రాజ్యసభకు స్వామి, సిద్ధూ | Swamy, Sidhu to Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు స్వామి, సిద్ధూ

Published Sat, Apr 23 2016 1:32 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

రాజ్యసభకు స్వామి, సిద్ధూ - Sakshi

రాజ్యసభకు స్వామి, సిద్ధూ

ఆరుగురిని నామినేట్ చేసిన కేంద్రం
సురేశ్‌గోపి, నరేంద్ర జాదవ్,స్వపన్‌దాస్, మేరీకోమ్‌లకూ చోటు

 
 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆరుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో బీజేపీ నేతలు సుబ్రమణ్యంస్వామి, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూలతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో గతంలో ఉన్న జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) సభ్యుడిగా ఉన్న నరేంద్ర జాదవ్‌కూ చోటిచ్చింది.

వీరితోపాటు  మలయాళ నటుడు సురేశ్ గోపి, జర్నలిస్ట్ స్వపన్ దాస్‌గుప్తా, బాక్సర్ మేరీ కోమ్‌లను కొత్తగా రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసింది. మోదీ ప్రభుత్వం సిఫార్సుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధరంగాల నుంచి ఈ ఆరుగురిని ఎగువ సభకు నామినేట్ చేశారని హోం శాఖ తెలిపింది. దీనిపై అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందన్నారు. సాహిత్యం, సైన్స్, క్రీడలు, కళ, సామాజిక సేవ రంగాలకు సంబంధించి వీరిని నామినేట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement