![Somu Veerraju Fires on Chandrababu Over Polavaram Corruption - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/26/somu-veerraju.jpg.webp?itok=j472GNwU)
మీడియాతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇన్‌సెట్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా అంచనాలకు అందనిరీతిలో అవినీతి బాగోతం జరుగుతోందన్నారు. మంగళవారం ఉదయం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
లెక్కలు ఎందుకు మారాయి?.. ‘పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకోసారి లెక్కలు మారుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి అమాంతం రూ. 53 వేల కోట్లకు పెరిగింది. ఎందుకు?.. ఏ ప్రాజెక్టు అయినా చంద్రబాబుకు ఉపాధిహామీ పథకమే. ఆయన దోపిడీకి గునపాలు చాలవు. పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు కావాలి. దోపిడీలో చంద్రబాబుకు ఏకంగా ఆస్కార్ ఇవ్వొచ్చు’ అని సోమువీర్రాజు పేర్కొన్నారు. బాబు ఓ అధర్మ చక్రవర్తి అని, అధర్మపోరాటమే చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో చంద్రబాబుకు ఎలాంటి శాస్తి జరగాలో అదే జరిగి తీరుతుందన్నారు.
నన్నయ్య వర్సిటీ కోసం టీడీపీ కేవలం కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టిందన్నారు. విజభన హామీలపై బీజేపీ కట్టుబడి ఉందని, 2019 ఎన్నికల్లో పొత్తుల అంశంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వీర్రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment