సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఆ పార్టీ ఎమ్మెల్యే,
కైకలూరు: సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కృష్ణాజిల్లా కైకలూరులో ఆయన విలేకరులతో మట్లాడుతూ.. ఇప్పటివరకు చైనా మార్క్సిస్టు పార్టీ 8.30 కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. దేశంలో ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వాలు 10 కోట్లు దాటాయని తెలిపారు. నమోదుకు మరో 10 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు కామినేని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.