బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ | BJP is a strong political force | Sakshi
Sakshi News home page

బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ

Published Sun, Dec 7 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ

బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ

ఆంధ్రా కశ్మీర్‌గా లంబసింగి అభివృద్ధి
ఎంపీ కంభంపాటి హరిబాబు
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
 

మర్రిపాలెం: దేశంలో భారతీయ జనతా పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రాష్ర్టంలో పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మర్రిపాలెం దరి శారదా గార్డెన్స్‌లో పార్టీ సభ్యత్వ నమోదును శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ నగరం ఐటీ, ఫార్మా, పరిశ్రమల హబ్‌గా తయారు కాబోతుందని చెప్పారు. అనేక మంది పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువస్తున్నారని తెలిపారు.

రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తయారు చేయడం కోసం నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు చెప్పారు. లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్రా కశ్మీర్‌గా తయారుచేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు యు.కృష్ణంరాజు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కోసం ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నాయకులు పి.మాధవ్, చొక్కాకుల వెంకట్రావు, ప్రకాశ్‌రెడ్డి, జె.పృథ్వీరాజ్, నాగేంద్ర, కొల్లి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement