పంతులయ్య అధికార దుర్వినియోగం
టీడీపీ సభ్యత్వ నమోదులో పంతులయ్య కృషిని పొగిడిన గల్లా అరుణకుమారి
తిరుపతి రూరల్: పాఠాలు చెప్పాల్సిన పంతులయ్య పార్టీ భజన చేస్తున్నారా? బడి పిల్లల ఆధార్ నమోదు చేయటంలో బిజీగా ఉండాల్సిన ఆయన సైకిల్ ఎక్కి చక్కర్లు కొడుతున్నారా? ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటూ సేవలు మేడమ్ వద్ద వెలగపెడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి బహిరంగ వ్యాఖ్యలు చెబుతున్నాయి.
టీడీపీ సభ్యత్వ నమోదులో తన పీఏ బాలకృష్ణారెడ్డి సేవలు అమోఘమని, అతనితోపాటు టీడీపీ నాయకుల తోడ్పాటుతోనే జిల్లాలోనే అత్యధికంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేసినట్టు సాక్షాత్తు మీడియా, పాత్రికే యులు, రాష్ట్ర మంత్రి, ఎంపీల సాక్షిగా గల్లా అరుణకుమారి స్కూల్‌టీచర్ బాలకృష్ణారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఈయన విద్యాశాఖలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అధికారిగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. సోమవా రం సాయంత్రం తిరుపతి రూరల్ మం డలం వేదాంతపురంలో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు సంబరాల ముగింపు కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 65,200 సభ్యత్వాలు నమోదు చేయడంలో కృషి చేసిన వారికి గల్లా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన పీఏ బాలకృష్ణారెడ్డి, తన వద్ద పనిచేసే మురళి, తన ఇంట్లో పనివాళ్ల సహకారం మరువలేనిదన్నారు. గల్లా మాటలతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగి పార్టీ సభ్యత్వ నమోదులో కీలకంగా ఎలా మారాడంటూ చర్చించుకున్నారు. గల్లా పొగడ్తల సమయంలో సదరు బాలకృష్ణారెడ్డి వేదిక సమీపంలోనే ఉండడం గమనార్హం. మేడమ్ మాటలు తన ఉద్యోగానికి ఎక్కడ ఎసరు పెడతాయోనని ఆయన ఆప్తుల వద్ద వాపోయినట్టు సమాచారం.
గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్నప్పుడు పూతలపట్టు జెడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డి ఆమె వద్ద పీఏగా పనిచేశారు. పదవిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయి ఎలాంటి అధికార హోదా లేకపోయినా ఆమె వద్దే ఇంకా సదరు పంతులయ్య సేవలందిస్తున్నట్టు విద్యాశాఖలో ఆరోపణలు ఉన్నా యి. బాలకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
ఆధార్ నమోదు కోసం నియమించాం
జిల్లాలో స్కూల్ పిల్లల ఆధార్ నమోదు కోసం పూతలపట్టు హైస్కూల్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డిని డెప్యుటేషన్‌పై నియమించాం. ఆ మేరకు గత డీఈవో ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీవైఈవో కార్యాలయానికే ఆయన వచ్చి హాజరుపట్టీలో సంతకం పెట్టాల్సి ఉంది. ఓ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నట్టు ఆధారాలు ఉంటే పరిశీలిస్తాం.
-వాసుదేవ నాయుడు, డీవైఈవో చిత్తూరు
ఆధార్‌కు కాదు.. టీడీపీకి డెప్యుటేషన్
Published Tue, Jan 6 2015 2:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement