సాక్షి, హైదరాబాద్: 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీ వేసిన మరో ముందడుగని పేర్కొన్నారు. అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో బుధవారం వారు మీడియాతో మట్లాడారు. పంటల సాగు వ్యయానికి 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను స్థిరీకరిస్తామని గత లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ అన్నారు. రైతుల సంక్షేమానికై బీజేపీ కట్టుబడి ఉందనీ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రతిపక్ష నాయకులు ఇప్పుడెందుకు నోరుమెదపరు
స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులపై మాట్లాడే రాజకీయ పార్టీలు రైతుల సంక్షేమానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కిషన్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికై పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాదిరిగా పంటలకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment