దేశంలో అవినీతి నిర్మూలన కోసం నల్లధనం వెలికి తీసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000లను రద్దుచేశారని బీజేపీ జాతీయ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.
పెద్ద కొత్తపల్లి: దేశంలో అవినీతి నిర్మూలన కోసం నల్లధనం వెలికి తీసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000లను రద్దుచేశారని బీజేపీ జాతీయ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తే అక్రమంగా కోట్లు కొల్లగొట్టిన ప్రతిపక్షాలు, అధికార పార్టీ నాయకులు ప్రధానమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశం మొత్తంలో సామాన్య ప్రజలు ప్రధానమంత్రిని మెచ్చుకుంటే కాంగ్రెస్ రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తుందన్నారు.