
లాబీయింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు
గల్లా అరుణ సంచలన వ్యాఖ్య
చిత్తూరు: కష్టపడి పనిచేయకుండా.. షో చూపించి హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వారికే తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో మంగళవారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇచ్చేలా చూడాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కోరారు.