తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యులుగా చేరే వారి కులమేంటని ఆ పార్టీ ఆరా తీస్తోంది. సభ్యత్వ నమోదు సమయంలో కులం (సామాజికవర్గం) ఏంటో చెప్పాలని గట్టిగా కోరుతోంది.
సాక్షి, అమరావతి: తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యులుగా చేరే వారి కులమేంటని ఆ పార్టీ ఆరా తీస్తోంది. సభ్యత్వ నమోదు సమయంలో కులం (సామాజికవర్గం) ఏంటో చెప్పాలని గట్టిగా కోరుతోంది. ప్రతి ఒక్కరి సామాజికవర్గం ఏమిటో చెప్పిన తరువాతనే వారిని సభ్యులుగా చేర్పించుకొంటోంది.
ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. వంద రూపాయలు ఇచ్చిన వారిని క్రియాశీలక కార్యకర్తలుగా చేర్చుకోవటంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధస్తోంది. సామాజికవర్గం నమోదుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ పొందుపరిచిన యంత్రాలను ఉపయోగిస్తోంది.