చంద్రబాబు అవినీతిపై 21న ధర్నా | Chandrababu Naidu Is The Corrupt Dharna Bjp | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవినీతిపై 21న ధర్నా

Published Fri, Apr 20 2018 9:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

Chandrababu Naidu Is The Corrupt Dharna Bjp - Sakshi

35వ వార్డులో ప్రజలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి

ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి తెలిపారు. రోడ్డు నిర్మించకుండా డ్రైనేజి కాలువలను నిర్మించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానిక 35వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆయన గురువారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశారో ధర్నాలో వివరిస్తామన్నారు. ధర్నాకు జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, మాజీ అధ్యక్షులు శశిభూషణ్‌రెడ్డి, కేవీ రమణారెడ్డితోపాటు కేవీ చలమారెడ్డి, బీజేఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి హాజరవుతారన్నారు. కార్యక్రమంలో బీజేఎంఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకళ్యాణి, పట్టణాధ్యక్షురాలు కుమారి, జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేంద్రకుమార్, నరసింహాప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement