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర) అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత కొవిడ్ -19 మహమ్మారి సమయంలో కీలకమైన పర్యావరణ నిబంధనలను బలహీనపరిచే "కోవర్ట్" లాబీయింగ్ నడిపించినట్టు తెలిపింది. మైనింగ్ కంపెనీలు 50శాతం వరకు ఉత్పత్తిని పెంచడానికి అనుమతించడం ద్వారా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుందంటూ ప్రభుత్వానికి చెప్పిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తద్వారా కొన్ని నిబంధనలను ప్రభావితం చేసినట్టు ఆరోపించింది. అటు ఉత్పత్తి ,ఇటు ఆర్థిక వృద్ధిని తక్షణమే పెంచడమే కాకుండా, ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని, భారీ ఉద్యోగాలను సృష్టిస్తుందని అగర్వాల్ మంత్రికి చెప్పారని తెలిపింది. అలాగే దీన్ని 'ఒక సాధారణ నోటిఫికేషన్'తో మార్పు చేయవచ్చని సిఫార్సు చేశారని కూడా OCCRP వెల్లడించింది. అలాగే మోదీ సర్కార్ దీనిపై ప్రజల సంప్రదింపులు లేకుండానే..నిపుణులు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించి మార్పులను ఆమోదించిందని తన కథనంలో పేర్కొంది ఈ మేరకు కొత్త పర్యావరణ అనుమతులు పొందుకు జనవరి 2021లో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాజీ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో మాట్లాడారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కెయిర్న్ రాజస్థాన్‌లో ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులకు ఆమోదం పొందిందని నివేదించింది. కాగా గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై కూడా ఏసీసీఆర్‌పీ అనేక ఆరోపణలు చేసింది. అయితే వీటిని అదానీ గ్రూపు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆరోపణలపై వేదాంత ఎలా స్పందింస్తుందో చూడాలి. -
BRS Party: ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి? నేరుగా కేసీఆర్, కేటీఆర్‌తోనే..
సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్ఎస్లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకుంటున్నారు. తమకే వస్తుందన్న ధీమా అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్‌కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి ఆ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్‌నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక సమీకరణలపై లెక్కలు ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి. మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. -
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
లాబీయింగ్‌లో రమేష్ నంబర్‌వన్
సాక్షి, ఎర్రగుంట్ల : టీడీపీ నేత సీఎం రమేష్ లాబీయింగ్ చేయడంలో నంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. 2014 ఎన్నికల మందు రిత్విక్ కంపెనీకి కేవలం 300 కోట్ల టర్నోవర్ ఉండేదని, ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వేల కోట్లకు చేరుకుందన్నారు. దీన్ని బట్టి ఏవిధంగా ఆవినీతి సోమ్ము సంపాదించారో తెలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.30లక్షలు దాకా ఖర్చు పెట్టి, ప్రత్యేక విమానాల్లో తిరిగారని చెప్పారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి బీటెక్ రవిని గెలిపించారని ప్రశ్నించారు. కానీ అది గెలుపు కాదన్నారు. టీడీపీ ఆర్టీపీపీలోని 6 మెగావాట్లలో ఆవినీతి జరిగిందన్నారు. రూ.3వేల కోట్లు ఉన్న ప్రాజెక్టులో సుమారు 800 కోట్లు సంపాందించారు. పోట్లదుర్తి – మాలెపాడు, గ్రామాల మధ్య ఏ పనులైనా రిత్విక్ కంపెనీ కనుసన్నలలో జరగాలి, వైఎస్సార్ సీపీ తరుపున టెండర్‌వేస్తే రాకుండా చేస్తారు. లేక పోతే పనులు జరగనివ్వరన్నారు. లాబీయింగ్ చేయడంలో ఎంపీ రమేష్ నంబర్ వన్ అని అన్నారు. బీజేపీ కక్ష సాధింపు అనడడం సరికాదన్నారు.రమేష్ బలం చంద్రబాబు, అవినీతి సొమ్మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు సీఎం రమేశ్ రాజభవనం చూశారా? -
యార్డు సెక్రటరీ పోస్టుకు పైరవీలు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా తమకు అనుకూలమైన ఉద్యోగిని నియమించుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్ యార్డు సెక్రటరీగా ఉన్న బ్రహ్మయ్యను గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా బదిలీ చేయించేందుకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో ఎంపీడీఓగా పనిచేసిన బ్రహ్మయ్యను నోషనల్ ప్రమోషన్ ఇచ్చి మార్కెటింగ్ శాఖలో డీడీ క్యాడర్లో దుగ్గిరాల మార్కెట్ యార్డు సెక్రటరీగా నియమించారు. గతంలోనే ఈ నియమాకంపై మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మంత్రి గట్టిగా పట్టు పట్టడంతో చట్టాన్ని తుంగలో తొక్కారు. ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్దదైన మార్కెట్ యార్డుకు సెక్రటరీగా వచ్చేందుకు మంత్రి ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పసుపు అమ్మకాలపై ఆరోపణలు దుగ్గిరాల మార్కెట్ యార్డులో రోజుకు వెయ్యి బస్తాలకు పైగా పసుపు అమ్మకాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్లో రైతులు సరుకును అమ్ముకునే వెసులుబాటు ఉంది. మార్కెట్ సిబ్బంది బహిరంగ వేలం పెడతారు. దీంట్లో అత్యధిక ధర పాడిన వారికి, రైతు అనుమతితో లాటును కేటాయిస్తారు. మార్కెట్ యార్డు వారు తయారు చేసిన సేల్ పట్టి ప్రకారం రైతులకు డబ్బులు కట్టిన తర్వాతనే కోనుగోలు చేసిన వ్యాపారి రైతు అనుమతితో సరుకును తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియ ఆరు దశాబ్దాలుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డులో సరాసరి రోజుకు వెయ్యి బస్తాలు కోనుగోలు జరగాల్సి ఉండగా, కేవలం 100 బస్తాలు మాత్రమే పోతలు పోస్తున్నట్లు, దీంతో కూలీ గిట్టుబాటు కావటం లేదని మార్కెట్ యార్డులోని హమాలీలు పలు మార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లలో అవకతవలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అయితే మార్కెట్లో 100 శాతం ఈ–నామ్ పద్ధతిలో పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయని సీఎం చేతుల మీదుగా బ్రహ్మయ్య అవార్డును అందుకోవడం మార్కెటింగ్ శాఖ ఉద్యోగలను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలోనూ ప్రయత్నం గతేడాదే బ్రహ్మయ్యను గుంటూరు మిర్చియార్డు సెక్రటరీగా నియమించాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే మార్కెట్ యార్డు చైర్మన్, బ్రహ్మయ్య ఒకే సామాజిక వర్గాని చెందిన వారు కావడంతో ఒక వరలో రెండు కత్తులు ఇమడవనే భావనతో దుగ్గిరాల యార్డు సెక్రటరీగా నియమించినట్లు సమాచారం. తాజాగా ఈ నెల 28తో ప్రస్తుత మార్కెట్ యార్డు పాలక వర్గం పదవీ కాలం ముగుస్తోంది. ఈ క్రమంలో బ్రహ్మయ్యను గుంటూరు యార్డు సెక్రటరీగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మార్కెట్ యార్డులో పనులు చక్క దిద్దాలంటే, తమకు అనుకూలమైన అధికారిని ఉండాల్సిందేనని, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి పట్టుబడుతున్నట్లు వినికిడి. ఇతర శాఖల అధికారులను మార్కెటింగ్ శాఖలో నియమించటం ఏమిటని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
కార్పొరేట్ గుప్పిట్లో కన్వీనర్ ఆఫీసు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: విద్యను వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీలు.. ఆ దందాను విస్తృతం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాయి. ఎంసెట్ మెడికల్ ర్యాంకుల కోసం దొడ్డిదారిలో ప్రశ్నపత్రాలను సంపాదించేందు కు ఆరాటపడ్డాయి. ఇందుకు కార్పొరేట్ శక్తులు చేసిన లాబీయింగ్ అంతా ఇంతా కాదు. 2 దశాబ్దాలకు పైగా ఎంసెట్ నిర్వహించిన చరిత్ర ఉన్న జేఎన్టీయూ, ఆ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే కన్వీనర్ కార్యాలయాన్నీ వదల్లేదు. ఈ ఆఫీసులో సీనియర్ అధికారి మొదలు నాలుగో తరగతి ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికీ లంచాల ఎర చూపారు. సంవత్సరాల తరబడి సొమ్ము ముట్టజెప్పి సమాచారం కాజేసే యత్నాలకు ఒడిగట్టారు. దరఖాస్తులు స్వీకరించడం మొదలు, ఫలితాలు ప్రకటించేదాకా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తెలిసేది కార్పొరేట్ కాలేజీలకే! పేపర్ సెట్టింగ్ నుంచి మొదలు.. వేలాది మంది పోటీ పడే ఎంసెట్‌లో ప్రశ్నపత్రాల రూపకల్పన అత్యంత కీలకం. ప్రశ్నపత్రాలకు ఎవరు రూపకల్పన చేయాలన్నది కన్వీనర్‌కు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అందుకే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు కన్వీనర్ కార్యాలయంలోనే తిష్ట వేసేవారు. కన్వీనర్ ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ఎంత? ఆయన ఏ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు? వంటి విషయాలకు అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. కన్వీనర్ ఆఫీసులో మామూలుగా విశ్వసనీయత కలిగిన వారినే నియమిస్తారు. అయినా భారీ స్థాయిలో సొమ్ము ఆశ జూపి వారిని ప్రలోభపెట్టేందుకు యత్నించేవారు. కన్వీనర్ అనేక విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా కొన్నిసార్లు ఇతర సిబ్బందికి కొన్ని పనులు అప్పగించేవారు. కార్పొరేట్ శక్తులు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకునేవి. మొదట ప్రశ్నపత్రాలను సెట్ చేసేవారిని గుర్తించి, తర్వాత వారి నుంచి ప్రశ్నలు సేకరించడానికి కోట్లలో ఖర్చు చేసేవారని జేఎన్టీయూలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన జేఎన్టీయూలో పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను సీనియర్ పోలీసు అధికారి ఒకరికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్యానల్ నుంచి ప్రశ్నలు బయటకు.. ప్రశ్నపత్రం రూపొందించేందుకు జేఎన్టీయూకు ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో ఉన్న వారు రూపొందించే ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుంటారు. అయితే ప్యానల్ తయారు చేసే వెయ్యి ప్రశ్నలు లీక్ అయితే చాలు కొంచెం తెలివైన విద్యార్థి 160కి 150కి పైగా మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. దీన్ని కార్పొరేట్ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. ‘‘నాకు తెలిసి ఈ కాలేజీలు పేపర్ సెట్టింగ్ ప్యానల్ నుంచే ప్రశ్నలు సంపాదించేవి. అందుకు కోట్లు ఖర్చు చేసేవారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినా బయటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే భారీగా డబ్బు ముట్టజేప్పేవారు’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ‘‘ఇదేం మామూలు స్కాం కాదు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోవడం కూడా పొరపాటే. ప్యానల్ నుంచి ప్రశ్నలు సేకరించడం ఇబ్బంది అనుకున్న ప్రతీసారి వారు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం సంపాదించేవారు. మెడికల్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఇంజనీరింగ్ కోసం తక్కువ ఖర్చుతో ప్యానల్ నుంచి ప్రశ్నలు అందేవి’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ వివరించారు. తెలివైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉంటారు. కానీ రెండు కాలేజీలకే ర్యాంక్‌లు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని, పట్టించుకొని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వారంతా ఆ రెండు కాలేజీల విద్యార్థులే..! లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు ఆ రెండు కాలేజీలకు చెందినవారేనని సీఐడీ విచారణలో బయటపడింది. పేపర్ లీకేజీలో అరెస్టయిన శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను విచారిస్తున్న సీఐడీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు 136 మంది విద్యార్థులను విచారించారు. వీరిలో 86 మంది ఒక కార్పొరేట్ కాలేజీకి చెందిన వారు కాగా, ఇంకో 28 మంది మరో కార్పొరేట్ కాలేజీకి చెందిన వారే! దీంతో స్కాం పూర్తిగా ఈ రెండు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందా అన్న కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బ్రోకర్లు సైతం ఇదే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకొని ప్రస్తుతం మెడిసిన్ చేస్తుండటం గమనార్హం. తెరపైకి మరో 13 మంది బ్రోకర్లు ఎంసెట్ కేసులో అరెస్టయిన వాసుబాబు, శివ నారాయణ, శ్రీచైతన్య మాజీ విద్యార్థి గణేశ్ ప్రసాద్‌ల విచారణలో తెరపైకి మరికొన్ని కొత్త ముఖాలు వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మందిని నిందితులుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మరో 13 మంది బ్రోకర్లు కూడా స్కాంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరు రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులను బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె క్యాంపులకు తరలించి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. అటు డాక్టర్ ధనుంజయ్, సందీప్‌లకు ప్రశ్నపత్రం ఇచ్చిన బ్రోకర్ల లింకుపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 13 మంది బ్రోకర్లలో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, మిగిలిన ఐదుగురిలో ఇద్దరు యూపీ, ఒకరు ఢిల్లీ, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన వారున్నారని సీఐడీ అనుమానిస్తోంది. వీరిలో కొందరు స్కాం ప్రధాన సూత్రధారి కమిలేష్‌కుమార్ సింగ్‌తో పదేపదే టచ్‌లో ఉన్నారని, అక్కడ్నుంచి వీరి ద్వారానే కార్పొరేట్ కాలేజీలకు ప్రశ్నపత్రం అందినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో వాసుబాబు, శివనారాయణ, గణేష్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లిలోని సీఐడీ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ పిటీషన్‌పై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. మొత్తంగా చార్జిషీట్ దాఖలుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. -
టీటీడీలో టీడీపీ దందా
అధికార పార్టీ నేతలు కొందరు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్ముకోవడం.. వ్యాపార దుకాణాలను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టి వారి ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకోవడం ఇక్కడ సర్వసాధారణమైపోతోంది. ఇందులో బడాబాబుల హస్తం ఉండడంతో టీటీడీ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుమలలో టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. హాకర్స్ లైసెన్స్‌ల కోసం కొంద రు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అమరావతి నుంచి చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి లైసెన్సులు ఇప్పించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అధికార పార్టీ నేతల దందాను చూసి సామాన్య వ్యాపారులు ముక్కున వేలేసుకుంటున్నారు. వారు అడిగినంత ఇచ్చుకునే స్థోమత లేక.. కుటుంబ జీవనం కష్టమవుతుందేమోనని కుమిలి పోతున్నారు. అడ్డులేదని..అడ్డదారులు తిరుమలకు వచ్చిన భక్తులు సెంటిమెంట్‌గా దేవుని పటాలు.. దారాలు తీసుకుని వెళ్తుంటారు. వీటిని చేతిలో పెట్టుకుని తిరుమలలో రోడ్లపై తిరుగుతూ విక్రయించే వ్యాపారులు అనేక మంది ఉన్నారు. వీరిలో స్థానికులే ఎక్కువ. ఇటువంటి వారికి టీటీడీ గతంలో అధికారికంగా హాకర్స్ లైసెన్సులు ఇచ్చింది. అవి 350 వరకు ఉండేవి. ప్రస్తుతం 900కి చేరాయి. తిరుమలలో అనధికారికంగా అన్నప్రసాద వితరణ కేంద్రం, నడక దారి లో లైసెన్సులు లేకుండా విక్రయాలు జరుగుతుం డేవి. వ్యాపారుల మధ్య తలెత్తే విభేదాలు తార స్థాయికి చేరుకునేవి. పుణ్యక్షేత్రంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవలే బదిలీపై వెళ్లిన సీవీఎస్ఓ రవికృష్ణ అనధికార హాకర్ల భరతం పట్టారు. నడకదారి నుంచి తిరుమల వరకు అనధికారిక హాకర్లను తొలగించారు. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అప్పటి సీవీఎస్ఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో ఆయన బదిలీకి ఇది కూడా ఓ కారణమైందని తిరుమలలో ప్రచారం జరుగుతోంది. పైసా వసూల్ టీటీడీని టీడీపీ నేతలు తమ ఆదాయ వనరుగా మార్చుకునేశారు. టీటీడీ ఈఓగా బాలసుబ్రమణ్యం ఉన్న సమయంలో తిరుమలలో 350 మందికి మాత్రమే హాకర్స్ లైసెన్సులు ఉండేవి. తర్వాత 730కి చేరాయి. తాజాగా మరో 170 లైసెన్సులు కొత్తవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒక్కో లైసెన్సుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లోని తమ అనుచరులు, వారి బంధువులను పిలిచి హాకర్స్ లైసెన్సులు కట్టబెడుతున్నట్లు తెలిసింది. మొదటి నుంచి తిరుమలలో ఉంటున్న వారికి కొందరికి మాత్రం లైసెన్సులు ఇచ్చి మిగిలిన అనుమతులను బినామీ పేర్లతో అమ్ముకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా అనధికారిక వ్యక్తుల సంఖ్య పెరిగిపోతోందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి హాకర్ లైసెన్సు దక్కితే సొంతంగా వ్యాపారం చేయలేకపోయినా... ఎవరికో ఒకరికి కట్టబెడితే ఆ లైసెన్సుకు నెలకు రూ.20వేలు అద్దె ఇస్తున్నట్లు తెలిసింది. తిరుమలలో హాకర్ లైసెన్సు ఉంటే టీటీడీలో ఉద్యోగం కన్నా పెద్దదే అని అక్కడ వ్యాపారులు చెబుతున్నారు. ఇటువంటి లైసెన్సుల కోసం ఎన్ని లక్షలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్న వారు అనేక మంది ఉన్నట్లు సమాచారం. హాకర్స్ లైసెన్సులు ఇవ్వడానికి టీటీడీ అధికారులు నిరాకరించినా... అధికారపార్టీ పెద్దల నుంచి ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది. తప్పని పరిస్థితిలో టీటీడీ అధికారులు కూడా లైసెన్సులు ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
‘డిప్యూటీ’పై సిగపట్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. -
దర్శన భాగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యయప్రయాసల కోర్చి పిల్లాపాపలతో మేడారం వస్తున్న భక్తులకు వనదేవతల దర్శనం దుర్లభంగా మారుతోంది. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, గద్దెలపై దేవతలకు మొక్కులు చెల్లించే విధానంలో స్పష్టమైన పద్ధతి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీ, అధికారుల సిఫార్సుతో వచ్చే ఇతర కుటుంబాలు, స్నేహితుల స్పెషల్ దర్శనాలతో చిక్కులు ఎక్కువవుతున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరింది. ఇలా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించే విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిఫార్సులు.. భక్తుల రద్దీ ఎక్కువైతే గేట్లకు తాళం వేసి గద్దెలపైకి ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. సాధారణ భక్తులు, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు దర్శ నం కోసం అడిగితే మా దగ్గర ఏమీ లేదు. పోలీసుల దగ్గరే గేట్ల తాళాలు ఉన్నాయంటూ దేవాదాయశాఖ సిబ్బంది సమాధానమిస్తున్నారు. దీంతో దూరం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో వీఐపీలు, ప్రభుత్వ అధికారుల బంధువులు, వారి సన్నిహితులు వస్తే గేట్లకు ఉన్న తాళం తీస్తూ గద్దెలపైకి అనుమతిస్తున్నారు. వీరితోపాటు గద్దెలపైకి చేరుకునేందుకు అక్కడున్న ఇతర భక్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గద్దెల గేట్ల వద్ద తీవ్రమైన తోపులాట జరుగుతోంది. సిఫార్సు చేయించుకునే వారిని గద్దెలపైకి అనుమతించి, సాధారణ భక్తులను అనుమతించకపోవడంతో వాగ్వావాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారైనా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఈ నిరాదరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే తమ పట్ల వివక్ష చూపారంటూ నిరాశ చెందుతున్నారు. దాగుడుమూతలు మేడారంలో రద్ధీ లేని రోజుల్లో ప్రధాన ప్రవేశ మార్గం గుండా భక్తులు గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు మొదట సమ్మక్క గద్దె మొదటి గేటు ద్వారా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించి రెండో గేటు గుండా బయటకు వస్తారు. అక్కడి నుంచి సారలమ్మ గద్దెకు మొదటి గేటు ద్వారా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని రెండో గేటు ద్వారా బయటకు వెళ్తారు. సెల వు రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరుకోవడంతో ప్రధాన ప్రవేశ మార్గాన్ని పూర్తిగా వీఐపీలకు కేటాయిం చారు. క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఒకటే గేటు ద్వారా లోపలికి వెళ్లడం, బయటకు రావడం కష్టంగా మారింది. ఎప్పుడో ఒకసారి వచ్చే వీఐపీ భక్తుల కోసం సమ్మక్క గద్దెకు సంబంధించి ఒక గేటు పూర్తిగా మూసివేయడంతో భక్తులు పాట్లు పడుతున్నారు. ఇబ్బందులు గద్దెలపై భక్తులు సమర్పించిన బంగారం, కొబ్బరి నీళ్లు కలిసి గద్దెల ప్రాంగణం తడిగా మారుతోంది. మొక్కు చెల్లించే బంగారాన్ని(బెల్లం) తలపై పెట్టుకుని తడిగా ఉన్న గ్రానైట్ ఫ్లోర్‌పై తీవ్రమైన తోపులాట మధ్య లోపలికి బయటికి వెళ్లడం కష్టంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలను ఎత్తుకుని గద్దెలపైకి చేరే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆదివాసీ వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయకుండా వీఐపీ, అధికారుల బంధువులకు ఓ విధానం, సాధారణ భక్తులకు ఓ విధానం అమలు చేయడంతో భక్తులను అదుపు చేయడం కçష్టంగా ఉందంటున్నారు. గద్దెలపైకి భక్తులను అనుమతించే విషయంలో జనవరి 30 వరకు కచ్చితమైన విధానం అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దూరం నుంచి వచ్చే తమకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
పదోన్నతుల పాకులాట
కొందరు పోస్టింగ్ కోసం వేచిచూస్తున్నారు. మరికొందరు పదోన్నతి కోసం పైరవీలు చేస్తున్నారు. వెరసి విద్యుత్ శాఖలో పనులు మాని పదోన్నతులు, పోస్టింగుల కోసం పాకులాడుతున్నారు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే శాఖలో అర్హులకు న్యాయం జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. నిజామాబాద్‌నాగారం: విద్యుత్‌శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతోంది. యూనియన్ల నాయకులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిర్వహించే యూడీసీ నుం చి జూనియర్ అకౌంట్ ఆఫీసర్(జేఏవో) సంబంధించి 32 పోస్టులకు పదోన్నతులు కల్పించి మూన్నెళ్లు అయ్యింది. పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. దీంతోపాటు ఏఈ నుం చి ఏడీఈ పదోన్నతుల కోసం ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్నవారు పైరవీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇది వరకే వరంగల్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు 48 జేఏవో నుంచి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్(ఏఏవో)గా పదోన్నతులు కల్పించారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పారదర్శంగా పదోన్నతులు పోస్టింగ్‌లిచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఆయన బుధవారం ఇక్కడికి రానున్నారు. దీంతో ఇక్కడ ఎలా జరుగుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. 29 మందికి పదోన్నతులు నిజామాబాద్ విద్యుత్‌శాఖ సర్కిల్ పరిధిలో 29 మందికి పదోన్నతులు కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 29 మంది ఎల్డీసీ నుంచి యూడీసీ పదోన్నతులు ఎస్ఈ కల్పించారు. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి ఈ పదోన్నతులవారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ నేత కోసమే.. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో మొత్తం 32 జేఏవో పదోన్నతులకు యూడీసీ వారికి జిల్లాశాఖ అధికారి ప్రభాకర్ డీపీసీ ద్వారా కల్పించారు. అయితే పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం జేఏవో పోస్టుల్లోనివారికి ఏఏవోగా పదోన్నతి కల్పిండంలో సీనియారిటీ దెబ్బతింటుందని. ఇవి మూన్నెళ్ల క్రితమే ఇ వ్వడంతో ఓ ప్రధాన కార్మిక సం ఘం నేతకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ పదోన్నతులు కేవలం ఆ సంఘం నేత కోసమే జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. త్వరలోనే ఏఈలకు పదోన్నతులు రెండు నెలలుగా ప్రధాన పోస్టుల కోసం పైరవీలు చేస్తూనే ఉన్నారు. వరంగల్ పరిధిలో మొత్తం 5 సర్కిళ్లలో 160 ఏడీఈ పోస్టులకు పదోన్నతులు రానున్నాయి. వీరిలో ఆంధ్రవారికి 43 పోగా మిగతా 117 పోస్టులకు పదోన్నతులు కల్పించాలి. ఏఈ నుంచి ఏడీఈగా మారేందుకు ఎవరికి వారే పనులు పక్కనబెట్టి పైరవీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వరంగల్ ఉన్నతాధికారుల దగ్గరికి చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో టౌన్–2 సెక్షన్ ఏర్పడనుండడంతో అదనంగా ఏడీఈ పోస్టు రానుంది. దీని కోసం జిల్లాలో సుమారుగా 15మంది ఏఈలు తీవ్రంగా పైరవీలు చేస్తున్నారు. -
అధ్యక్ష పదవికోసం టీ‘ఢీ’పీ
♦ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ♦ నామినేటెడ్ పదవుల కోసం గంపెడాశలు ♦ పెరిగిపోతున్న ఆశావహుల జాబితా ♦ ఎవరికి వారే పైరవీలు ♦ ఖరారు చేస్తే... రచ్చరచ్చే సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో చిచ్చు రేగబోతోంది. నిన్నటి వరకు మంత్రి పదవి విషయంలో రచ్చ చేసిన పచ్చనేతలు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నామినేటేడ్ పదవులపై పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్న నేతలు ప్రతీ పదవినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కేబి నెట్ విస్తరణ సమయంలో నేతలంతా రెండు గ్రూపులు గా విడిపోయారు. అధినేత జోక్యం చేసుకున్నా ఇంకా సఖ్యత కనబడటం లేదు. ప్రస్తుతం కలిసినట్టుగా కలరింగ్ ఇస్తున్నా లోలోపల రగిలిపోతూనే ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సత్తా ఏంటో చూపిస్తామంటూ గుంభనంగా ఉన్నారు. అధ్యక్ష పదవి రూపంలో మరో చిచ్చు ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ సుదీర్ఘకా లంగా అదే పదవిలో ఉన్నారు. గత సంస్థాగత ఎన్నికల్లో నే ఆయన్ను మార్చేందుకు టీడీపీలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అశోక్ అండదండలతో ఆయనే కొనసాగారు. ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అధ్యక్షుడిగానే కాకుండా ఎమ్మెల్సీ గా కూడా ఆయన కొనసాగుతున్నారు.దానికితోడు గతం కన్నా అశోక్ ప్రాధాన్యం పార్టీలో తగ్గింది. ఆయనకు మునపటి పట్టు లేదు. అది సుజయ్‌కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే తేటతెల్లమైపోయింది. కాబట్టి ఆయన ఆశీస్సులతో కొనసాగుతున్న జగదీష్‌ను ఆ పదవిలో కొనసాగించే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు ప్రయత్నాలు సుజయ్‌కృష్ణ రంగారావుకు మంత్రి పదవి రాకుండా సర్వశక్తులొడ్డిన గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనా యుడు అధ్యక్ష పదవికోసం ఇప్పుడు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికే ఇస్తారని... ఈ సమీకరణాల్లో తనకొస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడదే పదవి కోసం తన సోదరుడు కొండపల్లి కొండలరావు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. తనను అణగదొక్కుతున్నారన్న ఆందోళనతో తమ్ముడిని కాదని అధ్యక్ష పదవిని దక్కించుకుని సమాంతర రాజకీయాలు చేద్దామనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన సీఎం చంద్రబాబును కలిశారు. మంత్రి వర్గ విస్తరణకు ముందే సుజయ్‌కృష్ణ రంగారావు శిబిరంలో చేరారు. మిగతా నేతల మద్దతు కూడగట్టేందుకు ప్ర యత్నిస్తున్నారు. ఇక, ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా అధ్యక్ష పదవి కోసం ఆశలు పెట్టుకున్నట్టు తెలు స్తోంది. తనకు గాని, తన భర్త కోళ్ల రాంప్రసాద్‌కు గాని అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే పైరవీలు ప్రారంభించి నట్టు సమాచారం. తనకున్న టీటీడీ బోర్డు మెంబర్ పదవీ కాలం కూడా ముగియడంతో అధ్యక్ష పదవిని తన ఇంట్లోవారికే తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు కూ డా రేసులో ఉన్నామంటున్నారు. తనకు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వలేదు... కనీసం తన కుమారుడికి పార్టీ అధ్యక్ష పదవైనా ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మరో ఆశావహుని వద్ద ప్రస్తావించినట్టు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా, కుల వివాదంపై కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో జోష్‌తో ఉన్న సాలూరు మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తే పార్టీలో ఏం జరుగుతుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నామినేటేడ్ పోరు టీడీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ కనీసం జరగలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు తప్ప మరేవి భర్తీ కాలేదు. దేవస్థానాల పాలక మండళ్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వుడా డైరెక్టర్ పోస్టులతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా చంద్రబాబు తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడీ పదవుల కోసం ఆశపడి ఉన్న వారి జాబితా చాంతాడంత ఉంది. తెంటు లకు‡్ష్మంనాయుడు, కె.త్రిమూర్తులరాజు, ఐ. వి.పి.రాజు, కడగల ఆనంద్‌కుమార్, ఎస్.ఎన్. ఎం.రాజు, కర్రోతు నర్సింగరావు, గొట్టాపు వెంకటనా యుడు, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు, రావి శ్రీధర్ తదితరులు రేసులో ఉన్నారు. ఇందులో ఏమైనా తేడాలొస్తే పార్టీలో మరోసారి రచ్చ జరగడం ఖాయం. -
వీసాల లొల్లి: లాబీయింగ్ ఖర్చు 2.8 కోట్లు
హెచ్1 బీ వీసాలో తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలతో దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేదనే చెప్పొచ్చు. వీసా నిబంధనల్లో కొత్త ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచి కంపెనీలు ఆందోళనలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. దేశీయ ఐటీ కంపెనీల ఆందోళలనకు స్పందించిన ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, విదేశాంగమంత్రిత్వ శాఖ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ కోసం ఐటీ బాడీ నాస్కామ్ సుమారు 2.8 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిసింది. 2013 నుంచి ఇదే అత్యధిక మొత్తమని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. 2003 నుంచి నాస్కామ్, అమెరికా లాబీయింగ్ సంస్థ హిల్ సేవలను వాడుకుంటూ, అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ చర్చలు జరుపుతూ ఉంది. దేశీయ ఐటీ ఇంజనీర్లకు నిబంధనలు సరళీకరం చేసేందుకు నాస్కామ్ ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసాలపై ఆందోళన మరింత ఎక్కువైన సంగతి తెలిసిందే. అమెరికానే ఫస్ట్, అమెరికాను మళ్లీ గ్రేట్ గా రూపొందించడానికి ఉద్యోగాలు మళ్లీ వెనక్కి తీసుకొస్తానంటూ ట్రంప్ వాగ్ధానాలు చేశారు. ఈ వాగ్ధానాల మేరకు ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే పలు వివాదాస్పద ఆర్డర్లపై సంతకాలు చేశారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో ప్రతిపాదిస్తున్న కొత్త సంస్కరణలు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రతిపాదనలకు ట్రంప్ నుంచి స్ట్రాంగ్ మద్దతు ఉందని తెలుస్తోంది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల అమెరికాకే లాభమని నాస్కామ్ వాదిస్తోంది. -
అమెరికాతో లాబీయింగ్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై అమెరికా కాంగ్రెస్ తీసుకొస్తున్న నిబంధనలపై భారత్ తన లాబీయింగ్‌ను వేగవంతం చేసింది. స్కిల్డ్ వర్కర్లకు ఇచ్చే వీసాల్లో ఆంక్షలు విధించడం, టెక్నాలజీ సెక్టార్‌కు ప్రమాదకరమని అమెరికాతో భారత్ వాదిస్తోంది. వీసా నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులతో 3.5 మిలియన్లకు పైగా ఉద్యోగులకు తీవ్ర ప్రభావం చూపనుందని భారత్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. 150 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ సర్వీసుల ప్రాముఖ్యత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయానికి వివరించామని పరిశ్రమల, వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు, అమెరికన్ సిటిజన్లకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఆమె తెలిపారు. అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్‌తో ఎప్పడికప్పుడూ చర్చిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. అమెరిన్లకే ఉద్యోగాలు అనే ట్రంప్ నినాదంతో మన అతిపెద్ద ఐటీ ఇండస్ట్రి పరిస్థితి అతలాకుతలమవుతోంది. దేశీయ ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు కనీసం వేతనం రెట్టింపు చేస్తూ గత నెల అమెరికా కాంగ్రెస్ ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. దీంతో హెచ్-1బీ వీసా ఆందోళనలు భారీగా పెరిగాయి. దేశీయ హై-టెక్ ఇండస్ట్రి అసోసియేషన్ నాస్కామ్ సైతం అమెరికా చట్టసభ్యులు, కంపెనీలతో చర్చలు చేపట్టింది. అమెరికాలోకి ప్రవేశించే స్కిల్డ్ వర్కర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దంటూ తన విన్నపాలు వివరించింది. -
పీఏసీఎస్ ‘చైర్మన్’ కోసం లాబీయింగ్
♦ అధికార పార్టీకి అండగా రంగంలోకి ఎమ్మెల్యే తీగల ♦ చైర్మన్ పీఠంపై తమ వారికే దక్కేలా ప్రయత్నాలు ♦ పదవి కాపాడుకునేందుకు ప్రస్తుత చైర్మన్ తంటాలు ♦ రసవత్తరంగా కందుకూరు రాజకీయం కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇవ్వడంతో మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో డైరెక్టర్లను కాపాడుకోవడానికి ఇరువైపులా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కందుకూరు పీఏసీఎస్ పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్లు 2013 జనవరి 31న ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2న రాచులూరు డైరెక్టర్ వెదిరె నర్సింగంరెడ్డి చైర్మన్(కాంగ్రెస్)గా, గూడూరు డైరెక్టర్ సురసాని ఎల్లారెడ్డి వైస్ చైర్మన్‌గా అప్పట్లో ఎన్నికయ్యారు. అయితే, 2015 ఫిబ్రవరిలో మొదటిసారిగా కందుకూరు డైరెక్టర్ సురసాని హరికిషన్‌రెడ్డి.. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అప్పట్లో అది వీగిపోయింది. ప్రస్తుతం తిరిగి కందుకూరుకు చెందిన మీర్కాన్‌పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్(టీఆర్ఎస్) పదిమంది డైరెక్టర్ల సంతకాలతో ఈ నెల 11న మరొకసారి చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి డీఎల్ఓకు నోటీసులు అందించారు. దీంతో ఆగస్టు 2న పదకొండు గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించే అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలని డైరెక్టర్ల అందరికి సంబంధిత అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ప్రస్తుత చైర్మన్ తన పదవిని కాపాడుకోవడానికి తనతో కలిసి ఐదుగురు డైరెక్టర్లు అవసరం ఉంది. అవిశ్వాసం నెగ్గించుకోవాలంటే 9 మంది డైరెక్టర్లు అవసరం. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కాగా, గతంలో ఒకసారి అవిశ్వాసాన్ని నెగ్గించుకోలేకపోవడంతో ఈ దఫా సవాలుగా తీసుకున్న అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉన్న డైరెక్టర్లతో విశాఖపట్నంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంబంధిత డైరెక్టర్లతో గట్టి హామీ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు తీసుకుని చైర్మన్‌గా మల్లేష్‌ను ఎన్నుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అవిశ్వాస పరీక్షను నెగ్గించుకుని చైర్మన్ పదవిని ఏవిధంగానైనా అధికార పార్టీ దక్కించుకోవడానికి పావులు కదుపుతుంది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో మల్లేష్ తమకు అవసరమైన 9 మంది డైరెక్టర్ల మద్దతు కూడగట్టుకుని ధీమాగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరో పక్క అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేయడానికి ప్రస్తుత చైర్మన్ నర్సింగంరెడ్డి తన ప్రయత్నాల్లో బిజిబిజీగా ఉన్నారు. తనతో కలిసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అవిశ్వాసాం వీగిపోతుందా? నెగ్గుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది. -
తెర వెనుక మంత్రం.. బదిలీలకు దూరం
* జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీల్లో లాబీయింగ్ * జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించడంపై తీవ్ర గందరగోళం * 10 శాతం కూడా బదిలీకి అనర్హులే * జీజేఎల్ఏ ప్రతిపాదించిన తేదీని కటాఫ్‌గా నిర్ణయించడంపై ఆగ్రహం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ లెక్చరర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఐదేళ్లు సర్వీసు పూర్తై లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సర్వీసు కటాఫ్ తేదీని జూన్ ఒకటో తేదీగా నిర్ణయించడంతో ఫలితం లేకపోయింది. 2011 సంవత్సరంలో జరిగిన బదిలీల్లో దాదాపు 70 శాతం మందికి స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం వారి సర్వీసు నాలుగు సంవత్సరాల 11 నెలల పది రోజులు. దీంతో వారందరూ బదిలీ నుంచి విముక్తి పొందుతారు. కేవలం 5 నుంచి 10 శాతం మంది కూడా బదిలీకి అర్హులు కావడంలేదు. వీరంతా 20 శాతం హెచ్ఆర్ఏ, మంచి స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థానం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. జూన్ ఒకటి కటాఫ్ తేదీ కోసం లాబీయింగ్.. 2011 నుంచి 2015వ తేదీ వరకు జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీలు జరిగాయి. అయితే ఎప్పుడూ జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించలేదు. ప్రతిసారీ జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించి ఐదేళ్లు పూర్తైవారిని కచ్చితంగా బదిలీ చేసేవాళ్లు. 3 ఏళ్ల సర్వీసు పూర్తై వారిని రిక్వెస్టు బదిలీ కింద పరిగణించేవారు. 2013లో మే 31న జనరల్ జీఓ ఇచ్చినా అప్పుడూ కూడా జూన్ 30వ తేదీనే కటాఫ్‌గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం కొందరు ప్రయోజనాల కోసం ఓ సంఘం తీవ్ర లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఆ సంఘం వినతి మేరకు ఇంటర్ బోర్డు అధికారులు జూన్ ఒకటికి బదులు జూన్ 30వ తేదీని కటాఫ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే.. మరోవైపు జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే దాదాపుగా 70 శాతం మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 500 మందికి స్థాన చలనం కలుగుతుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు మరో ఐదేళ్లు అక్క డే పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు కోరుతున్నారు. 360 మందికి బదిలీ నుంచి విముక్తి జోన్-4లో దాదాపుగా 800 మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పని చేస్తున్నారు. 2011లో జూన్ 30వ తేదీని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్‌గా తీసుకొని దాదాపుగా 400 మందిని బదిలీ చేశారు. వీరందరూ జూన్ 10-15 తేదీల మధ్య రిలీవ్ అయి కొత్త స్థానాల్లో కొలువు దీరారు. ఇందులో 20 శాతం హెచ్ఆర్ఏ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారే అధికం. వీరిలో కొందరు అక్కడి నుంచి బదిలీ కాకుండా ఉండేందుకు ఓ సంఘంతో కలసి లాబీయింగ్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి కావడంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కారణంతో బదిలీ కాకుండా ఉండేందుకు ఎప్పుడూ లేని విధంగా కటాఫ్ తేదీనే మార్పించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్ తేదీగా నిర్ణయించడంతో జోన్-4లో దాదాపుగా 360 మందికి బదిలీ నుంచి విముక్తి లభిచించింది. కర్నూలులో జిల్లాలో కేవలం 12 మంది మాత్రమే బదిలీ అవకాశముంది. కడపలో 8 మందికి, చిత్తూరులో 15 మందికి, అనంతపురంలో 11 మందికి కచ్చిత బదిలీ కానున్నది. 84 మంది దరఖాస్తు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 84 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డీవీఈఓ డీసీ కబీరు తెలిపారు. వీరిలో కచ్చితంగా బదిలీ కావాల్సిన వారు 19 మంది ఉన్నారన్నారు. రిక్వెస్టు బదిలీల కోసం మొత్తం 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రిన్సిపాళ్లు ఐదుగురు, లెక్చరర్లు 46 మంది, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, టైపిస్టు ఒక్కరు, రికార్డు అసిస్టెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు ఇద్దరు ఉన్నారు. ఇందులో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు ఈనెల 30న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుంద ని, అధ్యాపకేతర సిబ్బందికి డీవీఈఓ కార్యాలయంలోనే కౌన్సెలింగ్ ఉంటుందని, అయితే ఇంకా తేదీని ఖరారు చేయలేదన్నారు. -
అమెరికాలో హక్కుల స్వరం...
బాలల హక్కులపై తమ స్వరాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినిపించేందుకు ఢిల్లీకి చెందిన నైన్ ఈజ్ మైన్ సంస్థ సభ్యులు పదిహేను మంది న్యూయార్క్ వెళ్ళారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నిర్వహించే అభివృద్ధి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో భారత ప్రధాని అమెరికా పర్యటన కూడా జరగడంతో వారు తమ డిమాండ్లను ఆయనకూ వినిపించేందుకు ప్రయత్నించారు. నైన్ ఈజ్ మైన్ నరేంద్రమోడీ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను పెట్టింది. బడ్జెట్ లో ప్రస్తుతం 3.5, 1గా ఉన్న విద్యకు... స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి ఆరుశాతం, ఆరోగ్యం కోసం వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్స్ (UNE) నుంచి ఐదు శాతం, కేటాయించాలని తమ నోట్ లో కోరింది. సంస్థ 2006 సంవత్సరం నుంచీ ఈ విషయంలో ప్రత్యేక పోరాటం జరపుతోంది. అన్ని బాలల హక్కులతోపాటు విద్యా, ఆరోగ్యం విషయంలోకూడా ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ ను అమలు పరచాలన్నదే తమ డిమాండ్ అని ప్రచార కన్వీనర్ స్టీవ్ రోచా తెలిపారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం తన బడ్జెట్లో 10, 11, 12 ప్రణాళికల్లో ఆరోగ్యానికి 1.7 శాతం నుంచీ 2 శాతం ఇచ్చిందనీ, అది ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క శాతం మాత్రమే ఉండటం శోచనీయమని రోచా అన్నారు. తాము జెనీవా వెళ్ళినపుడు ఓ దళిత బాలుడు భారత్ ను తీవ్రంగా విమర్శించిన ఘటన ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిందేనని రోచా అన్నారు. మినహాయింపుల సమస్యలపై అతడు ప్రశ్నించిన తీరు భారత సమాజం, ప్రభుత్వం తలెత్తుకోలేనిదని రోచా వివరించారు. అలాగే హక్కుల బృందం నోట్ పై యూ ఎన్ ఏజెన్సీలు కూడ చర్చించాయని, కానీ ఇండియా అందులో లేదని అన్నాడు యువ బృందంలోని బాత్రా. తమ బృందం ఆరోగ్య, విద్య డిమాండ్లను గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించినా.. సరిగా స్పందించలేదన్నారు. ''మేం నిజానికి మీకు సహాయం అందించగలం. ప్రభుత్వం కూడ కేటాయింపులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పౌరులుగా ఆరోగ్యం, ఆహారం, విద్య వంటి విషయాలపై చర్చించడం మీ కర్తవ్యం. అయితే మంచి ఆహారం తీసుకోవడం, బాగా చదువుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ విధి'' అని మంత్రిత్వ శాఖ అందని బాత్రా తెలిపారు. అయితే ఇండియానుంచీ బాలల హక్కుల సాధనకోసం వెళ్ళిన పదిహేను మంది యువకుల బృందంలోని పూర్ణ మలావత్, కోన్ఘమ్ లు ఇంతకు ముందెప్పుడూ న్యూయార్క్ ను సందర్శించలేదు. దీంతో వారు న్యూయార్క్ పర్యటనను ఎంతో థ్రిల్ గా ఫీలయ్యారు. సినిమాల్లో స్సైడర్ మ్యాన్ వేలాడే ఆకాశహర్మ్యాల వంటి భవనాలను అక్కడ చూసి ముగ్ధులయ్యారు. మలావత్ రెండేళ్ళక్రితం పదమూడేళ్ళ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన బాలిక. ఇప్పుడు ఆమె న్యూయార్క్ వెళ్ళిన బృందంలోని పదిహేను మంది సభ్యుల్లో ఒకరు. ఎనిమిదో తరగతి చదువుతున్న కోన్ఘమ్.. కూడ '' నేను ప్రపంచ శాంతి..న్యాయంకోసం సహాయం అడుగుతున్నాను'' అంటూ అధికారులకు తన స్వరం వినిపించాడు. మణిపూర్ లో నివసించే అతడు పుట్టిన కొన్నాళ్ళకే తల్లి కంటి కంటిచూపు కోల్పోయింది. తండ్రి భారత భద్రతా దళాలతో చంపబడ్డాడు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయకపోవడం వల్లే ఆ అనర్థం జరిగిందన్న ఆలోచనతో కోన్ఘమ్ అలా అన్నాడు. నిజానికి మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ పై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు నైన్ ఈజ్ మైన్ వంటి కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని జవాబుదారీగా గా చేశాయి. ప్రస్తుత బడ్జెట్ లో స్మృతి ఇరానీ విద్యకు ఆరుశాతం గురించి మాట్లాడటం కూడ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోందని, అందుకే హక్కులపై అవగాహనను ప్రజల్లో మరింత పెంచాల్సిన అవసరం కూడ ఉందంటారు నైన్ ఈజ్ మైన్ సభ్యులు. -
‘నారాయణ’ మంత్రం
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతల జపం కార్పొరేట్ లాబీయింగే కలిసొస్తుందన్న ఆశ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆయనెవరో రాష్ట్రప్రజలకు పెద్దగా తెలియదు. ఎన్నికలకు ముందు సీట్ల కోసం టీడీపీలో కార్పొరేట్ లాబీయింగే బాగా నడిచింది. దీంతో ఓ కార్పొరేట్ సంస్థ ప్రతినిధి అయిన ఆయన అకస్మాత్తుగా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వ చ్చారు. ఆ కార్పొరేట్ నేత సిఫార్సు మేరకే సీట్లు ఖరారు చేసింది. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆయనకే అధిష్టానం పెద్ద పీట వేస్తోంది. దీంతో సీనియారిటీ, పార్టీ పరమైన లాబీయింగ్ కలిసిరాదనే ఉద్దేశంతో నేతలంతా ఇప్పుడు ఆ కార్పొరేట్ ప్రతినిధి, రాష్ట్రమంత్రి నారాయణ..పేరును జపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆయన్ను కలిసి పదవుల కోసం ప్రాథేయ పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నికలకు ముందు ఒక్క విజయనగరం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనే సీట్ల ఎంపిక విషయంలో మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరించారు. అత్యధిక నియోజకవర్గాలకు ఆయన ప్రతిపాదించిన అభ్యర్థుల్నే అధిష్టానం ఖరారు చేసింది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లో సదరు అభ్యర్థుల విజయం కోసం భారీగా ఖర్చు పెట్టారన్న వాదనలు ఉన్నాయి. ఇక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నారాయణ హవాయే నడుస్తోంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణి ఎంపికలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్పాయి. పార్టీ సీనియర్లుగా ఉన్న శోభా హైమావతి, ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, గద్దే బాబూరావు, తూముల భాస్కరరావు, డాక్టర్ వీఎస్ ప్రసాద్, తెంటు లక్ష్మునాయుడు, భంజ్‌దేవ్, లగుడు సింహాద్రి, కె.త్రిమూర్తులురాజు తదితరులు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా గుమ్మడి సంధ్యారాణిని అధిష్టానం ఎంపిక చేసింది. ఆమె ఎంపిక విషయంలో నారాయణ మాటే చెల్లుబాటు అయ్యిందన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఇదేదో అయ్యిందనేసరికి ఏంఎసీ కమిటీల ఖరారు విషయంలో కూడా నారాయణ సిఫార్సులే ఫలించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగిపోలేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా నారాయణే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినోళ్లే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గట్టిగా కోరుతున్నారు. కానీ అధిష్టానం ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదిత జాబితాలో వీరి పేర్లు కాకుండా ఎవరికీ తెలియని ’నెల్లిమర్ల సత్యం’ పేరు చేరింది. ఈయనెవరో ఆ పార్టీ నేతలే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 20ఏళ్ల క్రితంలో ఆయన నెల్లిమర్ల మండలంలో ఉండేవారని, గతంలో వారి సంబంధీకులు రాజకీయాల్లో ఉండేవారని, భోగాపురంలో వందల ఎకరాల భూములు ఉన్నాయని, ప్రస్తుతం మంత్రి నారాయణ వ్యవహారాలు చూసుకుంటున్నారని రకరకాలుగా ఆరాతీసి క్లారిటీ తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరికీ తెలియని నెల్లిమర్ల సత్యం పేరు నారాయణ జోక్యంతోనే తెరపైకి వచ్చిందని పార్టీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా సీనియర్ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి సేవలందించని, ఎవరికీ తెలియని నేతను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయ డమేంటని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అభ్యర్థిత్వం సందిగ్ధంలో పడింది. ప్రభుత్వంలో ఏం సాధించాలన్నా, ఏం దక్కించుకోవాలన్నా నారాయణే కీలకమని, ఆయన దృష్టిలో పడితే చాలని, ఆయన సిఫార్సు చేస్తే పదవి ఖాయమనే అభిప్రాయానికి టీడీపీ నేతలొచ్చారు. దీంతో ఇప్పుడు ఒక్కొక్కరూ నారాయణను కలిస్తూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
లాబీయింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు
గల్లా అరుణ సంచలన వ్యాఖ్య చిత్తూరు: కష్టపడి పనిచేయకుండా.. షో చూపించి హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వారికే తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో మంగళవారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇచ్చేలా చూడాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కోరారు. -
పైరవీలకే పెద్దపీట
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విడుదల చేసిన మార్గదర్శకాలు విభిన్నంగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక చోట ఉన్న సీనియారిటీ, ఇతర అప్షన్లు వంటి ప్రమాణాల ఆధారంగా బదిలీలు జరిగేవి, ఈ సారి బదిలీల నిబంధనల్లో కమిటీలకు ప్రదాన్యమివ్వడంతో రాజకీయ జోక్యానికి పెద్దపీట వేసినట్టయింది. ఇప్పటికే జిల్లాలో మంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ బదిలీల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యం ఉంటుందని, తమకు అనుకూలమైన వారినే నియమించుకోవాలని ఇదివరకే సూచించారు. దీనిని బట్టి బదిలీల్లో రాజకీయ పైరవీలు, సిఫార్సులు ఆధికంగా ఉంటాయని స్పష్టమౌతోంది. ఈసారి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీరి బదిలీలు చేయలేదు. ఇక ఆడిట్, ఖజానా శాఖఉద్యోగులకు ఈ బదిలీల్లో మినహాయింపునిచ్చారు. వీరి శాఖల్లో ఎలక్ట్రానిక్ పేమెంటు విధానం, కంప్యూటరీకరణ, ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తరువాత వారికి తలెత్తే అవకాశం లేకుండా ఉండేందుకే బదిలీల నుంచి మినహాయింపు నిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖజానాశాఖ సిబ్బంది మూడేళ్లుగా బదిలీలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి బదిలీల ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల పేరిట రాజకీయ ప్రమేయాన్ని పెంచుతున్నారని, పరిపాలనా సౌలభ్యం పేరిట ఇష్టంలేనివారిని, వారికి అనుకూలంగా లేనివారిని అక్రమంగా బదిలీలు చేసేందుకు ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వారు విమర్శిస్తున్నారు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ఈసారి బదిలీల్లో కీలకంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ఉంటాయి. ఈ శాఖలతో నాయకులకు, ప్రజలకు ఎక్కువగా పనులు ఉండడంతో ఈ శాఖల్లో బదిలీలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ప్రారంభించారు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, తహశీల్దార్ల బదిలీలకు గిరాకీ ఉంది. గత ఏడాది జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుల పీఏలు కీలక పాత్ర పోషించారు. యూనియన్ ఆఫీస్ బేరర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా బదిలీచేసి వారి పంతం నిలబెట్టుకున్నారు. అదే పరిస్థితి పంచాయతీ రాజ్ శాఖలో జరిగింది. అప్పట్లో మిగిలిపోయినవారికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. అందుకోసం నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటినుంచే వారిచుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. -
పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డుల కోసం లాబీయింగ్ చేస్తారని, ఆ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. రాజకీయ పరిచయాలు ఉన్నవాళ్లకే ఆ అవార్డులు వస్తాయన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రమే ఈ అవార్డులు రావడం సాధ్యమని చెప్పారు. పద్మభూషణ్ నుంచి పద్మశ్రీ వరకు అన్ని అవార్డులు మంచి వాళ్లకు.. వాళ్లు వాళ్లు ఆయా రంగాల్లో సాధించిన విజయాలకు అనుగుణంగా ఇస్తారనే ప్రపంచం అంతా అనుకుంటుంది గానీ, లాబీయింగ్ చేసేవాళ్లకు మాత్రమే ఇవి దక్కుతాయని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాందేవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ ఏడాది తనకు ఇవ్వజూపిన పద్మ అవార్డును రాందేవ్ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
లాబీయింగ్‌ను చట్టబద్ధ్దం చేయాలి
ఆసోచామ్ డిమాండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సంబంధాల్లో పారదర్శకత పెంచడానికి లాబీయింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆసోచామ్ కోరింది. ప్రభుత్వ రహస్య అధికారిక పత్రాలను చేజిక్కించుకునే కార్పొరేట్ గూఢచర్యం వెలుగుచూసిన నేపథ్యంలో ఆసోచామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లాబీయింగ్ అనేదానిని చెడ్డపదంగా పరిగణించకూడదని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ పేర్కొన్నారు. లాబీయింగ్‌లో ఏది ఆమోదయోగ్యమైనదో, ఏది కాదో, ఏది చట్టబద్ధమైనదో, ఏది చట్టవిరుద్ధమైనదో నిర్వచించే సమయం ఇదేనని చెప్పారు. చాలా దేశాల్లో లాబీయింగ్‌కు స్పష్టమైన నిర్వచనం ఉందని, భారత్‌లో మాత్రం లాబీయింగ్ అంటే లంచాలివ్వడంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. పారదర్శకత కావాలి విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత అవసరమని రావత్ పేర్కొన్నారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని నినాదంగా కాక ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏ భారత పౌరుడైనా ప్రభుత్వం నుంచి సమాచారాన్ని, కావలసిన డాక్యుమెంట్లను పొందవచ్చని గుర్తు చేశారు. బడ్జెట్ తయారీ కూడా పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. -
గ్రామ సమాఖ్యలకు పచ్చదనం!
ఎచ్చెర్ల రూరల్: గ్రామస్థాయిలో వీలున్న అన్ని పదవులను తెలుగుదేశం కార్యకర్తలతో నింపేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. ఇందుకోసం దొంగ సంతకాలు వంటి చర్యలకు సైతం దిగజారుతున్నారు. ఎచ్చెర్ల మండలంలో పొన్నాడ, ధర్మవరం సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు)లను ఇదే రీతిలో తొలగించారు. పొన్నాడ సీఎఫ్ శ్రీనివాసరావును ఇప్పటికే తొలగించగా, తాజాగా ధర్మవరం సీఎఫ్ చెక్కా పార్వతి తొలగింపు వ్యవహారం సభ్యులంతా ఎదురు తిరగడంతో రచ్చకెక్కింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండా కృష్ణవేణి దొంగ సంతకాలతో రూపొందించిన తీర్మానాన్ని ఎంఎంఎస్కు అందజేసి పార్వతిని తొలగించారని ధర్మవరం స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు ఆరోపించారు. కేశవరావుపేటలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి మంగళవారం వారంతా వచ్చి పార్వతిని విధుల్లోకి తీసుకోవాలని, దొంగ సంతకాలతో తీర్మానాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారిని తొలగించాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలకు ఇన్నాళ్లు కష్టపడి పని చేసిన సీఎఫ్‌లు బలి అవుతున్నారని ఆరోపించారు. తొలగింపునకు గురైన కృష్ణవేణి మాట్లాడుతూ ధర్మవరం క్లస్టర్లో ఉన్న 37 సంఘాల్లో 31 సంఘాలు తనకు మద్దతిస్తున్నాయని, అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల ఎరతో సంతకాలు తమ నుంచి సంతకాలు తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే సీఎఫ్ తొలగింపు కోసమని చెప్పలేదని సంఘాల అధ్యక్షులు స్పష్టం చేశారు. గ్యాస్ కనెక్షన్లు, రుణాలు ఇప్పిస్తామని, రుణమాఫీ వర్తింపజేస్తామని ఆశ చూపి తమ నుంచి సంతకాలు సేకరించారని ఆరోపించారు. ఉన్న పళంగా పార్వతిని తొలగించడం.. దీనికి ఆమె ఎదురుతిరిగి గత నెల 22వ తేదీన సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి ఆరా తీయడంతో ఈ విషయం బయటపడింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండ కృష్ణవేణి గైర్హాజరైన ఈ సమావేశంలో పార్వతి మాట్లాడుతూ ఁనన్ను తొలగించాలని కోరుతూ మీరంతా సంతకాలు చేశారట.. నిజమేనా?రూ. అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి సంతకాలు తీసుకున్నారని వారు వివరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ పార్వతి పలువురిని కలిసినా ఫలితం లేకపోయింది. దాంతో మంగళవారం సంఘాల అధ్యక్షులతో మళ్లీ సమావేశం నిర్వహించారు. దీనికి కూడా కృష్ణవేణి హాజరుకాలేదు. కాగా సమావేశానంతరం పార్వతితోపాటు సభ్యులందరూ మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి వచ్చారు. వారు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం భాగ్యలత అక్కడి నుంచి జారుకున్నారు. ఐకేపీ ఏసీ రవికుమార్‌కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణి కార్యాలయంలోనే ఉన్నా బయటకు రాలేదు. దీంతో కార్యాలయం బయట సంఘాల అధ్యక్షులతో కలిసి పార్వతి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై ఉదయకుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏం తప్పు చేసిందని పార్వతిని తొలగించారో చెప్పాలని, గ్రామంలో నిర్వహించిన సమావేశాలకు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఎందుకు హజరుకావటం లేదని ఆందోళనకారులు నిలదీశారు. సమాధానం చెప్పేంతవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని కార్యాలయంలోనే ఉన్న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణిను బయటకు తీసుకువచ్చారు. ఆమె వచ్చి గ్రామ పెద్దలతో చర్చించి, సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మా గోడును వినడానికి అధికారులు లేకుండా పోయారని.. ఎవరితో చెప్పుకోవాలని సభ్యులంతా వాపోయారు. ఈ విషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎస్సై హమీ ఇవ్వటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
టీడీపీలో మొదలైన అసంతృప్తి, అలకలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో నామినేటేడ్ పదవుల పందేరం చివరి దశకొచ్చింది. జిల్లా నుంచి జాబితాలు పంపించాలని ఆదేశించడంతో సిఫార్సులు, పైరవీలు ఊపందుకున్నాయి. ఇప్పుడిది కీలక నేతలకు తలనొప్పిగా మారింది. సర్దుబాటు చేయలేక ఇబ్బందు లు పడుతున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అంతుచిక్కక ఆశావ హులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని పదవులకు సూచనప్రాయ సంకేతాలందడంతో ఇప్పటికే కొందరు అలక బూనుతున్నారు. మరికొందరు కారా లు, మిరియాలు నూరుతున్నారు. ఇంకొం దరు సమయం వచ్చినప్పుడు చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో నేతలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. పదవులు ఖరారు అయ్యాక లుకలుకలు బయటపడనున్నాయి. అసంతృప్తివాదులు రోడ్డెక్కే అవకాశం ఉంది. దీన్ని గమనించిన నేతలు ఇప్పటికే బుజ్జగింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం ... ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు పార్టీ పదవులు చేపడుతున్న నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఈ పదవిని ఆశిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, సాలూరు నియోజకవర్గ నేత గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు తెంటు లక్ష్మునాయుడు, ఆర్పీ భంజ్‌దేవ్, శోభా హైమావతి, చీపురుపల్లి నియోజకవర్గ నేత కె. త్రిమూర్తులరాజు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, డాక్టర్ వీఎస్ ప్రసాద్ రేసులో ఉన్నారు. సామాజికవర్గ కోటాలో, డివిజన్ కోటాలో, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో కోరుతున్నారు. ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీలో పట్టు ఉన్న నేతలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరైతే ఎంతైనా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్ట పడి పనిచేశామని, అప్పుడిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అధినేత చంద్రబా బునాయుడ్ని కోరుతున్నారు. ఆశావహులంతా ఇప్పటికే తమ బయోడేటాలందజేశారు. నేతలంతా బయటకు కలిసి మెలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా లో లోపల ఎవరికి వారు ఎదుటి వారిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవుల కోసం... జిల్లాలో తొమ్మిది ఏఎంసీలుండగా అందులో ఇప్పటికే ఒకటి తేలిపోయింది. సాలూరు ఏఎంసీ చైర్మన్‌గా విక్రం సుదర్శనరావు దాదాపు ఖరారయ్యారు. అధికారిక ఉత్తర్వులు రావల్సి ఉంది. దీంతో మిగతా ఎనిమిది చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సిఫారసులతో ప్రయత్నిస్తున్నారు. విజయనగరం ఏఎంసీ చైర్మన్ పదవి కోసం సైలాడ త్రినాథరావు, కర్రోతు వెంకట నర్సింగరావు, మన్యాల కృష్ణ, నడిపిల్లి రవి కుమార్ ఆశిస్తున్నా... ప్రధాన పోటీ సైలాడ త్రినాథరావు, కర్రోతు మధ్యే ఉంది. ఇందులో ఒకరికి ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ బంగ్లా కోటరీ నేతలు మద్దతు పలకగా, ఇంకొకరు ఆశోక్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవి ఖరారయ్యాక ఇక్కడ తప్పనిసరిగా విభేదాలు పొడచూపడమే కాకుండా, కొందరు నేతల తీరుపై రోడ్డెక్కే అవకాశం ఉంది. కొత్తవలస ఏఎంసీకి పి.సులోచన, తిక్కాన చిన దేముడు, గొంప వెంకటరావు పోటీ పడుతున్నారు, పార్వతీపురానికి రెడ్డి శ్రీను, డి.మోహన్, బొబ్బిలికి పువ్వల శ్రీనివాసరావు, రమేష్‌నాయుడు, గజపతినగరానికి చంటిరాజు, చొప్ప చంద్రశేఖర్, ఎం. గౌరీనాయుడు, జి.అప్పలనాయుడు, ఎం.వెంకటరమణ పోటీ పడుతున్నారు. కురుపాం ఏఎంసీ చైర్మన్ పదవిని గుంటముక్కల వెంకటరమణమూర్తి, అంధవరపు కోటేశ్వరరావు, పల్ల రాంబాబు, బాబూల్ పాత్రుడు ఆశిస్తున్నారు. పూసపాటిరేగ ఏఎంసీకి దంతులూరి సూర్యనారాయణ రాజు, గేదెల రాజారావు, కర్రోతు సత్యనారాయణ, దల్లి ముత్యాలరెడ్డి, బొంతు అప్పలనాయుడు ఆశిస్తుండగా దంతులూరి సూర్యనారాయణ రాజుకు పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, చీపురుపల్లి ఏఎంసీకి, ఆర్ఈసీఎస్ అధ్యక్ష పదవికీ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, సీతారామరాజు పోటీ పడుతున్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి ఖరారైనా మిగతా వారి నుంచి నిరసన సెగ తాకనుంది. ఇప్పటికే తమను కాదని మరొ కర్ని సిఫార్సు చేస్తున్నారంటూ నియోజకవర్గ నేతలపై పలువురు ఆశావహులు మండిపడుతున్నారు. నామినేటేడ్ పదవుల విషయంలో జరుగుతున్న వసూళ్ల పర్వం కూడా బయట పెట్టే అవకాశం ఉంది. గ్రంథాలయ అధ్యక్ష పదవికి.. జిల్లా గ్రంథాలయ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఈ పదవిని పార్టీ సీనియర్ నేత గొట్టాపు వెంకటనాయుడు, ఎయిమ్స్ అధినేత కడగల ఆనంద్‌కుమార్, గజపతినగరం నేత రావి శ్రీధర్, కొమరాడ నేతలు దేవకోటి వెంకటనాయుడు, సంగిరెడ్డి మధుసూధనరావు, పార్వతీపురం నేత బర్నాల సీతారామరావు ఆశిస్తున్నా, ప్రధాన పోటీ మాత్రం గొట్టాపు వెంకటనాయుడు, కడగల ఆనందకుమార్ మధ్యే ఉంది. కడగల ఆనందకుమార్ పేరును నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ప్రతిపాదిస్తుండగా, గొట్టాపు వెంకటనాయుడు పేరును పార్వతీపురం డివిజన్ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఈ మధ్య ఆనంద్‌కుమార్ పేరు ఖరారైందని పుకార్లు కూడా వచ్చాయి. దీంతో పార్వతీపురం డివిజన్ నేతలు ఆనంద్‌ను లక్ష్యంగా చేసుకుని పావులు కదుతుపున్నారు. ఏనాడు జెండా పట్టుకోని, ప్లెక్సీలు కట్టని, పార్టీ కోసం పనిచేయని నేతకు ఎలా ప్రాధాన్యమిస్తారని, దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన నేతల్ని కాదని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల అండదండలతో వ్యాపారం చేసుకునే వ్యక్తిని ఎలా పరిగణలోకి తీసుకుంటారన్న వాదనను తెరపైకి తెచ్చారు. పలు సందర్భాలలో మనసులో ఆవేదనను కూడా వ్యక్తం చేవారు. దీంతో ఆనందకుమార్ ఆశలపై పార్వతీపురం డివిజన్ నేతలు కాస్త నీళ్లు జల్లినట్టు అయింది. ఈ నేపథ్యంలో అశోక్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో, గ్రంథాలయ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీలో కూడా నెలకొంది. -
కురుపాం ఏఎంసీ రేసులో ఇద్దరు..!
కురుపాం : కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎవరికి వారే పైరవీ లు చేస్తున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంధవరపు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుంటముక్కల వెంకటరమణమూర్తి మధ్య పోటీ నెల కొంది. ఇప్పటికే ఇద్దరూ తమ మనసులో మాటను, బలాబలాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.కోటేశ్వరరావుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వీటీ జనార్దన థాట్రాజ్ ఆశీస్సులు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయం లో మాజీ ఎంపీపీ రమణ మూర్తి కురుపాం, గు మ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, సర్పం చులు, మండల కన్వీనర్లు, నాయకుల బలం కూడగట్టుకొని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ , జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి సహకా రం కోరుతున్నట్టు తెలిసింది. తాను మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నందుకు ఏఎంసీ పదవి తనకే వచ్చేలా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. అలాగే మూడు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, పలు పంచాయతీలకు చెందిన సర్పంచుల అభిప్రాయాలతో పాటు మూడు మండలాల్లో ఇటీవల నిర్వహిం చిన క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు వివరాలను లిఖిత పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ పార్టీ యువ నాయుకుడు నారా లోకేష్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు సమాచారం. దీంతో కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఆది నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు కనీసం ఏఎంసీ పదవైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల వ్యక్తిగత స్వార్థాల కోసం కాంగ్రెస్ నుంచీ టీడీపీలో చేరిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
ఏపీ మంత్రుల వింత పోకడ..!
-
ఏపీ మంత్రుల వింత పోకడ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల వింత పోకడ విచిత్రంగా ఉంది. వడ్డించేవారు మనవాళ్లు అయితే...అన్న చందంగా మంత్రులు ... ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఏజెంట్ల నియామకాల కోసం మంత్రల పేషీలో లాబీయింగ్ జోరుగా సాగుతోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...నందకుమార్ అనే వ్యక్తిని సిఫార్సు చేశారు. అది కూడా సామాన్య భక్తులకు సేవలు అందించేందుకే ఏజెంట్ల నియామకం అని పేర్కొనటం విశేషం. మంత్రుల సిఫార్సుల పరంపరను చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లాబీయింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. -
పైసా.. పైరవీ.. బదిలీ
* నిబంధనలకు పాతర... * ఆమ్యామ్యాలు, అమాత్యుల అవసరాలే ఏకైక ప్రాతిపదిక * భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు * ప్రాంతం, పోస్టు ఆధారంగా బదిలీలకు ముడుపుల రేట్లు * బదిలీ కోరుతున్న వారితో కిటకిటలాడుతున్న సచివాలయం * ఈ నెల 22 వరకు బదిలీల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు * సింగపూర్ నుంచి రాగానే సీఎం తీసుకున్న తొలి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బదిలీల జాతర ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర సచివాలయం బదిలీ కోరుకుంటున్న వారితో పైరవీకారులతో కిటకిటలాడుతోంది. సీనియారిటీని పట్టించుకోరు.. సర్వీసునూ లెక్కలోకి తీసుకోరు.. అనారోగ్యమా కాదా అనేదీ పరిగణించరు.. ఖాళీలు ఉన్నాయా అనేదీ అవసరం లేదు.. ‘ముడుపులు ముట్టాయా? లేదా?’ అన్నదే ఏకైక ప్రాతిపదికగా ఈ బదిలీల పర్వం సాగుతోందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. ‘నీడ్ బేస్డ్’ (అవసరం ప్రాతిపదికగా) అనే పేరుతో జరుగుతున్న బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయన్నది సచివాలయంలో గుప్పుమంది. కీలకమైన పోస్టుల బదిలీల విషయంలో భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు అధికారవర్గాల్లో వినిపిస్తోంది. కొందరు అధికారులను తాము సూచించిన చోటికే బదిలీ చేయించుకోవడానికి మంత్రులు పట్టుబట్టి మరీ పని చేయించుకున్నారు. గత మూడు రోజులుగా సచివాలయంలో సాగుతున్న ఈ బదిలీ వ్యవహారాలు పలువురు మంత్రుల మధ్య చిచ్చుకు కూడా కారణమైంది. వాస్తవానికి ఈ బదిలీల ప్రక్రియ శనివారంతో ముగియాల్సి ఉండగా.. బదిలీల కోసం సచివాలయం కిటకిటలాడటంతో ఆ గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించటం విశేషం. పైరవీకారుల అవసరాలే ప్రాతిపదికగా... ఉద్యోగుల బదిలీలకు గతంలో చెప్పిన కౌన్సెలింగ్ విధానానికి పాతరేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీలు వద్దని కిందిస్థాయి ఉద్యోగులు మొత్తుకున్నా ససేమిరా అన్న సర్కారు కొత్తగా నీడ్ బేస్డ్ పేరుతో అమాత్యుల అవసరాలు తీర్చుతున్నారన్న విమర్శలు సర్వ త్రా వినిపిస్తున్నాయి. బదిలీలకు ఒక విధానం లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం, వారి అవసరాల మేరకు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు కౌన్సిలింగ్ విధానం తీసుకువచ్చానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. సాధారణంగా అయితే ఖాళీలున్నా, లేదా భార్య-భర్తల కేసులో, లేదా ఆరోగ్య సమస్యల కేసుల్లో లేదా మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. అయితే ఇప్పుడు అటువంటి విధివిధానాలేమీ లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పైరవీరీకారుల ‘అవసరాల’ కోసం బదిలీలు సాగుతున్నాయి. చిచ్చురేపిన విశాఖ ఆర్డీఓ బదిలీ.. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన ఒక ఉన్నతాధికారి బదిలీ విషయంలో ఇద్దరు మం త్రుల మధ్య వివాదం తలెత్తింది. విశాఖపట్నం ఆర్డీఓగా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి ఆ పోస్టులోకి వచ్చేందుకు.. గత ప్రభుత్వంలోను, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్న వ్యక్తికి, మరో ఎమ్మెల్యేకు నాడు 70 లక్షల రూపాయల వరకు ముట్టచెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పుడు ఆ వ్యక్తిని బదిలీ చేసి మరో వ్యక్తి నియామకానికి సదరు మంత్రి వ్యతిరేకించడమే కాకుండా.. సహచర మంత్రి అయ్యన్నపాత్రుడుపై దుష్ర్పచారానికీ దిగారని, ముఖ్యమంత్రికి సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. బుగ్గ కారుల్లో పైరవీకారుల షికార్లు... సచివాలయంలో గత నాలుగు రోజులుగా బది లీల కోసం సాగుతున్న పైరవీలను, సచివాల యం జనంతో కిటకిటలాడుతున్న తీరును చూసి ఉన్నతస్థాయి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా అయితే సచివాలయంలోకి మూడు గంటల తర్వాత సందర్శకులను అనుమతిస్తారు. అయితే మంత్రులు తాము వినియోగించే బుగ్గ కారులను బయటకు పంపించి మరీ సచివాలయంలోకి బదిలీలు కోరుతున్న పైరవీకారులను తీసుకువస్తున్నారు. దీంతో ఉదయం నుంచే సచివాలయం బదిలీల జనంతో నిండిపోతోంది. ‘సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరం ఇలాంటి బదిలీలు తీరు చూశాం గానీ.. మా వాళ్లు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటకముందే ఉత్సాహం చూపిస్తున్నారు’ అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ నుంచి తిరిగి హైదరాబాద్ రాగానే తీసుకున్న తొలి నిర్ణయం అవసరాల బదిలీలను మరో వారం రోజుల పాటు పొడిగించడమే. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ వరకు నీడ్ బేస్డ్ బదిలీలను పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కోరుకున్న పోస్టింగ్ కావాలంటే ‘చెన్నై’ వెళ్లి రావాలి... ఇక.. ఆర్డీఓ, మునిసిపల్ కమిషనర్లు, డీఈఓల బదిలీలకు పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా రేటు పలుకుతున్నట్లు సచివాలయం వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పోస్టింగ్ కోసం భారీ ముడుపులు డిమాండ్ చేస్తున్నారని రెండు రోజులుగా సచివాలయంలో చక్కర్లు కొడుతున్న ఒక డీఈఓ ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని జిల్లాల నుంచి బదిలీల కోసం సచివాలయం వచ్చిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కోరుకున్న చోటకు పోస్టింగ్ కావాలంటే చెన్నై వెళ్లి తాము చెప్పిన వ్యక్తిని కలిసి రావాలని ఒక మంత్రి కార్యాలయ సిబ్బందే బహిరంగంగా చెప్తున్నారు. -
చక్కర్లు!
* బదిలీల పర్వంలో కొత్త కోణం * మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు * సిఫార్సు లేఖల కోసం పైరవీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బదిలీల జాతరకు తెరలేవడంతో పైరవీలు ఊపందుకున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు ఆశావహులు ప్రజాప్రతినిధులు, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మాట’ వినని అధికారులను సాగనంపి.. వారి స్థానే విధేయులను నియమించుకోవాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. బదిలీల్లో ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలోనే బదిలీలపై భయం పట్టుకున్న అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటివరకు బదిలీలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, హాట్‌సీట్లు దక్కించుకునేందుకు తమదైన శైలిలో అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నంవబర్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు జరిగిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా హడావుడి చేస్తుండడంతో అధికారవర్గాల్లో బదిలీల ఫీవర్ మొద లైంది. ముఖ్యంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీల జాబితాలో ఉండడం.. ఎమ్మెల్యేలు కూడా తమనే టార్గెట్ చేయడంతో సీటును కాపాడుకునేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారు. నచ్చిన పోస్టింగ్‌ను దక్కించుకునేందుకు తమ పేర్లను సిఫార్సు చేయాలని కోరుతూ ‘రేటు’ మాట్లాడుకుంటున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒకే అధికారి కోసం ఇరువురు ప్రజాప్రతినిధులు పట్టుపట్టడం కూడా అధికారపార్టీలో వివాదంగా మారుతోంది. నగర శివార్లలో పోస్టింగ్ దక్కించుకునేందుకు ఎక్కువ మంది పోటీపడుతుండడం అధికారుల్లోనూ కొత్త జగడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణేతరులను సాగనంపాలనే వాదన తెరమీదకు తెచ్చారు. అదే సమయంలో సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీల పర్వాన్ని చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితమే స్థానచలనం కలిగించిన తహసీల్దార్లను మళ్లీ ఎలా మారుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీల ప్రక్రియ చేపడితే ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఛీ..చీ..! అధికారుల బదిలీలు మంత్రి మహేందర్‌రెడ్డికి చిరాకు కలిగిస్తున్నాయి. తన ఇంటిచుట్టూ ఎంపీడీఓలు చక్కర్లు కొట్టడంపై ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. బదిలీల జాబితాలో ఫలానా మండలానికి తమ పేరును సూచించాలని వేడుకునేందుకు సోమవారం ఉదయం పలువురు అధికారులు మహేందర్ నివాసానికి చేరుకున్నారు. ఒకవైపు ఆహారభద్రత, సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుండగా, దాన్ని వదిలేసి ఇక్కడకు రావడమేమిటని ఆయన రుసరుసలాడారు. ఇదిలావుండగా, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీలను సంప్రదించి రూపొందించిన జాబితాను మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం పేషీకి పంపినట్లు తెలిసింది. ఈ జాబితాలో కూడా మళ్లీ సవరణలు కోరుతుండడం మంత్రి మహేందర్‌కు తలనొప్పిగా మారాయి. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆమోదముద్రతో నేడో, రేపో బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, స్వల్పకాలంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బదిలీల జాబితా కూడా పరిమిత స్థాయిలోనే ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. -
ఏ అవసరమున్నా.. నేనున్నా
సమస్య చెప్పండి.. పరిష్కరిస్తా * మూడు నెలలకోసారి గ్రామాలకు వస్తా * లంచాలు, పైరవీలతో మోసపోవద్దు * చెరువుల పునరుద్ధరణతోనే సస్యశ్యామలం * మంత్రి హరీష్‌రావు సిద్దిపేట రూరల్: ‘ఎవ్వరికీ ఏ అవసరం ఉన్నా నేనున్నాను.. లంచాలు, పైరవీలతో మోసపోవద్దు.. అలాంటి వాటిని అసలే నమ్మొద్దు.. ఏ సమస్య ఉన్నా చెప్పండి.. మూడు నెలలకోసారి మీ గ్రామాలకు వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం మండలంలోని పుల్లూర్ గ్రామంలో సబ్‌స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన, ఇమాంబాద్‌లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. ఇమాంబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీచేసి తీరుతామని అన్నారు. నవంబర్ నుంచి పింఛన్ డబ్బును పెంచుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చెరువులు బాగుంటేనే ప్రజలు బాగుంటారన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం సంవత్సరానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తె లిపారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబునాయుడే కారణమని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ లెక్కచేయడంలేదన్నారు. స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యం తాను ఏ నీళ్లు తాగుతున్నానో ప్రజలంతా అదే నీళ్లు తాగాలన్నది తన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీరు తాగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 64 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మరో 11 గ్రామాల్లో పూర్తి చేస్తే అన్ని గ్రామాల్లో పూర్తి చేసినట్టవుతుందన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, పూర్తిస్థాయిలో గృహనిర్మాణాలు, ప్రతి కుటుంబానికి 30 కిలోల రేషన్ బియ్యం, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరిగౌడ్, జడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, గ్రామ సర్పంచ్ పుల్లూరి సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేష్, నాయకులు కిషన్‌రెడ్డి,తిరుపతిరెడ్డి, ఉడుత మల్లేశం, రాజయ్య, కమలాకర్‌రావు, రవీందర్‌రెడ్డి, బాల్‌రంగం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పైరవీలు షురూ!
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో కొందరు ఉద్యోగులు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసారి బదిలీ తప్పదని తెలిసిన ఉద్యోగులు వాటిని నిలుపుదల చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మే రకు బదిలీని నిలుపుదల చేయూలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పేరుకు ఐచ్ఛిక బదిలీలైనా రాజకీయంగా ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసిన వారికి బదిలీలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుకే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్ర భుత్వం ఆదేశించడంతో మండల స్థాయి నుంచి డివిజన్, జిల్లా కేంద్రంలోని పెద్ద పెద్ద కార్యాలయాల్లో పని చేస్తున్న వారంతా తమ బదిలీ ప్రక్రియ గురించే మాట్లాడుతున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ ప్రాంతానికి తెచ్చుకునేందుకు బదిలీల ప్రక్రియలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. తనకు బదిలీ తప్పదని తెలిసిన ప్రతి ఉద్యోగి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకు నేందుకు ప్రయత్నాలు, పైరవీలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో గతంలో పని చేసిన వారందరికీ ఉద్వాసన తప్పదని ఇప్పటికే పరోక్షంగా హెచ్చ రికలు పంపిన నేపథ్యంలో ఈ బదిలీల ప్రక్రియ మరింత హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులను బదిలీ చేసేందుకు ఇప్పటికే అధికార పార్టీ నాయకులు మండలాల వారీగా జాబితా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మం త్రులు హైదరాబాద్‌లో కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పని చేసిన వారంటే కేంద్రమంత్రి అశోక్ కూడా దూరంగా ఉంచుతున్నట్టు భోగట్టా. దీని ప్రకారం గత ప్రభుత్వ నాయకుల అడుగులకు మడుగు లొత్తిన వారికి స్థాన చలనం తప్పదంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగులకు కూడా బదిలీ తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో పని చేస్తున్న అధికారులు, మండల స్థాయి అధికారులకు కూడా బదిలీలు తప్పవని కొందరు బా హాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా రోజుకొక అధికారిని టార్గెట్‌గా చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని మం డలాల్లో తహ శీల్దార్లు, ఎంపీడీఓలకు కూడా స్థాన చలనం తప్పేలా లేదు. ఈ మేరకు చాలా మంది ఉద్యోగులు బదిలీలను ని లుపుదల చేసుకునేం దుకు సెలవు పెట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
కారుణ్య నియామకాల్లో కాసుల వేట!
విజయనగరం ఫోర్ట్ : జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకాలకు పైరవీలు మొదల య్యాయి. నియామకాల కోసం పెద్దమొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లగా జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. జిల్లా పరిషత్‌లో కొత్త పాలక వర్గం కొలువుదీరడంతో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పైల్ సిద్ధం చేసినట్టు భోగట్టా. అయితే కారుణ్య నియామకాలను సొమ్ము చేసుకోవాలని అధికారులు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పైరవీలు ప్రారంభించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 2 లక్షలు నుంచి రూ. రెండున్నర లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. జిల్లా పరిషత్‌లో 15 కారుణ్య నియామకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని నాలుగైదు రోజుల్లో భర్తీ చేయనున్నట్టు తెలిసింది. కాసులు చేతిలో పడగానే నియామక ఉత్తర్వులు అందజేయడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సొమ్ము సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం పంపించారు. అయితే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుండడంతో అంత సొమ్ము ఏవిధంగా ఇవ్వాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు ముందే ఈ పక్రియను చేపట్టాలని జిల్లా పరిషత్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. బదిలీలు జరిగితే సీటు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందే చక్క బెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా కారుణ్య నియమాకాలకు సంబంధించిన ఫైల్ ఇంతవరకు తన వద్దకు రాలేదని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. నియామకాలు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. -
పచ్చ తమ్ముళ్ల పైరవీలు షురూ!
విజయనగరం క్రైమ్/బొబ్బిలి:జిల్లాలో విజయనగరం, గజపతినగరం, పార్వతీపురం, బొబ్బిలి, కురుపాం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, సాలూరులలో వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో కురుపాం, కొత్తవలస మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేవు. మిగిలిన ఏడు కమిటీలకూ పాలక వర్గాలు ఉన్నాయి. వీటన్నింటిని రద్దు చేశారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురాలకు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.వి.సుధాకర్‌ను ఇన్చార్జిగా నియమించారు. గజపతినగరం, కురుపాం, కొత్తవలస, పూసపాటిరేగ, సాలూరు, చీపురుపల్లిలను మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ బి.శ్రీనివాసరావును ఇన్చార్జిగా నియమించారు. అధికార దాహంతోనే... గత సంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పాలకవర్గాల పదవీకాలం ముగియకుండానే హడావుడిగా ర ద్దు చేయడం తగదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాలకవర్గాలను అదే ఏడాదిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. అయితే పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మార్కెట్ కమిటీలను రద్దు చేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ వారికి నామినేటెడ్ పదవులను కట్టబె ట్టాలన్న ఆత్రుతతో ఈ చర్యకు పాల్పడినట్లు ప్రస్తుత పాలక మండలి సభ్యులు విమర్శిస్తున్నారు. ఇబ్బందులు తలెత్తే అవవకాశం... వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్లను రద్దు చేసిన ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇన్చార్జిలను కూడా నియమించింది. అసలే ఖరీఫ్ సీజన్ కావడం రైతులకు సంబంధించిన సేవలు వీటి ద్వారా అందించాల్సిన ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పాలక మండళ్లను రద్దు చేసి అధికారులను నియమించడం సరైన చర్య కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలనపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పాలక మండలి ఉంటే రైతులకు అవసరమైన నిర్ణయాలు సత్వరమే తీసుకునే అవకాశం ఉండేది. అయితే అధికారుల పాలనలో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది బొబ్బిలిలో.... ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిబిలో కౌన్సిలర్లు, చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీపడ్డారు. నామినేటెడ్ పదవులను తాయిలంగా చూపించి అప్పట్లో వారిని మెత్తబరిచారు. ఇప్పుడు వారం తా తమకే పదవులు కట్టబెట్టాలని నాయకులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పోస్టు కోసం తూముల అచ్యుతవల్లితో పాటు చోడిగంజి రమేష్‌నాయుడు, పువ్వల శ్రీనివాసరావు, రెడ్డి లక్ష్మీప్రసాద్ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం ఆ పీఠాన్ని అచ్యుతవల్లికి ఖరారు చేస్తూ మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులున్నాయంటూ ఆశ చూపింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు ను ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడుకు ఇస్తామని మాట ఇవ్వడంతో చైర్పర్సన్ స్థానంకు పోటీ నుంచి పక్కకు తప్పుకొన్నారు. అయితే నామినేటెడ్ పోస్టులు భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడం అంతవరకూ మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టు ఇవ్వాలని పట్టుబట్టి గత నెల 3న జరిగిన ఎన్నికల్లో ఆ పీఠంపై చోడిగంజి కూర్చున్నారు. కమిటీ చైర్మన్ల నోటిఫికేషన్ వస్తే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు పార్టీ పెద్దలు వద్ద ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. అలాగే ఏఎంసీలోని డెరైక్టర్ పోస్టులకు పట్టణంతో పాటు బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. బొబ్బిలిలోని ఆంజనేయస్వామి దేవాలయం లో కమిటీ కూడా రద్దు అవుతుంది. దానికి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులుంటారు. సరిగ్గా ఏడాది కిందటే కాంగ్రెస్ పెద్దలు ఈ కమిటీని వేశారు. ఇక వేణుగోపాలస్వామి దేవాలయానికి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అనువంశిక ధర్మకర్తగా ఉంటున్నారు. అక్కడ కూడా ఇద్దరు సభ్యుల ను నియమించడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీతో పాటు బీజేపీ నాయకులు కూడా ఈ నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ర్టంలో టీడీపీ అధికారంలోనికి రావడానికి బీజేపీ పాత్ర, భాగస్వామ్యం చాలా ఉందని, అందు కు నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ పెద్దల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తున్నట్లు స మాచారం. మరి వీటికి సమాన న్యా యం ఎలా జరుగుతుందో చూడాలి. -
తమ్ముళ్ల పైరవీలు
సాక్షి, కాకినాడ :పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టడంతో తెలుగు తమ్ముళ్లు పదవులను అందుకోవడానికి అర్రులు చాస్తున్నారు. ఒకపక్క ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎమ్మెల్యేలు కర్ర పెత్తనం చేస్తుంటే.. మరోపక్క ప్రభుత్వం ఇంకా కుదుటపడకుండానే పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు పైరవీలు మొదలుపెట్టారు. కొన్ని కీలక పదవుల కోసం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కూడా స్థానిక‘దేశం’ నేతలకు ముట్టజెప్పేందుకు సైతం వెనుకాడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలకమండళ్లు, ఇతరత్రా నియామక పదవులను రద్దు చేసేందుకు తెలుగుదేశం సర్కార్ రంగం సిద్ధం చేసింది.. సాధారణంగా ప్రభుత్వం మారిన సయయాల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా తక్షణమే పదవులకు రాజీనాలు చేయాలి. రాష్ర్టంలో ప్రభుత్వం మారి దాదాపు నెలైంది. వాస్తవానికి మార్చిలో రాష్ర్టపతి పాలన అమల్లోకి వచ్చింది. అంటే అప్పుడే ఈ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా తప్పుకోవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఆయా పదవుల్లో కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో నియమితులైన వారే నేటికీ కొనసాగుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ర్ట తొలి కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలకమండళ్లు, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిని రద్దుచేయాలని నిర్ణయించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చయినా వీరిని తొలగించాలని నాటి సమావేశంలో తీర్మానించారు. వ్యవసాయ, మార్కెటింగ్, దేవాదాయ, పౌరసరఫరాల శాఖల్లోనే ఎక్కువగా రాష్ర్ట స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నామినేటెడ్ పదవులుంటాయి. ఇవికాకుండా వివిధ బ్యాంకులు, కార్పొరేషన్లకు సంబంధించి డెరైక్టర్ల పదవులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చివరి రోజుల్లో నామినేటెడ్ పదవుల పందారంలో రాష్ర్ట హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పంతం నానాజీ, బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా డోకల మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అల్లు బాబిలతో పాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమించారు. జిల్లాలో వెయ్యికి పైగా దేవాలయాలున్నాయి. వీటిలో వార్షికాదాయం 2లక్షల నుంచి రూ.5లక్షల ఆదాయం ఉన్న సీ గ్రేడ్ దేవాలయాలు 457 ఉన్నాయి. రూ.5లక్షల నుంచి 25లక్షల వరకు ఉన్న బీ గ్రేడ్ ఆలయాలు 185, 25 లక్షల ఆదాయం పైబడి ఉన్న ఏ గ్రేడ్ ఆలయాలు 21 వరకు ఉన్నాయి. 2లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఆలయాలు సుమారు 350 వరకు ఉన్నాయి. ఏ, బీ గ్రేడ్ ఆలయాలకు ఐదుగురు నుంచి ఏడుగురు వరకు, సీ, డీ గ్రేడ్ ఆలయాలకు నలుగురు ట్రస్టీలు ఉంటారు. జిల్లాలో కీలక దేవస్థానాలతో పాటు సుమారు ఐదువందలకు పైగా దేవాలయాలకు పాలకవర్గాలున్నాయి. మరో నాలుగు వందలకు పైగా దేవాలయాల పాలకవర్గాల కాలపరిమితి ఇటీవలే ముగిసింది. జిల్లాలో 20కు పైగా మార్కెటింగ్ కమిటీలుండగా, 16 కమిటీలకు పాలకవర్గాలున్నాయి. సివిల్ సప్లయిస్‌లో ఆహార సలహా సంఘాలు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్నాయి. రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వారితో పాటు జిల్లా, గ్రామస్థాయి వరకు పదవుల్లో ఉన్నవారు సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. మార్కెటింగ్ కమిటీ పాలక వర్గాలు కూడా ఇదే బాటలో రాజీనామాలు చేయాల్సి ఉంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులన్నీ రద్దు కానున్నాయి. పదేళ్లుగా పదవులకు దూరంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ర్ట స్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కీలకమైన నేతలంతా ప్రయత్నాలు ఆరంభించారు. మరొక పక్క జిల్లా పరిధిలో ఉండే నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దేవాదాయ, మార్కెటింగ్ శాఖల్లో కీలకమైన పదవుల కోసం రూ.2లక్షల నుంచి 5లక్షల వరకు ముట్టచెప్పేందుకు సైతం తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. అన్నవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అంతర్వేది, అయినవిల్లి, మురమళ్ల, తలుపులమ్మలోవ, అప్పనపల్లి, ర్యాలీ, గొల్లల మామిడాడ, వాడపల్లిలతో పాటు కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలోని పలు దేవాలయాల పాలక మండళ్లలో స్థానం కోసం తెలుగుతమ్ముళ్లు పైరవీలు సాగిస్తున్నారు. మరోపక్క మార్కెటింగ్ కమిటీ పదవుల కోసం పావులు కదుపుతున్నారు. -
ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్!
- శాసనమండలి ఫ్లోర్‌లీడర్ కోసం యత్నం - దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి మంతనాలు - సీనియర్ నేతగా ఆయనకే దక్కే అవకాశం? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో మకాం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు చేరిన ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణకు చెందిన పలువురు టీ-కాంగ్రె స్ నాయకులు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. డీఎస్ రెండు రోజుల నుంచి కీలక పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రజల మనోభావాలను అధినేత్రి సోనియాకు తెలిపేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. అయితే ఈసారి మాత్రం శాసనమండలి ఫ్లోర్‌లీడర్ పదవి కోసం దేశ రాజధానికి చేరిన ఆయన బుధవారం ఢిల్లీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం.. ఆ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనమండలి పక్షనేతగా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన డీఎస్ అనతికాలంలోనే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదిగారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించిన ఆయన 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ సీఎం కాగా.. ఆ రెండు ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన డీఎస్ అధిష్టానానికి మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందిన ఆయనకు ఈసారి నిజామాబాద్ రూరల్‌ను ఎంచుకున్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలోనూ ఓటమి తప్పలేదు. అయితే 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన డీఎస్‌కు 2011 అక్టోబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యునిగా ఉన్న తనకు తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలికి తొలి ఫ్లోర్‌లీడర్‌గా అవకాశం కల్పించాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు సమాచారం. ఇదిలా వుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ కూడ ఇదే పదవి కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసింది. అయితే డీఎస్కే ఈ విషయంలో అధిష్టానం అనుకూలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘దేశం’లో అంతర్యుద్ధం
- మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పైరవీలు - శిద్దా పట్ల సుముఖంగా ఉన్న చంద్రబాబు - బాలినేనిపై గెలిచిన నా సంగతేంటంటున్న దామచర్ల - ఆశావహుల్లో కదిరి, డోలా, ఏలూరి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఐదుగురు మంత్రి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. అమాత్య పదవి తనకంటే తనకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు అధినేతతో అంతర్యుద్ధానికి కూడా దిగినట్లు సమాచారం. 2004, 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి ఒక్కో శాసన సభ్యుడు మాత్రమే గెలిచారు. 2004లో అద్దంకి నుంచి కరణం బలరామకృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహించగా 2009లో మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ తరఫున జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ ప్రాతిపదికన జిల్లాకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. - దర్శి నుంచి గెలుపొందిన శిద్దా రాఘవరావుకు మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే విషయం బలంగా వినిపిస్తుండటంతో మిగిలిన శాసనసభ్యులు తమకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. - శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమిటని అధిష్టానాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన 2004లో పరాజయం పొందాడని, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఆ తర్వాత ఎమ్మెల్సీని కట్టబెట్టారని చెబుతున్నారు. ఈసారి కూడా ఆయన కేవలం 1200 ఓట్ల మెజారిటీతోనే గెలిచారని గుర్తు చేస్తున్నారు. - జిల్లాలో రాజకీయ దిగ్గజం వంటి బాలినేని శ్రీనివాసరెడ్డిపై మంచి మెజారిటీతో గెలిచిన తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని దామచర్ల జనార్దన్ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న దామచర్ల నాయకత్వంలోనే పదేళ్ల తర్వాత ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. తొలి ప్రాధాన్యం తనకు ఇవ్వకుండా శిద్దాకు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. - దామచర్ల కూడా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన సతీమణి బంధువు బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు ద్వారా జనార్దన్ పైరవీ చేస్తున్నట్లు సమాచారం. - 2004లో పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు కూడా శిద్దాకు మంత్రి పదవి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడైన కదిరి, ఆయన ద్వారా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. - పర్చూరు నుంచి గెలుపొందిన ఏలూరి సాంబశివరావు కూడా నారా లోకేష్ ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. - ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కొండపి శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్ చేస్తున్నారు. - ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా శిద్దా రాఘవరావుకు మాత్రమే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు దేవాదాయ లేదా వాణిజ్య పన్నుల శాఖ అప్పగించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. - ఈ నేపథ్యంలో ఆర్థిక బలం ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కుర్చీ’పై పార్టీల గురి
మునిసిపాలిటీ, నగర పంచాయతీ చైర్పర్సన్ల ఎంపికపై లాబీయింగ్ గెలిచే అవకాశాలున్న స్వతంత్రులతో బేరసారాలు నర్సంపేట మినహా.. ఎక్కడా పోటీ ఇవ్వని టీడీపీ హన్మకొండ, న్యూస్‌లైన్ : పుర పోరు ముగిసి.. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతుండటంతో చైర్పర్సన్ ఎంపికపై పార్టీల నేతలు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇప్పటి నుంచే లాబీయింగ్ మొదలైంది. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీల్లో మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ప్రచార సమయంలోనే ప్రధాన పార్టీలన్నీ తమ తరఫున చైర్పర్సన్, చైర్మన్‌గిరి అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. జనగామ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. భూపాలపల్లి నగర పంచాయతీ స్థానం ఎస్సీ జనరల్‌కు, పరకాల ఎస్సీ జనరల్, నర్సంపేట బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యనే జరిగింది. ఈ రెండు పార్టీలే ఆయా వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపారు. టీడీపీ మాత్రం నర్సంపేట మినహా.. ఒక్కచోట కూడా చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. చాలా వార్డుల్లో అభ్యర్థులనే పోటీకి దింపలేదు. దీంతో పురపాలకాల్లో జెండా ఎగురవేసే అవకాశం టీడీపీకి అసలే లేదు. స్వతంత్రుల మద్దతు అనివార్యం.. జనగామ చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వెన్నం శ్రీలతను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఇక్కడి 16వ వార్డు నుంచి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈసారి ఎలాగైనా ఆమెను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పొన్నాల స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారి మద్దతు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారితో మంతనాలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి మద్దతు వచ్చే అవకాశం లేకపోవడంతో.. స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు అనివార్యంగా మారింది. టీఆర్ఎస్కు పరిస్థితి ఇలానే ఉంది. 7వ వార్డు నుంచి పోటీ చేసిన గాడిపెల్లి ప్రేమలతారెడ్డిని టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. గట్టిపోటీనే ఉంది. ఈ పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కాలంటే స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది. ‘మానుకోట’లో మద్దతు లాభించేనా..? మహబూబాబాద్‌లో చైర్పర్సన్ పీఠం కోసమే టీఆర్ఎస్.. సీపీఐతో దోస్తీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున భూక్యా ఉమా మురళీనాయక్, టీఆర్ఎస్ నుంచి అనితా నెహ్రూనాయక్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీపీఐ, టీడీపీ మూడేసి స్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. ఈ ఆరింటా వారు గెలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీపీఐ, టీడీపీలు ఇక్కడ టీఆర్ఎస్కు మద్దతునిచ్చే అవకాశం ఉంది. అయితే స్వతంత్రులు కూడా కొన్నిస్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. వారి మద్దతు కోసం మంతనాలు జరుపుతున్నారు. పరకాలలో పోటాపోటీ పరకాలలో చైర్మన్ పీఠానికి పోటాపోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బొచ్చు వినయ్, దుబాసి వెంకటస్వామి, క రుణశ్రీ, కరుణ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బొ చ్చు కృష్ణారావు, మడికొండ సంపత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీలు మాత్రం ఇంకా ఎవరికీ చైర్మ న్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. ఆశావహులు మాత్రం తమకే పీఠమంటూ అధినేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఆశలు ఫలించేనా..? నర్సంపేట నగర పంచాయతీకి కూడా ఆశావహులు తీవ్రంగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కచోట మాత్రం టీడీపీ చైర్మన్ పీఠంపై కొంత ఆశ పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి వేవుుల బొందయ్యుగౌడ్, పెండెం ఆనంద్, కాంగ్రెస్ నుంచి పాలారుు శ్రీనివాస్, పాలెల్లి రాంచంద్రయ్యు, రుద్ర ఓంప్రకాశ్, నాగెల్లి వెంకటనారాయుణగౌడ్, టీఆర్ఎస్ నుంచి కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, నారుుని నర్సయ్యు, గుంటి కిషన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆశావహులు తమకు మద్దతివ్వాలంటూ గెలిచే అభ్యర్థులను ఇప్పటి నుంచే వేడుకుంటున్నారు. భూపాలపల్లి ఎవరికో..? భూపాలపల్లి చైర్మన్ పీఠం కోసం టీఆర్ఎస్లో పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్.. సీపీఐతో జత కట్టింది. అయితే టీఆర్ఎస్ హోరాహోరీ పోటీనివ్వడంతో.. చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ నుంచి చల్లూరి సమ్మయ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సమ్మయ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి బి.రవి, జోగు సమ్మయ్య, కొక్కరి చిన్న రాజయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఖర్చులిస్తాం.. చైర్మన్ పీఠం కోసం కన్నేసిన వారంతా ఇప్పుడు కౌన్సిలర్లుగా గెలిచే వారితో బేరసారాలకు దిగుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి.. తమకు మద్దతునివ్వాలంటూ వారిని మెప్పించుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ తిరిగి ఇస్తామని, నిధుల్లో ప్రాధాన్యం ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. స్థానికంగా పార్టీల విషయాలను పక్కన పెట్టుకుందామని, చైర్మన్ పీఠం కోసం కలిసిపోదామంటూ బతిమిలాడుతున్నారు. -
ఏకగ్రీవం వెనుక...
రమాకుమారి సేవలకు ప్రతిఫలమంటున్న మద్దతుదారులు ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న వ్యతిరేకులు యలమంచిలి, న్యూస్‌లైన్ : ఊహించిన విధంగానే రెండో వార్డు ఎన్నిక ఏకగ్రీవమయింది. సోమవారం ఈ వార్డులో 8మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డునుంచి పోటీలో ఉన్న దేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఈ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దేశంపార్టీ చైర్పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమా రి లక్షల రూపాయలు గ్రామాభివృద్దికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండో వార్డులో మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా అందు లో మూడు సెట్లు రమాకుమారివే. సోమవారం మిగతా 8మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయమే జరిగిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అన్ని నామినేషన్లు ఒకే రోజు ఉపసంహరించుకోవడంతో రెండో వా ర్డులో అభివృద్ధికి డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు బలాన్నిస్తోంది. వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి గత కొన్ని రోజులుగా దేశం పార్టీ నాయకులు పావులు కదిపారు. గ్రామంలో దేవాలయ అభివృద్ధికి సహకారిస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిస్తామని గ్రామస్థులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఫలవంతం కావడంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో గ్రామస్థులకు, చైర్పర్సన్ అభ్యర్థికి మద్య జరిగిన ఒప్పందంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు పట్టణానికి చెందిన కె.సతీష్, యు.జయంత్, ఎం.రాంబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఉపసంహరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తోందని, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పిళ్లా రమాకుమారి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే ఆమెను వార్డు మెంబరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు గ్రామస్థులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. -
ఉడాలో కుర్చీలాట సా...గదీతే
రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన! కొనసాగుతున్న రామారావు యత్నాలు నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేచిచూడండి... ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
గుట్టుచప్పుడు కాకుండా టీచర్ల బదిలీలు..
ముడుపులు.. సిఫార్సులకు పెద్దపీట సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సుమారు 1,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. సిఫార్సులకే బదిలీల్లో పెద్దపీట వేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని సమాచారం. బదిలీల ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలపడంతో.. జాబితాను సోమవారం జిల్లాలకు పంపించారు. మొదటి నుంచీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి గోప్యతను పాటిం చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో పాటు భారీగా సొమ్ము ముట్టజెప్పిన వారికే బదిలీలు అయ్యాయని.. నిజంగా అనారోగ్య కారణాలు, కుటుంబ సమస్యలున్న వారి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే నిలిపివేయాలి: యూటీఎఫ్ టీచర్ల అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి, వైద్యుల ప్రోత్సాహకాలకు హెల్త్‌కార్డుల ప్యాకేజీ వ్యయంలో 55% కేటాయించడం అన్యాయమని విమర్శించింది. ఉద్యోగుల సొమ్మును నూరు శాతం చికిత్సకే కేటాయించాలని కోరింది. -
బదిలీ తప్పదా...అయితే...దగ్గర్లో చూడండి!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకపక్క ప్రభుత్వ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుండగా...మరోపక్క పైరవీలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు...జిల్లాలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తూ, ఇదే జిల్లాకు చెందిన, ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల పరిధిలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచే స్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆ పనిలో ఉండగా...ఈవిషయంలో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేస్తున్నారు. బదిలీ అయ్యే ఉద్యోగులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తుండడంతో వారు కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అయిన పక్షంలో తమ వారిని దగ్గరి ప్రాంతాలకు బదిలీ చేయాలని, మళ్లీ ఎన్నికల తర్వాత మంచి పోస్టింగ్ ఇచ్చేలా చూసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నారు. ఈ ైపైరవీల ప్రభావం జాబితా తయారీపై బాగానే పడుతుందని, అయినా ఎట్టి పరిస్థితుల్లో జాబితాను త్వరలోనే సిద్ధం చేస్తామని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఏదిఏమైనా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగానే బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే పట్టుదలతో కలెక్టర్ ఉన్నట్లు సమాచారం. 37 మంది తహశీల్దార్ల బదిలీ? జిల్లాలో 37 మంది తహశీల్దార్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో 24మంది రెగ్యులర్ తహశీల్దార్లు కాగా, ప్రొబెషనరీ డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) 10మంది, ప్రమోషన్ పొందనున్న మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఎంపీడీవోల బదిలీలు జరిగేనా? జిల్లాలో 46 మండలాలకు గాను 42మంది ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన ఆదేశాలతో జిల్లా పరిషత్ అధికారులు బదిలీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. దుమ్ముగూడెం ఎంపీడీవో ఇతర జిల్లా నుంచి రావడం, గార్ల ఎంపీడీవో మరో ఆరునెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో 40మంది ఎంపీడీవోలను బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో నిర్వహించిన సాధారణ ఎన్నికల సమయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘానికి తమ బదిలీలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆ బదిలీలను నిర్వహించలేదు. అలాగే ఇప్పుడు కూడా ఎంపీడీవోలు తమ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. -
పైరవీలు షురూ
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకే పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్హెచ్ఓలకు ఎన్నికల ముందు స్థానచలనం తప్పనిసరి. దీనికి తోడు జిల్లాలో పనిచేస్తున్న 25 మంది ఎస్ఐల ప్రొబెషనరీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. దీంతో జిల్లాలో ఎస్ఐల బదిలీలు అనివార్యం కానున్నాయి. ఎస్పీ తరుణ్ జోషి ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ బదిలీల్లో మంచి పోస్టింగ్‌ల కోసం కొందరు ఎస్ఐలు పైరవీ లు షురూ చేశారు. వీరు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు జిల్లాలో పలువురు ఎస్ఐల పనితీరుపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు లేని ఎస్ఐలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కొందరిపై ఎస్పీ స్థాయిలో ఫిర్యాదులుంటే, మరికొందరిపై డీజీపీ స్థాయి లో ఉన్నాయి. నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలున్న పలువురు ఎస్ఐలపై ఎస్పీ చర్యలు తీసుకుం టారా అన్నది తేలాల్సి ఉంది. అయితే పనితీరు సరిగాలేని సిబ్బందికి ఎస్పీ మెమోలివ్వడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. కాసులు కురిపించే స్థానాలకోసం జిల్లాలో కాసులు కురిపించే పలు స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పలువురు ఎస్ఐలు తహతహలాడుతున్నారు. నిజామాబాద్ వన్‌టౌన్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, నందిపేట్, ఆర్మూ ర్, బాల్కొండ, భీంగల్, కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూరు, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బీర్కూర్, బోధన్ తదితర స్టేషన్లలో పోస్టింగ్‌లకు డిమాండ్ ఎక్కువ. గతంలో పలుమార్లు జరిగిన బదిలీల్లో కాసులు కురిపించే స్టేషన్లలో పోస్టింగ్ కోసం నేతలకు లక్షల రూపాయలు సమర్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఎస్ఐల బదిలీ లు కూడా నేతల కనుసన్నల్లో జరిగినట్లు విమర్శలొచ్చాయి. సిఫార్సులను పక్కన బెట్టి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను సైతం పోలీసు బాసు లు వెనక్కి తీసుకున్న దాఖలాలున్నాయి. దీంతో ఈసారి బదిలీల ప్రక్రియపై పోలీసుల్లో చర్చ జరుగుతోంది. ఎస్పీ ఒత్తిడులకు తలొగ్గుతారా? లేక పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. -
11 మంది ఎంపీల ముడుపుల బాగోతం
స్టింగ్ ఆపరేషన్‌తో బట్టబయలు చేసిన ‘కోబ్రాపోస్ట్’ రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులిస్తే చాలు... ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి సంసిద్ధత వీరిలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు ఏఐఏడీఎంకే, ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ న్యూఢిల్లీ : పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కుంభకోణం తరహాలో కోబ్రాపోస్ట్ న్యూస్ వెబ్సైట్ తాజాగా మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. ఐదు పార్టీలకు చెందిన 11 మంది ఎంపీలు ముడుపులు తీసుకుని ఓ కల్పిత విదేశీ కంపెనీకి అనుకూలంగా సిఫారసు లేఖలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని కోబ్రాపోస్ట్ వెబ్సైట్ సంపాదకుడు అనిరుద్ధ బహల్ గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కిన వారిలో ఏఐఏడీఎంకే సభ్యులు కె.సుకుమార్, సి.రాజేంద్రన్, బీజేపీకి చెందిన లాలూభాయ్ పటేల్, రవీంద్రకుమార్ పాండే, హరి మాంఝీ, జేడీయూ సభ్యులు విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, భుదేవ్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు ఖిలాడీలాల్ బైర్వా, విక్రమ్‌భాయ్ అర్జన్‌భాయ్, బీఎస్పీ సభ్యుడు కైసర్ జహాన్ ఉన్నట్లు తెలిపారు. రూ. 50 వేలు మొదలుకుని రూ. 50 లక్షలు తీసుకుని ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి ఈ ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏడాదిపాటు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఓ ఆరుగురు ఎంపీలు ఏకంగా లేఖలు కూడా ఇచ్చేశారని తెలిపారు. ఈ ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారని వివరించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మెడిటరేనియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట తమకు సంస్థ ఉందంటూ తమ ప్రతినిధులు సదరు ఎంపీలను సంప్రదించగా, కనీస వివరాలను కూడా తెలుసుకోవడానికి వారు ప్రయత్నించలేదని అన్నారు. ఆరుగురు ఎంపీలు రూ. 50 వేలు మొదలుకొని రూ. 75 వేల వరకు ముడుపులు తీసుకుని కల్పిత కంపెనీకి అనుకూలంగా లేఖలు ఇచ్చారని బహల్ వెల్లడించారు. మిగిలినవారు రూ. 5 లక్షలకు తగ్గేది లేదన్నారని, ఒక ఎంపీ అయితే ఒక్క లేఖ ఇవ్వడానికి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ రిపోర్టర్లు కంపెనీ కన్సల్టెంట్లుగా చెప్పుకుని మధ్యవర్తులు, వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎంపీలను సంప్రదించారని, మహిళా ఎంపీల విషయంలో వారి భర్తలను సంప్రదించారని బహల్ చెప్పారు. మరోవైపు, వీరిలో కొందరు ఎంపీలను వివరణ కోరగా, తమపై ఆరోపణలను ఖండించారు. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ ఎంపీ మహేశ్వర్ హజారీ వ్యాఖ్యానించారు. తాను ముడుపులు తీసుకోలేదని, లేఖలు కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. తన పీఏ చెబితే సిఫారసు లేఖ ఇచ్చానని, ముడుపులు తీసుకోలేదని మరో జేడీయూ ఎంపీ విశ్వమోహన్ కుమార్ చెప్పారు. కాగా, ఈ ఎంపీల చర్య అవినీతి నిరోధక చట్టంకిందకు వస్తుందని, వీరిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.