సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జ్‌లు... | Incharges For TRS Party Membership Registration | Sakshi
Sakshi News home page

సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జ్‌లు...

Published Mon, Feb 8 2021 2:18 AM | Last Updated on Mon, Feb 8 2021 2:18 AM

Incharges For TRS Party Membership Registration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పార్టీ నాయకత్వం జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను నియమించింది. పార్టీ కార్యదర్శులు జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. రెండు లేదా మూడేసి జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌ వంటి దూరప్రాంత జిల్లాలకు చెందిన బాధ్యులకు ఆదివారం సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. మిగతా జిల్లాలకు ఈ నెల 12 లోగా సభ్యత్వ నమోదు పుస్తకాలు చేరవేస్తామని తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

కాగా జిల్లాల వారీగా అరిగెల నాగేశ్వర్‌రావు (ఆదిలాబాద్‌), లోక భూమారెడ్డి (నిర్మల్‌), ఫారూక్‌ హుస్సేన్‌ (ఆసిఫాబాద్‌), గూడూరు ప్రవీణ్‌ (మంచిర్యాల), ముజీబుద్దీన్‌ (నిజామాబాద్‌), డి.విఠల్‌రావు (కామారెడ్డి), కోలేటి దామోదర్‌ (కరీంనగర్‌), లోక బాపురెడ్డి (పెద్దపల్లి), కర్ర శ్రీహరి (రాజన్న సిరిసిల్ల), భానుప్రసాద్‌ (జగిత్యాల) సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా పనిచేస్తారు. వీరితో పాటు రాధాకృష్ణ శర్మ (మెదక్‌), బక్కి వెంకటయ్య (సంగారెడ్డి), ఫరీదుద్దీన్‌ (సిద్దిపేట), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు, భూపాలపల్లి), లింగంపల్లి కిషన్‌రావు (మహబూబాబాద్‌), మాలోత్‌ కవిత (జనగాం), వై.కృష్ణారెడ్డి (వరంగల్‌ అర్బన్‌), మెట్టు శ్రీనివాస్‌ (వరంగల్‌ రూరల్‌), వెంకటరత్నం బాబు (ఖమ్మం), తాతా మధు (కొత్తగూడెం) ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్‌)

అలాగే బడుగుల లింగయ్య యాదవ్‌ (నల్లగొండ), రామకృష్ణారెడ్డి (సూర్యాపేట), వై.వెంకటేశ్వర్లు (యాదాద్రి), గట్టు రామచందర్‌రావు (రంగారెడ్డి), జహంగీర్‌పాషా (వికారాబాద్‌), రాంబాబు యాదవ్‌ (మేడ్చల్‌), శంభీపూర్‌ రాజు (హైదరాబాద్‌), నాగేందర్‌ గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), అందె బాబయ్య (నారాయణపేట), బి.శ్రీనివాస్‌ యాదవ్‌ (గద్వాల), వాల్యా నాయక్‌ (నాగర్‌కర్నూలు), ఇంతియాజ్‌ (వనపర్తి) కూడా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా పనిచేస్తారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.గంగాధర్‌గౌడ్, సత్య వతి రాథోడ్, ఎం.సుధీర్‌రెడ్డి, బసవరాజు సారయ్య, బండి రమేశ్, బి.వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్‌రావు, జి.బాలమల్లు, నూకల నరేశ్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, పి.రాములు, ఆర్‌.శ్రావణ్‌రెడ్డి, నరేంద్రనాథ్, బండా ప్రకాశ్, భరత్‌ కుమార్‌ గుప్తా రెండు లేదా మూడు జిల్లాలకు సభ్యత్వ నమోదు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement