Membership Registration
-
13 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీతో రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదు ముగించాల్సి ఉంది. సభ్యత్వ నమోదు టార్గెట్ 50 లక్షలు కాగా, శుక్రవారం నాటికి రాష్ట్రంలో 20 లక్షల మంది (5 లక్షల దాకా మిస్డ్‌కాల్‌తో నమోదు, అసంపూర్తి వివరాలు) పార్టీ సభ్యులుగా చేరినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సభ్యుల్లో 15 లక్షల మంది పూర్తి వివరాలు నమోదు చేయగా, మిగతా వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉన్నట్టుగా తేలింది. దీంతో దసరా పండుగ తర్వాతి మూడురోజులు ‘స్పెషల్ డ్రైవ్’పేరుతో సభ్యత్వ నమోదు ఉధృతంగా చేపట్టాలని బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 36 వేల పోలింగ్ బూత్‌లలో ఒక్కోదాంట్లో కనీసం వంద మంది సభ్యులను చేరి్పంచడం ద్వారా మరో పది లక్షలకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత వంద మంది సభ్యులను చేరి్పంచిన వారితో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తారు. క్రియాశీల సభ్యులుగా ఉన్నవారే పార్టీ బూత్, మండల, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 15 నాటికి ‘యాక్టివ్ మెంబర్íÙప్’పూర్తయ్యాక, ఆ తర్వాత బూత్ కమిటీల ఎన్నిక, ఆపై మండల అధ్యక్షులు, మళ్లీ వారు జిల్లా అధ్యక్షులను, ఆ తర్వాత వారంతా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల మంది ఓటు వేయగా, ఈ ఓట్లలో 75 శాతం అంటే 50 లక్షల దాకానైనా సభ్యులుగా చేర్పించేలా ప్రయతి్నంచాలని బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్రపార్టీ సభ్యత్వ కార్యక్రమ కనీ్వనర్ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
స్మృతి ఇరానీకి ఢిల్లీ పగ్గాలు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీఠమెక్కాలన్న కసితో బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -సాక్షి, న్యూఢిల్లీ -
సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోకపోతే తిప్పలు తప్పవని బీజేపీ అధిష్టానం నాయకులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ.. పూర్తిస్థాయిలో నిమగ్నం కావాల్సిందేనని జాతీయ నాయకత్వం స్పష్టంచేసింది. సభ్యత్వ నమోదులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు పోలైనందున, వాటిలో 60 నుంచి 65 లక్షల దాకానైనా ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని నాయకులను పార్టీ పదవుల్లో నుంచి తొలగిస్తామని తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జి అభయ్ పాటిల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు సాగుతున్న తీరును పర్యవేక్షించారు. శని, ఆదివారాల్లోనూ ఆయన రాష్ట్రంలోని వివిధచోట్ల పర్యటించి సభ్యత్వ నమోదును పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై సమాచారాన్ని సేకరించి, నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పారీ్టనేతలు అప్రమత్తం అయ్యారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. -
భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు
న్యూఢిల్లీ: తమ యువజన విభాగం భజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో భజరంగ్ దళ్ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్సైట్ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని గురువారం వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే మీడియాతో అన్నారు. కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. -
దక్షిణాదిపై ‘ఆప్’ నజర్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అఖండ విజయం తాలూకు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నేత సోమనాథ్ భారతి చెప్పారు. పంజాబ్‌లో గెలుపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆప్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. మార్పు కోరేవారంతా ఆప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో దశల వారీగా పాదయాత్రలు సైతం చేపట్టాలని నిర్ణయించినట్లు సోమనాథ్ భారతి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి పాదయాత్రలకు శ్రీకారం చుడతామని వివరించారు. పాదయాత్రలో తొలి అడుగు తెలంగాణలోనే వేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. -
త్వరలో వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభమవుతుందని, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ సభ్యత్వంలో ప్రతిఫలించాలని పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగువారు ఎక్కడ నివసిస్తున్నా వారి వివరాలన్నీ ఏపీఎన్ఆర్టీఎస్ వద్ద ఉండేలా చూడాలని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా రూపొందిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ప్రతి కార్యకర్త సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా పార్టీని సీఎం జగన్ పటిష్టం చేశారని తెలిపారు. ఇందులో కార్యకర్తల పాత్ర క్రియాశీలకంగా ఉంటుందన్నారు. 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు లాంటి ఎన్నో పదవులు కార్యకర్తలకు లభించాయని తెలిపారు. చదవండి: (వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమైన పునాది: విజయసాయిరెడ్డి) సీఎం జగన్ తనదైన వ్యూహాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరే పార్టీ అభ్యర్థుల ఘన విజయాలకు కారణమని తెలిపారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మరింత ఉత్తేజ పరిచి పార్టీని పటిష్ట పరుస్తున్నామని తెలిపారు. బూత్ స్థాయి కమిటీలను మరింత శక్తివంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైఎస్సార్ సేవాదళ్), తెల్లం బాలరాజు (ఎస్టీ విభాగం), జక్కంపూడి రాజా (యూత్ విభాగం), ఆరిమండ విజయ శారదారెడ్డి(డ్వాక్రా విభాగం), ఖాదర్ బాషా (మైనారిటీ విభాగం), ఆరిమండ వరప్రసాదరెడ్డి, కుప్పం ప్రసాద్ (వాణిజ్య విభాగం), టీఎస్ విజయచందర్ (పబ్లిసిటీ విభాగం), వంగపండు ఉష (సాంస్కృతిక విభాగం), గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి (సోషల్ మీడియా విభాగం), డి.సూర్యనారాయణ రాజు (పంచాయతీరాజ్ విభాగం) పాల్గొన్నారు. -
సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జ్‌లు...
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పార్టీ నాయకత్వం జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. పార్టీ కార్యదర్శులు జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. రెండు లేదా మూడేసి జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ వంటి దూరప్రాంత జిల్లాలకు చెందిన బాధ్యులకు ఆదివారం సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. మిగతా జిల్లాలకు ఈ నెల 12 లోగా సభ్యత్వ నమోదు పుస్తకాలు చేరవేస్తామని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా జిల్లాల వారీగా అరిగెల నాగేశ్వర్రావు (ఆదిలాబాద్), లోక భూమారెడ్డి (నిర్మల్), ఫారూక్ హుస్సేన్ (ఆసిఫాబాద్), గూడూరు ప్రవీణ్ (మంచిర్యాల), ముజీబుద్దీన్ (నిజామాబాద్), డి.విఠల్‌రావు (కామారెడ్డి), కోలేటి దామోదర్ (కరీంనగర్), లోక బాపురెడ్డి (పెద్దపల్లి), కర్ర శ్రీహరి (రాజన్న సిరిసిల్ల), భానుప్రసాద్ (జగిత్యాల) సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా పనిచేస్తారు. వీరితో పాటు రాధాకృష్ణ శర్మ (మెదక్), బక్కి వెంకటయ్య (సంగారెడ్డి), ఫరీదుద్దీన్ (సిద్దిపేట), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు, భూపాలపల్లి), లింగంపల్లి కిషన్‌రావు (మహబూబాబాద్), మాలోత్ కవిత (జనగాం), వై.కృష్ణారెడ్డి (వరంగల్ అర్బన్), మెట్టు శ్రీనివాస్ (వరంగల్ రూరల్), వెంకటరత్నం బాబు (ఖమ్మం), తాతా మధు (కొత్తగూడెం) ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్) అలాగే బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ), రామకృష్ణారెడ్డి (సూర్యాపేట), వై.వెంకటేశ్వర్లు (యాదాద్రి), గట్టు రామచందర్‌రావు (రంగారెడ్డి), జహంగీర్‌పాషా (వికారాబాద్), రాంబాబు యాదవ్ (మేడ్చల్), శంభీపూర్ రాజు (హైదరాబాద్), నాగేందర్ గౌడ్ (మహబూబ్‌నగర్), అందె బాబయ్య (నారాయణపేట), బి.శ్రీనివాస్ యాదవ్ (గద్వాల), వాల్యా నాయక్ (నాగర్‌కర్నూలు), ఇంతియాజ్ (వనపర్తి) కూడా సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా పనిచేస్తారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.గంగాధర్‌గౌడ్, సత్య వతి రాథోడ్, ఎం.సుధీర్‌రెడ్డి, బసవరాజు సారయ్య, బండి రమేశ్, బి.వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్‌రావు, జి.బాలమల్లు, నూకల నరేశ్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్రావు, పి.రాములు, ఆర్.శ్రావణ్‌రెడ్డి, నరేంద్రనాథ్, బండా ప్రకాశ్, భరత్ కుమార్ గుప్తా రెండు లేదా మూడు జిల్లాలకు సభ్యత్వ నమోదు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. -
‘సభ్యత్వ’ సమరం...
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు అంశం అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. బోగస్ సభ్యత్వాలు అంటూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. సభ్యత్వ నమోదు గణాంకాలపై ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. రెండేళ్లపాటు అమల్లో ఉండే పార్టీ సభ్యత్వాల సేకరణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్ 27న ప్రారంభించారు. కోటి మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకోగా సుమారు నెలన్నర వ్యవధిలో 60 లక్షల మందికి టీఆర్ఎస్ సభ్యత్వం ఇచ్చారు. ఇందులో 20 లక్షల మంది క్రియాశీల సభ్యులని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ ఖాతాకు రూ. 25 కోట్ల మేర నిధులు సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 31 వరకు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 50 వేల సభ్యత్వాల ద్వారా దేశంలోనే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని కేటీఆర్ ప్రకటించారు. బోగస్ లెక్కలు మీవే.. కాదు మీవే రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని బీజేపీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ ఏడాది జూలై 6న ప్రారంభించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ, టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ఇరు పార్టీలు ‘బోగస్ సభ్యత్వాలు’అంటూ పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్వి బోగస్ సభ్యత్వాలు అని, పార్టీ నేతలే జాబితాలు తయారు చేశారని బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ ‘మిస్డ్‌కాల్’ద్వారా చేసిన సభ్యత్వాలను కూడా కలుపుకొని పార్టీ సభ్యుల సంఖ్య 13 లక్షలు అని చెప్పుకుంటోందని టీఆర్ఎస్ ప్రతివిమర్శలు చేసింది. బీజేపీ తరహాలో మిస్డ్‌కాల్ సభ్యత్వాలు చేయాలనుకుంటే గంట వ్యవధిలో మూడు కోట్లు చేస్తామని ఎద్దేవా చేసింది. సభ్యత్వాల సేకరణ, సంఖ్యను ఇరు పార్టీలు తాము రాష్ట్రంలో బలంగా ఉన్నామనే సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నాయి. నగరంలో టీఆర్ఎస్ విజయోత్సవ సభ... రాష్ట్రంలో 60 లక్షలకుపైగా సభ్యత్వాలను సేకరించామనే అంశానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా బీజేపీ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం యూసుఫ్‌గూడలోని విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 8 వేల మందికిపైగా పార్టీ కార్యకర్తలు సభకు హాజరవుతారని చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. -
‘పంచాయతీ’ బరిలో టీజేఎస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావసభ విజయవంతమైందని, ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుం దని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం కృషి చేసే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆసక్తి ఉన్నవారు పార్టీలో చేరేందుకు దరఖాస్తులు పంపాలని కోరారు. రెండు రోజుల్లో దరఖాస్తు ఫార్మాట్‌ను ఫేస్బుక్, పార్టీ వెబ్సైట్, మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. దరఖాస్తుల పరిశీలనలకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జీలను నియమిస్తున్నామని, వారు పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదుతోపాటు జిల్లా స్థాయిలో తాత్కాలిక కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడతారని చెప్పారు. ఓటర్లను జాగృతం చేయండి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదుకు ఈ నెల 8 వరకు గడువు ఉన్నందున.. ఓటర్ల నమోదుపై ప్రజలను జాగృతం చేయా లని కోదండరామ్ సూచించారు. పార్టీ మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని, ఆ చట్టం అమలుకు ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి చేస్తుందని వెల్లడించారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జీల నేతృత్వంలో సదస్సులు, చర్చా కార్యక్రమాలు కొనసాగుతా యని గాదె ఇన్నయ్య తెలిపారు. సమావేశంలో రౌతు కనకయ్య, పీఎల్ విశ్వేశ్వర్రావు, రవీందర్రావు, ధర్మార్జున్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయం మనదే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొంతకాలంగా రాష్ట్రంలో రెండే ప్రధాన చర్చలు. ఒకటి రజనీ పార్టీ, రెండోది కమల్ పార్టీ. వీటిల్లో కమల్‌హాసన్ పార్టీ ఎప్పుడు...ఏమిటి...ఎలా అనే చర్చకు ఈనెల 21వ తేదీన తెరపడింది. మక్కల్ నీది మయ్యం అని పార్టీ పేరును ప్రకటించిన కమల్‌హాసన్ తరువాత కార్యాచరణ ప్రణాళికలో ఉన్నారు. ఇక మిగిలింది రజనీకాంత్ పార్టీ. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని గత నెలలో ప్రకటించడం ద్వారా కొన్ని ఊహాగానాలకు తావులేకుండా చేశారు. అయితే పార్టీ పేరు, పతాకం, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎప్పుడో రజనీ చెప్పడం లేదు. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాలు సాగిస్తున్నారు. ఎవరు ముందా అని ప్రజలు ఎదురుచూస్తుండగా ఈనెల 21న కమల్ తన పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఇక రజనీవంతైంది. జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాల్లో భాగంగా ఈనెల 20 నుంచి ‘రజనీకాంత్ ప్రజా సంఘం’ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో కాంచీపురం, విల్లుపురం, కడలూరు జిల్లాల ఇన్‌చార్జ్‌ల ఎంపిక కార్యక్రమం జరిగింది. జాతీయ ఇన్‌చార్జ్‌లు నిర్వహించే ఈ సమావేశాలకు రజనీకాంత్ హాజరుకావడం లేదు. సుదూర జిల్లా నుంచి వచ్చే అభిమానులు రజనీని చూడలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే ఈనెల 21న కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించి తన కంటే ఒక అడుగు ముందుకు వేయడంతో రజనీ కూడా జోరు పెంచారు. చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో శుక్రవారం తిరునెల్వేలి జిల్లా సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజనీకాంత్ అకస్మాత్తుగా హాజరయ్యారు. రజనీ వస్తారని ఏ మాత్రం ఎదురుచూడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమానుల సంఘాల నుంచి మా పార్టీ ఉద్బవిస్తోంది. తాము ఇప్పుడు చేసేదల్లా వాటిని మరింత బలోపేతం చేయడం. నా అభిమానులకు ఎవ్వరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిమానులే ఇతరులకు పాఠం చెప్పగలరు. ఏమి చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం జరుపుకుంటూ రాజకీయాల్లో మార్పు తేవడం సాధ్యం అనే నమ్మకం నాకుంది. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమల్ నిర్వహించిన బహిరంగసభ బాగుంది, కమల్‌కు ముందుగానే నేను శుభాకాంక్షలు చెప్పాను. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలూ కలిసి పోరాడాలి. అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తికాగానే రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను. రజనీ ఏమిటి ఇలా మౌనంగా ఉన్నారని కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని అలానే విమర్శించనీయండి, మన పనిలో మనం ఉందాం. నేను కుటుంబ పెద్దగా సరిగ్గా ఉన్నాను, మనమంతా ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నాం. 32 జిల్లాల ఇన్‌చార్జ్‌లను ఒకేసారి కలుసుకునేందుకు కొద్దిరోజులవుతుంది. అన్ని జిల్లాల నియామకం పూర్తికాగానే రాష్ట్రపర్యటన తేదీలను ఖరారు చేస్తాను. కావేరీ జలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎడపాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. -
గులాబీలో సంస్థాగత సందడి!
∙ ముమ్మరంగా సభ్యత్వ నమోదు ∙ జిల్లాలో పట్టు నిలుపుకొనే యత్నం ∙ ప్లీనరీలోపు సంస్థాగత ప్రక్రియ పూర్తికి ఆదేశాలు ∙ తలమునకలైన పార్టీ శ్రేణులు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో సంస్థాగత సందడి మొదలైంది. ఇప్పటికే గ్రామ కమిటీలను పూర్తిచేసిన గులాబీ నాయకత్వం.. తాజాగా మండల కమిటీల నియామకాలను చేపడుతోంది. ఈ నెల 21న మేడ్చల్ జిల్లా కొంపల్లిలో పార్టీ ప్లీనరీని నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ లోపు సంస్థాగత ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేసిన గులాబీ బాస్.. నియోజకవర్గాల స్థాయి వరకే పార్టీ కమిటీలను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మండల కమిటీల నియామకాలను మొదలు పెట్టింది. శనివారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత నియోజకవర్గాల సమన్వయ కమిటీలను ప్రకటించనుంది. భారీగా సభ్యత్వ నమోదు ఈ నెల తొలివారంలో సభ్యత్వ నమోదును మొదలుపెట్టిన టీఆర్ఎస్.. జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వాలను చేసింది. రెండేళ్ల క్రితం జిల్లాలో అంతగా పట్టులేని గులాబీ దళం.. ఇప్పుడు బలీయశక్తిగా ఎదిగింది. టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో పూర్తిస్థాయిలో పాగా వేసింది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా పచ్చపార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా టీఆర్ఎస్ చుక్కలు చూపింది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను తమ గూటిలో చేర్చుకుంది. తద్వారా విపక్షాలకు దీటుగా ఎదిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సభ్యత్వ నమోదులో రికార్డులను అధిగమించింది. సభ్యత్వ నమోదులో అక్కడక్కడగా పాత, కొత్త నేతల మధ్య అంతరాలు బయటపడ్డప్పటికీ, ఆదిలోనే వాటికి ఫుల్స్టాప్ వేయడం ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను సజావుగా ముగించేసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య గ్రూపులు ఉండడం.. పార్టీ కార్యక్రమాలను విడివిడిగా చేయడమేగాకుండా.. కొన్నిచోట్ల విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న అధిష్టానం పెద్దలు నష్టనివారణ చర్యలకు దిగారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో వివాదానికి ఫుల్స్టాప్ పడింది. ఈ క్రమంలోనే గ్రామ కమిటీల ఎంపిక కూడా సజావుగానే పూర్తయింది. అక్కడక్కడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదాపడ్డాయి. మండల కమిటీల ఖరారులోనూ సమన్వయం పాటించినప్పటికీ, కొన్నిచోట్ల పోటీ తీవ్రంగా ఉండడం.. పంతాలకు పోవడంతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం మండల కమిటీలను ప్రకటించి.. నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీలను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు జాబితాకు స్థానిక ప్రజాప్రతినిధులు తుదిరూపు ఇచ్చారు. జిల్లా కమిటీల్లేకపోవడంతో సాధ్యమైనంతవరకు సీనియర్లకు ఇందులో చోటు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ నెల 21న కొంపల్లిలో జరిగే ప్లీనరీ, 27న వరంగల్‌లో జరిగే బహిరంగసభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. -
కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
-
కారు.. పోరు!
గులాబీలో ఆధిపత్య పంచాయితీ ► సభ్యత్వ నమోదులో రచ్చకెక్కుతున్న విభేదాలు ► పాత, కొత్త నేతల మధ్య అంతరం ► మహేశ్వరంలో భౌతికదాడులకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీలో ఆధిపత్య పోరు మొదలైంది. పాత, కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య, సఖ్యతతో పార్టీ పరువు రచ్చకెక్కుతోంది. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అసమ్మతి రాజకీయాలకు వేదికగా మారింది. మొన్న జిల్లా పరిషత్ మొదలు.. నిన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమన్ గల్లో బయటపడిన విభేదాలు తాజాగా మహేశ్వరంలో వైరివర్గాల భౌతికదాడులతో తారస్థాయికి చేరాయి. సంస్థాగతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘ విరామం అనంతరం అధికారపార్టీ సభ్యత్వ నమోదు పేరిట ప్రజల్లోకి వెళుతోంది. ఇదే అదనుగా ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కాస్తా ఒక్కసారి పెల్లుబికుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత, కొత్త నేతల మధ్య స్పష్టమైన విభజనరేఖ వచ్చింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించింది. దీనికితోడు ఇటీవల నామినేటెడ్ పదవుల పంపకంలోనూ కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తుండడం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి కోపం తెప్పిస్తోంది. ఉద్యమకాలంలో వెన్నంటి నిలిచినవారిని కాదని ఎన్నికలఅనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నవారి మాట చెల్లుబాటు అవుతుండడం.. ఆఖరికి సభ్యత్వ నమోదు పుస్తకాలను ఎమ్మెల్యేలకే ఇస్తుండడం పార్టీని అంటిపెట్టుకున్న పాతతరం నాయకులకు మింగుడు పడడంలేదు. ఈ పరిణామాలు అధికారపార్టీలో ముసలానికి దారితీస్తున్నాయి. మొన్న జిల్లా పరిషత్‌లో జెడ్పీటీసీ సభ్యులు ఏకంగా మంత్రి మహేందర్‌రెడ్డిపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. రాజీనామాస్త్రాలు సంధించడం ద్వారా అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు. నయానో భయానో వారిని బుజ్జగించి దారిలో పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం టీఆర్ఎస్లో అంతర్యుద్ధానికి అద్దంపడుతున్నాయి. లుకలుకలకు కారణం ఇదే! 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినవారిని పార్టీలో చేర్చుకోవడంతో గులాబీలో అసమ్మతి రాజకీయాలకు బీజం పడింది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ‘కారె’క్కడంతో పార్టీలో విభేదాలకు కారణమైంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎల్బీనగర్, షాద్‌నగర్‌లోనూ అంతర్గతపోరు ఉన్నప్పటికీ, బహిర్గతం కాకపోవడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు కాస్తా సజావుగానే సాగుతున్నాయని అనుకోవచ్చు. పట్నంలో రెండు శిబిరాలు! ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్లో అంతర్యుద్ధం వీధికెక్కింది. మూడు గ్రూపులు.. ఆరు కీచులాటలతో పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కంచర్ల శేఖర్‌రెడ్డితో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. దీనికితోడు ఈసీ శేఖర్‌గౌడ్, ఎంపీపీ నిరంజన్ రెడ్డి తదితరులు కూడా మంచిరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శేఖర్‌రెడ్డితో జతకట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో హైకమాండ్ జోక్యం చేసుకున్నప్పటికీ గాడిలో పడ్డట్లు కనిపించడంలేదు. కల్వకుర్తిలో వేరుకుంపట్లు అసమ్మతి రాజకీయాల్లో కల్వకుర్తి తనదైన ముద్ర వేస్తోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వర్గీయులు బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న మాడ్గులలో జరిగిన ఓ కార్యక్రమంలోనే రెండు వర్గాలు కలియబడగా.. తాజాగా తలకొండపల్లి, ఆమన్ గల్ మండలాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మందా, జైపాల్‌యాదవ్ సమక్షంలో కసిరెడ్డి వైఖరిని తూర్పారబట్టడం ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ ఓటమికి కారణమైన నేతలను అందలం ఎక్కించడం.. కాంగ్రెస్ సర్పంచ్‌లకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తూ కసిరెడ్డిని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి సమావేశాల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూ మందా, జైపాల్‌యాదవ్ మాట్లాడడం పట్ల ఎమ్మెల్సీ వర్గీయులు మండిపడుతున్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతుంటే ఓర్వలేకనే ఈ కార్యకర్తల్లో ఆగాధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చేవెళ్లలోను సేమ్ సీన్ చేవెళ్ల నియోజకవర్గంలోనూ అధికారపార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే రత్నం.. ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. తనను ఓడించిన యాదయ్యను పార్టీలో చేర్చుకోవడంతో నిరాశకు గురైన రత్నం.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు పార్టీ ఫిరాయించిన యాదయ్య వర్గీయులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తన అనుచరులకు వెన్నుపోటు పొడుస్తున్నారని రత్నం మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం చేవెళ్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి సైతం ఆయన గైర్హాజరవడం.. సీనియర్లు ముఖం చాటేయడం చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అంతరం పెరుగుతుందని చెప్పవచ్చు. మహేశ్వరంలో డిష్యుం.. డిష్యుం మహేశ్వరంలో గులాబీ రాజకీయం ఠాణాకెక్కింది. పాత, కొత్త నేతల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరి.. అది కూడా భౌతికదాడులకు దారితీసింది. పార్టీకి మొదట్నుంచి సేవలందిస్తున్న కప్పాటి పాండురంగారెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన కొత్త మనోహర్‌రెడ్డిలతో ప్రస్తుత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో అభిప్రాయబేధాలున్నాయి. టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరిన తీగల.. తన అనుచరులకే పెద్దపీట వేశారు. తనను అనుసరించిన నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఇది సోమవారం మహేశ్వరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిషు్యం.. డిషు్యంకు తెరలేపింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని కప్పాటి ప్రశ్నించిన పాపానికి ఆయన మద్దతుదారులపై భౌతికదాడి జరిగింది. దీంతో సమావేశం కాస్తా రసబాసగా ముగిసింది. తన రాకతోనే పార్టీ బలోపేతమైందని.. కబడ్దార్! అంటూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వైరివర్గానికి సవాల్ విసరడం.. ఆ తర్వాత ఈ వివాదం కాస్తా పోలీస్‌స్టేషన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది. -
నీ కులమేంది?..టీడీపీ సభ్యత్వనమోదులో ఆరా
సాక్షి, అమరావతి: తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యులుగా చేరే వారి కులమేంటని ఆ పార్టీ ఆరా తీస్తోంది. సభ్యత్వ నమోదు సమయంలో కులం (సామాజికవర్గం) ఏంటో చెప్పాలని గట్టిగా కోరుతోంది. ప్రతి ఒక్కరి సామాజికవర్గం ఏమిటో చెప్పిన తరువాతనే వారిని సభ్యులుగా చేర్పించుకొంటోంది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. వంద రూపాయలు ఇచ్చిన వారిని క్రియాశీలక కార్యకర్తలుగా చేర్చుకోవటంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధస్తోంది. సామాజికవర్గం నమోదుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ పొందుపరిచిన యంత్రాలను ఉపయోగిస్తోంది. -
సభ్యత్వ నమోదులో బీజేపీ ప్రపంచ రికార్డు
కైకలూరు: సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కృష్ణాజిల్లా కైకలూరులో ఆయన విలేకరులతో మట్లాడుతూ.. ఇప్పటివరకు చైనా మార్క్సిస్టు పార్టీ 8.30 కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. దేశంలో ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వాలు 10 కోట్లు దాటాయని తెలిపారు. నమోదుకు మరో 10 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు కామినేని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
ఎదగని కమలం!
⇒ రాష్ర్టంలో పుంజుకోని బీజేపీ ⇒ ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టమేనంటున్న నేతలు ⇒ తలో దారిలో వెళుతున్న పార్టీ ముఖ్య నేతలు ⇒ అంతకంతకూ పెరుగుతున్న అసమ్మతి ⇒ పార్టీ అధ్యక్షుడి తీరుపైనా విమర్శలు ⇒ సభ్యత్వ నమోదులోనూ వెనుకబాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందన్న అంచనాలు తప్పుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కమల దళం ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని భావించినప్పటికీ ఇప్పుడు అది సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ర్టంలో బీజేపీ పాగా వేస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు తమ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నా రాష్ట్రంలో పార్టీ పునాదులు ఏమాత్రం బలపడకపోవడమే దీనికి కారణమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బలమైన నాయకత్వం కలిగి ఉన్నా రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలను కూడగట్టుకోవడంలో పార్టీ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలోని సీనియర్ నేతలే ఒక్క దారిలో వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీని ఒక్కతాటిపై నడిపించగల నేతలను పక్కనబెట్టి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న వారికే పార్టీ పదవులను కట్టబెడుతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రరావు విజయానికి 50 శాతం అభ్యర్థి వ్యక్తిగతమైతే, మిగిలింది టీఆర్ఎస్పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకతే కారణాలని బీజేపీ నేత ఒకరు విశ్లేషించడం గమనార్హం. నాలుగోవంతు కూడా కాని సభ్యత్వాలు పార్టీ నేతల మధ్య సఖ్యత లేదనడానికి సభ్యత్వ కార్యక్రమం జరుగుతున్న తీరే అద్దం పడుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ హవా దృష్ట్యా రాష్ట్రంలో పోలింగ్ బూత్‌కు 200 మంది చొప్పున 62 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని పార్టీ నేతలు భావించా రు. దానికి అనుగుణంగా కార్యక్రమాలు కూడా రూపొందించారు. కానీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం దాకా నమోదైన సభ్యత్వాలు 8 లక్షలు దాటలేదు. మరో రెండు వారాల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. ఆన్లైన్ సభ్యత్వాల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని పార్టీ నేతలు అంటున్నారు. అదే తమకు అవరోధంగా మారుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు చెప్పారు. అధ్యక్షునితోనే సమస్య? రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మాదిరి బయటకు కనిపించకపోయినా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయారు. అందరినీ ఏకతాటిపై నడిపించాల్సిన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో వెళుతున్నారని, దానివల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు ఒకరు వ్యాఖ్యానించారు. బయటకు గుంభనంగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అసమ్మతి రోజురోజుకూ పెరుగుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్లే దురవస్థ మరోవైపు పార్టీ అధ్యక్షుని వైఖరిని తప్పుబడుతున్న వారే ప్రస్తుత దురవస్థకు బాధ్యులని కిషన్‌రెడ్డి సన్నిహితులు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉనికిని కాపాడుకోవాలన్న కిషన్‌రెడ్డి వ్యూహాన్ని వ్యక్తిగత స్వార్థంతో ఇద్దరు మాజీ అధ్యక్షులు వ్యతిరేకించారని మండిపడుతున్నారు. ‘టీడీపీ మద్దతుతో ఎన్నికల్లో గెలవాలన్నది వారి తాపత్రయం. దాని కోసం మొత్తం పార్టీ కేడర్‌ను, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి తీవ్ర అన్యాయం చేశారు. టీడీపీతో పొత్తు కారణంగా అనేక మంది పార్టీని వీడారు. పార్టీ బలహీనం కావడానికి వారే కారణం’ అని సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. టీడీపీతో పొత్తు కారణంగానే పార్టీ ఎదగలేకపోతోందని మెజారిటీ నేతలు అంగీకరిస్తున్నారు. -
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
పార్టీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ శంషాబాద్ : కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్కరాజు ఆధ్వర్యంలో గురువారం బస్టాండ్ చౌరస్తాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారుతున్నాయన్నారు. జనధన్‌యోజన, స్వచ్ఛభారత్‌తో పాటు అనేక రకాల కీలక నిర్ణయాలతో సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేమ్‌రాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పు బాషా, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ప్రశాంత్, కొండ ప్రవీణ్, జగన్, చంద్రయ్య, యాదగిరి, ధన్‌రాజ్, ఆంజనేయులు, సత్యనారాయణ, శ్రీధర్, మల్లేష్, రవి పాల్గొన్నారు. -
అన్ని దారులూ అటువైపే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాయి. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాం గ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ... ఇలా అన్ని పార్టీలు స్థానిక పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఇటీవలే సభ్యత్వ నమోదును ప్రారంభించి బిజీబిజీగా ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసుకుని గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. మరోవైపు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా పార్టీ మహాసభలపై దృష్టి పెట్టాయి. సీపీఎం జిల్లా మహాసభలను పూర్తి చేసుకుని రాష్ట్ర మహాసభల కోసం ఎదురుచూస్తుండగా, సీపీఐ ఇప్పుడే మండల, డివిజన్ సమితిలను ఏర్పాటు చేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా జిల్లాలో పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసుకుని స్థానిక కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇక, వైఎస్సార్సీపీ ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్న ఊపులో ఉంది. అధికారంతో స్పీడు మీదున్న గులాబీ సేన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తర్వాత కొత్త ఊపుతో వెళుతున్న టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం అధినేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా 3.6లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో పడ్డారు వారంతా. సభ్యత్వాలు పూర్తయిన వెంటనే స్థానిక కమిటీలను వేసుకుని కొత్త జిల్లా కమిటీని ఏప్రిల్‌లో ఏర్పాటు చేసుకుంటామని, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. సభ్యత్వం ప్రారంభమైన వారం రోజుల్లో 30 శాతానికి పైగా (లక్షకు పైగా) సభ్యత్వాలు పూర్తయ్యాయని, నిర్ణీత గడువులోపు లక్ష్యాన్ని మించి 5లక్షల మంది వరకు పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మూడు లక్షల్లో 75 శాతం.. కాంగ్రెస్ ఇక, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యత్వ నమోదు చేస్తూనే ఉంది. ఎప్పుడో ప్రారంభమైన ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటివరకు 75 శాతం పూర్తయినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 25వేల మంది చొప్పున మూడు లక్షల మందిని పార్టీలో చేర్చుకోవడం లక్ష్యం కాగా, ఇందులో 75 శాతం అంటే 2లక్షలకు పైగా సభ్యత్వాలు పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ సభ్యత్వ ప్రక్రియను నెలాఖరు కల్లా పూర్తి చేసుకుని మార్చి మొదటి వారంలో గ్రామ, మండల, బ్లాక్ స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకెళతామని, జిల్లాలో కాంగ్రెస్‌కున్న పటిష్ట పునాదులను కాపాడుతామని వారంటున్నారు. కొత్త ఊపులో వైఎస్సార్సీపీ ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే కొత్త తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. అందులో జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు తగిన ప్రాధాన్యం లభించింది. జిల్లా అధ్యక్షుడు డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నేతలు గున్నం నాగిరెడ్డి, ఎర్నేని బాబు, వడ్లోజు వెంకటేశం, ఇరుగు సునీల్ కుమార్, గూడూరు జైపాల్‌రెడ్డిలకు ఈ కమిటీలో స్థానం లభించింది. మరోవైపు గత నెలలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో నిర్వహించిన పరామర్శయాత్రకు మంచి స్పందన లభించింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన ఆమెను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నాయి. త్వరలోనే జిల్లాలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పనిలో పడతామని, త్వరలోనే తేదీలు ఖరారవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోనే టీడీపీ రెండో స్థానమంట... తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుంది. జిల్లాలో మొత్తం లక్షకు పైగా సభ్యత్వాలను చేసి రాష్ట్రంలోనే ఖమ్మం తర్వాత రెండో స్థానంలో నిలిచామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే, ఫిబ్రవరిలో గ్రామ, వార్డు కమిటీలు, మార్చిలో డివిజన్ కమిటీ లు, ఏప్రిల్‌లో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని మేలో జరిగే మహానాడు కోసం సిద్ధమవుతోంది పార్టీ యంత్రాంగం. అయితే, పార్టీ సభ్యత్వ నమోదులో ఆ పార్టీల నేతలు అనుసరించిన తీరుపై కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా.. లక్ష మందిని తమ పార్టీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ నేతలు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. సంస్థాగత నిర్మాణం కోసం ఇటీవలే జిల్లా కేంద్రం జనరల్‌బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నా... పార్టీలో ఉన్న గ్రూపులు, గొడవలు ఏ మేరకు సహకరిస్తాయి.. పార్టీ కమిటీలు ఎలా పూర్తి చేసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. కమ్యూనిస్టులదీ అదే దారి జిల్లాలోని రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు కూడా సంస్థాగత నిర్మాణ పనిలో పడ్డాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఇప్పటికే జిల్లా స్థాయి మహాసభలను పూర్తి చేసుకుని రాష్ట్ర మహాసభల కోసం ఎదురుచూస్తోంది. గ్రామ, మండల, డివిజన్ పార్టీ కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసుకుంది. ఇందులో కొన్నిచోట్ల పాతవారిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించింది. పార్టీ అనుబంధ సంఘాల మహాసభలు కూడా పూర్తయ్యాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభలకు జిల్లాలోని కోదాడ వేదిక కానుంది. ఈనెల 13 నుంచి ఆ మహాసభలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు పార్టీ రాష్ట్ర మహాసభల నిర్వహణకు గాను విరాళాల సేకరణ కోసం జిల్లా నుంచి దాదాపు 500 మందికి పైగా పార్టీ నేతలు, కార్యకర్తలు గత 15 రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఇక, సీపీఐ కూడా స్థానిక కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం మండల, డివిజన్ సమితిలను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర సమితిలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవడం ద్వారా ముందుకెళ్లాలని పార్టీ యోచిస్తోంది. స్థానిక కమిటీలపై రాష్ట్ర పార్టీదే నిర్ణయం.. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ జాతీయ నేత మురళీధర్‌రావు కూడా హాజరయ్యారు. మార్చి 31 వరకు ఈ సభ్యత్వ ప్రక్రియ సాగుతుందని పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే, నియోజకవర్గానికి 25వేల మంది చొప్పున మూడు లక్షల సభ్యుల్లో ఇప్పటివరకు 60శాతానికి పైగా పూర్తయిందని, ఆన్లైన్లో ఉన్న ఈ లెక్కలు త్వరలోనే నిర్వహించనున్న సమావేశంలో తేలుతాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే, స్థానిక కమిటీల ఏర్పాటుపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని, ఏప్రిల్‌లో రాష్ట్ర పార్టీ దీనిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం. -
రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!
జీహెచ్ఎంసీలో బలోపేతంపై టీఆర్ఎస్ మథనం 10రోజులే గడువున్నా మొదలుకాని సభ్యత్వ నమోదు నగర మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతం నేడు స్టీరింగ్ కమిటీతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు రాజధానిలో ఇంకా పట్టు చిక్కడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా ఎగరేయాలని చూస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి తాజా పరిణామాలు జీర్ణం కావడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోందని పార్టీ వర్గాలు ఆనందంలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క చోట కూడా సభ్యత్వ నమోదు మొదలు కాలేదు. కాకుంటే 18 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపామని, మంత్రులు కూడా హాజరయ్యారని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అసలు జీహెచ్ఎంసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలోనే పార్టీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలను నలుగురు మంత్రులకు పంచి, బాధ్యతలు అప్పజెప్పారు. కానీ ఊపు మాత్రం రాలేదు. 20వ తేదీతో సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. మరోవైపు ఒక్క రోజు కూడా గడువు పెంచబోమని సీఎం కె. చంద్రశేఖర్‌రావు తొలిరోజే ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్లో కేసీఆర్‌తో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మంత్రుల మధ్య కుదరని సయోధ్య నగరంలో నలుగురు మంత్రులున్నా, ప్రధానంగా అందరి దృష్టి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్పైనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బాధ్యతలను తలసాని ఆశించారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. తలసాని చేరినప్పటి నుంచే పద్మారావుగౌడ్ కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికల ముందే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పజె ప్పడంతో పద్మారావుగౌడ్ కూడా కొంత స్థిమితపడ్డారని, అయినా ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం సాగుతూనే ఉందని, అది సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీ గెలుచుకున్న స్థానాలు కేవలం మూడే. ఆ తర్వాత తలసాని, తీగల కృష్ణారెడ్డి టీఆర్ ఎస్‌లోకి రావడంతో ఆ సంఖ్య అయిదుకు పెరిగింది. మొదటి నుంచీ నగరంపై రాజకీయంగా అంతగా పట్టులేని టీఆర్ఎస్ ఈసారి మాత్రం గ్రేటర్‌పై జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్కు అధికార పార్టీ హోదా దక్కడంతో వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ కారణంగానే స్టీరింగ్ కమిటీలో స్థానం కోసం పోటీ ఎక్కువైంది. అందుకే ఏకంగా 57 మందిని ఈ కమిటీలోకి తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లుగా అవకాశం రావాలంటే స్టీరింగ్ కమిటీలో బాధ్యతలు ఉండాలన్న ఆలోచనతో నేతలు పోటీ పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి చేరిక ఎక్కువగా ఉండటంతో వారి బలాబలాలను పార్టీ నాయకత్వం అంచనా వేయలేక పోయిందంటున్నారు. దీంతో ఎవరినీ పక్కన పెట్టలేక జంబో కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, తక్షణం పార్టీని పట్టాలెక్కించడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు, నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారంనాటి సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్ నిర్దేశంతోనైనా సభ్యత్వ నమోదు ఊపందుకుంటుందన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
యూత్ కాంగ్రెస్‌లో తన్నులాట
రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గాల బాహాబాహీ రఘునాథపల్లి వద్ద ఘటన రఘునాథపల్లి: యూత్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నారుు. సభ్యత్వ నమోదు సందర్భంగా ఆధిపత్య పోరు అగ్గిరాజేసింది. పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి రఘునాథపల్లిలో గురువారం సభ్యత్వ నమోదుకు సమాయత్తమయ్యూరు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కీసర దిలీప్‌రెడ్డి అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. వివరాలు.. హన్మకొండకు చెందిన రమాకాంత్‌రెడ్డి ఖిలాషాపురంనకు చెందిన తన వర్గీయుడు మంద రమేష్, అనుచ రులతో రఘునాథపల్లి ఆర్యవైశ్య భవన్లో యూత్ సభ్యత్వ నమోదు కోసమని గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాము ఇప్పటికే మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టామని, సమాచారం లేకుండా ఇక్కడ ఎలా సమావేశం పెడుతావంటూ దిలీప్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అందరి ఆమోదంతోనే సమావేశం పెట్టాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కడారి నాగేశ్వర్ కూడా పేర్కొన్నారు. కానీ రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గలేదు. వాగ్వాదం జరగడంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పి వెళ్లారు. కొద్ది సేపటికి రమాకాంత్‌రెడ్డి తన వర్గీయులతో విలేకరులతో మాట్లాడుతుండగా దిలీప్వర్గీయులు తోపులాటకు దిగారు. రమాకాంత్రెడ్డిపై దాడిచేసి తరిమారు. రమాకాంత్‌రెడ్డి, ఆయన వర్గీయుడు ముప్పిడి శ్రవణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత ఠాణాలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో అధ్యక్షస్థానానికి మాజీ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. దిలీప్ సైతం పోటాపోటీగా సభ్యత్వాలు చేరుుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘర్షణ జరిగింది. తనను రాజకీయంగా ఎదుగకుండా కుట్ర పన్నుతున్నారని రమాకాంత్‌రెడ్డి ఆరోపించారు. కాగా, రమాకాంత్‌రెడ్డి పార్టీలో చిచ్చు పెడుతున్నాడని దిలీప్‌రెడ్డి ఆరోపించారు. -
ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా
తిరుపతి రూరల్: సభ్యత్వ నమోదు చేయడంలో టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓడించిన ధీశాలి గల్లా అరుణకుమారి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో చంద్రగిరి సభ్యత్వ నమోదు సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గర్వించే నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుందన్నారు. ఓడిన చోటే మళ్లీ విజయాన్ని వెతికేందుకు కృషి చేస్తున్న కెరటమని గల్లా అరుణకుమారిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభినందించారు. పార్టీ కోసం పనిచేస్తే వచ్చే తృప్తి ఆత్మసంతృప్తే వేరని, అందుకనే జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో నడిచామని మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గల్లా అరుణకుమారి చెప్పారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించడంతో భారీ కేక్‌ను కట్ చేశారు. అంతకుముందు వేదాంత పురం సర్కిల్ నుంచి సభా వేదిక వరకు మంత్రి బొజ్జల, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సత్యప్రభ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కార్యకర్తలతో కలసి ర్యాలీగా వచ్చారు. ర్యాలీ మధ్యలో కళాకారులతో కలసి చెక్కభజనలు చేశారు. టీడీపీ అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, నియోజకవర్గ సభ్యత్వ పరిశీలకురాలు పుష్పావతి, జెడ్పీటీసీ కుర్రకాల్వ సుభాషిణి, బీసీ పైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డెరైక్టర్ బడి సుధాయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
ఆధార్‌కు కాదు.. టీడీపీకి డెప్యుటేషన్
పంతులయ్య అధికార దుర్వినియోగం టీడీపీ సభ్యత్వ నమోదులో పంతులయ్య కృషిని పొగిడిన గల్లా అరుణకుమారి తిరుపతి రూరల్: పాఠాలు చెప్పాల్సిన పంతులయ్య పార్టీ భజన చేస్తున్నారా? బడి పిల్లల ఆధార్ నమోదు చేయటంలో బిజీగా ఉండాల్సిన ఆయన సైకిల్ ఎక్కి చక్కర్లు కొడుతున్నారా? ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటూ సేవలు మేడమ్ వద్ద వెలగపెడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి బహిరంగ వ్యాఖ్యలు చెబుతున్నాయి. టీడీపీ సభ్యత్వ నమోదులో తన పీఏ బాలకృష్ణారెడ్డి సేవలు అమోఘమని, అతనితోపాటు టీడీపీ నాయకుల తోడ్పాటుతోనే జిల్లాలోనే అత్యధికంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేసినట్టు సాక్షాత్తు మీడియా, పాత్రికే యులు, రాష్ట్ర మంత్రి, ఎంపీల సాక్షిగా గల్లా అరుణకుమారి స్కూల్‌టీచర్ బాలకృష్ణారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈయన విద్యాశాఖలో ఆధార్ ఎన్రోల్మెంట్ అధికారిగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. సోమవా రం సాయంత్రం తిరుపతి రూరల్ మం డలం వేదాంతపురంలో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు సంబరాల ముగింపు కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 65,200 సభ్యత్వాలు నమోదు చేయడంలో కృషి చేసిన వారికి గల్లా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన పీఏ బాలకృష్ణారెడ్డి, తన వద్ద పనిచేసే మురళి, తన ఇంట్లో పనివాళ్ల సహకారం మరువలేనిదన్నారు. గల్లా మాటలతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగి పార్టీ సభ్యత్వ నమోదులో కీలకంగా ఎలా మారాడంటూ చర్చించుకున్నారు. గల్లా పొగడ్తల సమయంలో సదరు బాలకృష్ణారెడ్డి వేదిక సమీపంలోనే ఉండడం గమనార్హం. మేడమ్ మాటలు తన ఉద్యోగానికి ఎక్కడ ఎసరు పెడతాయోనని ఆయన ఆప్తుల వద్ద వాపోయినట్టు సమాచారం. గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్నప్పుడు పూతలపట్టు జెడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డి ఆమె వద్ద పీఏగా పనిచేశారు. పదవిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయి ఎలాంటి అధికార హోదా లేకపోయినా ఆమె వద్దే ఇంకా సదరు పంతులయ్య సేవలందిస్తున్నట్టు విద్యాశాఖలో ఆరోపణలు ఉన్నా యి. బాలకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఆధార్ నమోదు కోసం నియమించాం జిల్లాలో స్కూల్ పిల్లల ఆధార్ నమోదు కోసం పూతలపట్టు హైస్కూల్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డిని డెప్యుటేషన్‌పై నియమించాం. ఆ మేరకు గత డీఈవో ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీవైఈవో కార్యాలయానికే ఆయన వచ్చి హాజరుపట్టీలో సంతకం పెట్టాల్సి ఉంది. ఓ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నట్టు ఆధారాలు ఉంటే పరిశీలిస్తాం. -వాసుదేవ నాయుడు, డీవైఈవో చిత్తూరు -
రాష్ర్టంలో అభివృద్ధి కుంటు
కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో అవినీతి పెరిగింది కర్ణాటకలో ఒక కోటి సభ్యత్వ నమోదు లక్ష్యం అమిత్ షా వెల్లడి బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కర్ణాటకలో అవినీతి పెరిగిపోతోందని, అభివృద్ధిలోనూ రాష్ట్రం వెనకబడి పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలో కోటి మందిని కొత్త సభ్యులుగా పార్టీలో చేర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశంచినట్లు తెలిపారు. బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కర్ణాటకలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తాను నగరానికి వచ్చాననడం సరికాదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో కోటి మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మూడు విడతల్లో సభ్యత్వ ‘మహా అభియాన్’ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... రాష్ట్రంలో మూడు విడతలో సభ్యత్వ నమోదుకు సంబంధించిన మహా అభియాన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10, 11తేదీల్లో మొదటి విడత మహా అభియాన్‌ను నిర్వహించనున్నామని, ఈ విడతలో 10లక్షలకు పైగా సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నామని తెలిపారు. ఇక రెండో విడత మహా అభియాన్ ఈ నెల 24, 25తేదీల్లో నిర్వహించనున్నామని, ఈ విడతలో 25లక్షల మేర సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నామని చెప్పారు. మూడో విడతకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మఠాలపై పెత్తనం చేసేందుకు గాను రూపొందించిన బిల్లు, గోహత్యా నిషేధ బిల్లును వెనక్కు తీసుకోవడం, చార్జీల తగ్గించేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజల మధ్యన ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా కోర్ కమిటీలో చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ అంశాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే దిశగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానంద గౌడ, బీజేపీ సీనియర్‌నేతలు యడ్యూరప్ప, కె.ఎస్. ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. సదస్యత్వ అభియాన రథం ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్యత్వ అభియాన్ కోసం ఎల్ఈడీ తెరతో ఏర్పాటుచేసిన రథాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం నగరంలోని గంగమ్మ తిమ్మయ్య సభాభవనంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా రాక సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం దారిలో వాహనాలను సైతం అనుమతించలేదు. ‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ దిశగా బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం.... ఇక బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో సైతం అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ను సాధించే దిశగా అందరూ పనిచేయాలని బీజేపీ శ్రేణులకు అమిత్ షా సూచించినట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు పార్టీకి చెందిన కార్యకర్తలందరూ తప్పక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ భారత్‌లో బీజేపీ పాగా వేసేందుకు కర్ణాటకనే కేంద్రంగా మార్చుకోవాలని, ఆ దిశగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అమిత్ షా బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ
ఆంధ్రా కశ్మీర్‌గా లంబసింగి అభివృద్ధి ఎంపీ కంభంపాటి హరిబాబు బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం మర్రిపాలెం: దేశంలో భారతీయ జనతా పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రాష్ర్టంలో పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మర్రిపాలెం దరి శారదా గార్డెన్స్‌లో పార్టీ సభ్యత్వ నమోదును శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ నగరం ఐటీ, ఫార్మా, పరిశ్రమల హబ్‌గా తయారు కాబోతుందని చెప్పారు. అనేక మంది పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తయారు చేయడం కోసం నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు చెప్పారు. లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్రా కశ్మీర్‌గా తయారుచేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు యు.కృష్ణంరాజు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కోసం ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నాయకులు పి.మాధవ్, చొక్కాకుల వెంకట్రావు, ప్రకాశ్‌రెడ్డి, జె.పృథ్వీరాజ్, నాగేంద్ర, కొల్లి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ సాక్షి, విజయవాడ బ్యూరో: త్వరలో జమ్మూ కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కిం చుకున్నామని తెలిపారు. ఆదివారం విజయవాడ శివారు పోరంకిలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూఢీ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగద న్నారు. ఏపీలో ఈ సంవత్సరం పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు. పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని చెప్పారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రు లు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగ ర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు.