కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి...
పార్టీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ
శంషాబాద్ : కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్కరాజు ఆధ్వర్యంలో గురువారం బస్టాండ్ చౌరస్తాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారుతున్నాయన్నారు. జనధన్‌యోజన, స్వచ్ఛభారత్‌తో పాటు అనేక రకాల కీలక నిర్ణయాలతో సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేమ్‌రాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పు బాషా, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ప్రశాంత్, కొండ ప్రవీణ్, జగన్, చంద్రయ్య, యాదగిరి, ధన్‌రాజ్, ఆంజనేయులు, సత్యనారాయణ, శ్రీధర్, మల్లేష్, రవి పాల్గొన్నారు.