The Bharatiya Janata Party
-
ఎన్నికలే టార్గెట్
నేడు బీజేపీ కార్యాచరణ సమావేశం బెంగళూరు: 2018లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ దిశగానే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు నేడు(శనివారం) పార్టీ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రులు అనంతకుమార్, డి.వి.సదానందగౌడ, జి.ఎం.సిద్ధేశ్వర్, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా సీతారామన్, పార్టీ నేతలు జగదీష్ శెట్టర్, కె.ఎస్.ఈశ్వరప్ప, ఆర్.అశోక్‌తో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు మొత్తం 450 మంది పాల్గొననున్నారు. బి.ఎస్.యడ్యూరప్ప బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమావేశంలో అనేక ప్రముఖ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్ విజయబావుటా
⇒1,083 జెడ్పీ, 3,884 టీపీ క్షేత్రాల ఫలితాలు వెల్లడి ⇒498 జెడ్పీ క్షేత్రాలు, 1,705 టీపీ క్షేత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ⇒రెండో స్థానంలో కాషాయం ⇒408 జెడ్పీ క్షేత్రాలు,1,362 ⇒టీపీ క్షేత్రాల్లో వికసించిన కమలం ⇒మూడోస్థానంతో సరిపెట్టుకున్న దళం నాయకులు ⇒148 జెడ్పీ క్షేత్రాలు,610 టీపీ క్షేత్రాల్లో జేడీఎస్ అభ్యర్థుల విజయం బెంగళూరు: ‘స్థానిక’ సంగ్రామంలో కాంగ్రెస్‌పార్టీ పై చేయి సాధించింది. ప్రధాన విపక్షాలైన భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలవగా జేడీఎస్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం గెలిచిన స్థానాలను బట్టి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించినా రెండోస్థానంలోని బీజేపీతో పోలిస్తే సదరు మెజారిటీ తక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. జేడీఎస్ గత జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మరింత కిందికి దిగజారిపోయింది. సంఖ్య పరంగా కాంగ్రెస్‌ది పై చేయి అయినా రానున్న శాసనసభ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ జెడ్పీ,టీపీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 1,083 జిల్లా, 3,884 తాలూకా పంచాయతీ క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మూడు జిల్లా, పద్నాల్గు తాలుకా పంచాయతీ క్షేత్రాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన క్షేత్రాలకుగ రెండు దశల్లో (ఈనెల 13, 20తేదీల్లో ) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి నుంచి చివరి వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. జేడీఎస్ మాత్రం హాసన జిల్లాల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపించింది. సంఖ్యాబలంలో కాంగ్రెస్ దే పై చేయి ........ జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ 498 జిల్లా పంచాయతీ క్షేత్రాల్లో గెలుపొందగా విపక్ష భారతీయ జనతా పార్టీ 408 స్థానాల్లో, జేడీఎస్ అభ్యర్థులు 148 క్షేత్రాల్లో విజయం సాధించారు. మిగిలిన వారిలో 27 మంది స్వతంత్య్ర అభ్యర్థులు కాగా ఒకరు సీపీఎం నుంచి మరొకరు జేడీ(యూ) తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1,705 తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో గెలుపొందగా, బీజేపీ 1,362 టీపీ క్షేత్రాల్లో, జేడీఎస్ 610 టీపీ క్షేత్రాల్లో విజయం సాధించాయి. ఇక బీఎస్పీ ఐదు, సీపీఎం ఆరు, జేడీయూ తొమ్మిది టీపీ క్షేత్రాల్లో గెలుపొందాయి. అదేవిధంగా 179 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందగా ఇతరులు ఎనిమిది టీపీ క్షేత్రాల్లో గెలుపొందారు. ఏక గ్రీవంలో బీజేపీదే పై చేయి... జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో మూడు జిల్లా పంచాయతీ క్షేత్రాలతో పాటు పద్నాల్గు తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏక గ్రీవ ఎన్నికల్లో విపక్ష భారతీయ జనతా పార్టీదే పై చేయి. రెండు జిల్లా పంచాయతీ క్షేత్రాలు (ఆళ్లూరు, వడ్డేరహట్టి), ఎనిమిది తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో బీజేపీ అభ్యర్థుల మెడలో ఎటువంటి పోటీ లేకుండానే విజయమాల పడింది.అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్కరు కూడా జిల్లా తాలూకా పంచాయతీ క్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. తాలూకా పంచాయతీ క్షేత్రాల్లో మాత్రం నాలుగింటిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు ఒక జిల్లా (రాయచూరు జిల్లా, సింగనూరు తాలూకా, గుగుంటా క్షేత్రం) పంచాయతీ క్షేత్రం, ఒక తాలూకా (బబళేశ్వర) పంచాయతీ క్షేత్రాల్లో ఎటువంటి పోటీ లేకుండా గెలపొందగా ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఇండి తాలూకా ఉమ్రాణి తాలూకా పంచాయతీ క్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు నిరాసే! 2011లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ 30 జిల్లాల పైకి పన్నెంటిలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6, జేడీఎస్ నాలుగు జిల్లాలో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోగా మిగిలిన పదింటిలో పొత్తులకు అవకాశం ఏర్పడింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కేవలం 11 జిల్లాల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీతో జెడ్పీ స్థానాలను సాధించింది. దీంతో అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము ఆశించినంతగా ఈ తాజా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా పేర్కొంటుండటం గమనార్హం. -
ఒప్పందం ఘనం... అమలే ప్రశ్నార్థకం ?
అమలుకు నోచుకోని గత ప్రభుత్వాల ‘ఒప్పందాల’ ప్రతిబంధకంగా మారిన మైనింగ్ పాలసీ బెంగళూరు: తమ రాష్ట్రం పెట్టుబడుదారులకు స్వర్గంధామం...ఏక గవాక్ష విధానంలో అనుమతులు... ఇవి కర్ణాటక ప్రభుత్వం చెబుతున్న విషయాలు అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. గత భారతీయ జనతా పార్టీ హయాంతో పాటు ప్రస్తుత సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఈ రెండు ప్రభుత్వాలను పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ (2012-13 నుంచి ఇప్పటి వరకూ) కంటే గత బీజేపీ ప్రభుత్వమే (2008-12) నయమని ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుదారులను ఆకర్షించి వారి ద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసి తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గత భారతీయ జనతా పార్టీ తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో 2010, 2012 ఏడాదిల్లో రెండు సార్లు గోబెల్ ఇన్వెస్టర్స్ మీట్ (జీఐఎం-జిమ్)ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు జిమ్‌లలో కలపి మొత్తం 1,140 అవగాహన ఒప్పందాలు జరుగ్గా వీటిలో ఇప్పటి వరకూ కేవలం 130 ఒప్పందాలకు మాత్రమే అమల్లోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలకు సంబంధించిన దస్త్రాలన్నీ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల టేబుల్ సొరగుల్లో దుమ్ముపట్టి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నారు. ఉక్కు తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్సెల్లార్ మిట్టల్, పోస్కో సంస్థలు ఈ రంగంలో కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడం కోసం 2010 ఏడాదిలో జరిగిన జిమ్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అటు పై రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ పాలసీలో మార్పులు తీసుకురావడం, సదరు పాలసీలోని నిబంధనలు పెట్టుబడిదారులకు ప్రతిబంధకాలుగా మారడంతో ఆ రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టలేకపోయాయి. మిగిలిన ఒప్పందాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఇక రహదారులు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుడంటంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలేదు. ఐదేళ్ల ముందు కలబుర్గీ, విజయపుర, శివమొగ్గ, హాసన్, బళ్లారిలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ చర్యలు చేపట్టనేలేదు. ఈ విషయమై ఐటీ, బీటీ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...‘హుబ్లీలోని దాదాపు వెయ్యి ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి చదరపు అడుగును రూ.20 లెక్కన అద్దెకిస్తామని చెప్పాం. బెంగళూరుతో పోలిస్తే ఈ అద్దె దాదాపు ఎనభై నుంచి తొంబై శాతం తక్కువ. అయితే వాయు, రోడ్డు తదితర మార్గాల్లో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో నూతన సంస్థలు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. అందువల్ల సదరు అద్దెను రూ.10కి తగ్గించాం. మౌలిక సదుపాయాలు మెరుగుపరచనంత వరకూ అద్దె తగ్గించడం, పన్నుల్లో రాయితీ వంటి ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినా ఏ మాత్రం ఉపయోగం ఉండదు.’ అని తెలిపారు. సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో మరీ తీసికట్టు... రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారిగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం ‘జిమ్’ పేరును కాస్తా ఇన్వెస్ట్ కర్ణాటకగా మార్పు చేసి 2016 ఏడాదిలో బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ ద్విచక్రవాహన తయారీ కంపెనీ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ- కామర్స్ విభాగంలోని ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కూడా కర్ణాటకను కాదని పొరుగు రాష్ట్రంలో తన గోదామును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య చైర్మన్‌గా ఉన్న హైలెవెల్ క్లియరెన్స్ కమిటీ (హెచ్‌ఎల్‌సీసీ), స్టేట్‌లెవెల్ సింగిల్ విండో కమిటీ (ఎస్ఎల్ఎస్డబ్ల్యూసీ)లు రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో పలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ రెండు కమిటీల నుంచి అనుమతులు పొందే ప్రాజెక్టుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతోంది. 2012-13లో 776 ప్రాజెక్టులకు అనుమతులు లభించగా 2014-15లో ఆ సంఖ్య 108కి తగ్గిపోయింది. పోని అనుమతులు పొందిన సంస్థలైనా రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయా అంటే అదీ లేదు. 2012-13 ఏడాదిలో అనుమతులు పొందిన ప్రాజెక్టుల్లో 36 ప్రాజెక్టుల అమలు వివిధ దశల్లో ఉండగా గత ఏడాది ఈ సంఖ్య ఏడుకు తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంలో పారిశ్రమల స్థానపనకు గల పరిస్థితులు వాటి అమలు తీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది. -
రిసార్ట్ రాజకీయం
76 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు మడికేరికి తరలింపు ఈ నెల 11నబెంగళూరుకు తిరిగిరాక తాయిలాలకు ఆశ పడొద్దని సీఎం హితబోధ బెంగళూరు: మేయర్ ఎన్నిక మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తన కార్పొరేటర్లు చేజారి పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కార్పొరేటర్లను రిసార్టుకు తరలించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 24 సీట్లు తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే 14 సీట్లు వచ్చిన జేడీఎస్‌తో, 7 స్థానాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠంపై కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి ఆపరేషన్ కమల పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10 మందికి కొన్ని కానుకలు కూడా ముట్టజెప్పడానికి సిద్ధపడిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన 76 మంది కార్పొరేటర్లను బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయానికి సోమవారం ఉదయమే పిలిపించుకున్నారు. అందరూ కలసికట్టుగా ఉండాలని బీజేపీ చూపించే కొన్ని కానుకల కోసం రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టకండని హితబోధ చేశారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కార్పొరేటర్లను మూడు ప్రత్యేక బస్సుల్లో మడికేరికి తరలించారు. అక్కడి క్లబ్ మహీంద్ర, తాజ్ రిసార్ట్‌లలో వారు మూడు రోజుల పాటు ఉండి మేయర్ ఎన్నిక జరిగే ఈ నెల 11న బెంగళూరుకు రానున్నారు. ఈ రిసార్టు రాజకీయ ఘట్టానికి ఎమ్మెల్యేలైన ఎస్.టీ సోమశేఖర్, భైరతిభసవరాజ్, మునిరాజ్‌లు నేతృత్వం వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భేషరతుగా మద్దతు రాజకీయ రిసార్ట్ ఘట్టం ప్రారంభం కావడానికి ముందు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. ‘బీబీఎంపీ మేయర్ పదవి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకు భేషరతుగా మద్దతు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీనే మాకు ఉపమేయర్ పదవి ఇవ్వడానికి అంగీకరించింది. ఇక ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే మేయర్ పదవిలో ఉండాలా లేదా అన్న విషయం బీబీఎంపీ పరిధిలోని జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా.’ అని పేర్కొన్నారు. -
సర్కారు వైఫల్యాలపై ఆన్లైన్ యుద్ధం
బెంగళూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్రశాఖ కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలలుగా రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొంటున్న ఐఏఎస్ అధికారులను తరుచూ బదిలీలు చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం 135 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కరువు నివారణ పనులు సాగడం లేదు. దీంతో తాగునీటితో పాటు పశువుల మేతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర హోంశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విపక్ష భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అందులో భాగంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఎస్.ఎం.ఎస్‌ల ద్వారా ప్రభుత్వలోపాలను ప్రజలకు తెలియజెప్పాడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి., గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ప్రస్తుతం ఆ రంగంలో ఏర్పడిన తిరోగమనం... ఇలా ప్రతి విశయాన్ని గణాంకాల రూపంలో బల్క్ ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపించాలని నిర్ణయించింది. ఇక ఫేస్బుక్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న శాంతిభద్రతల సమస్యలు, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉంచాలని కమలనాథులు నిర్ణయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు ముగిసిన తర్వాత ఈ నూతన ఘట్టానికి తెరలేపనున్నట్లు బీజేపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. -
ఆకాంక్షలను గౌరవించాం!
రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడానికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర-దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మాణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది. దశాబ్దాల నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో పార్టీ కాకినాడ సమావేశాలలో తీర్మానం చేసిం ది. అప్పటి నుంచి 2014లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టేవరకు సభలోపలా, బయటా కూడా బీజేపీ నిర్వ హించిన పాత్ర అద్వితీయమైనది. పార్టీ తెచ్చిన ఒత్తిడి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్లనే యూపీఏ భయపడి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రజల ఆకాంక్ష మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధికి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 12 నెలల కాలంలో ఎన్నో విజయాలు సాధించిన మోదీ ప్రభుత్వం తెలంగా ణకు పూర్తి సహకారం అందించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ఇచ్చే నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి 2015-2016 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం రూ.13,728 కోట్ల నిధులు తెలంగాణకు కేటాయిం చింది. పెరిగిన నిధుల ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.94, 923 కోట్లు కూడా తెలంగాణకు మంజూరు కానున్నాయి. కేంద్రం ఈ ఏడాదిలో పంచాయతీరాజ్ శాఖకు మంజూ రు చేసిన రూ.5,375 కోట్ల గ్రాంట్, పట్టణాభివృద్ధి శాఖకు మంజూరు చేసిన రూ.3,389 కోట్ల గ్రాంటును కలుపుకుని మొత్తం రూ.8, 764 కోట్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్, మెదక్ జిల్లాలో హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం, ఇదే జిల్లా కరక పట్లలో 75 ఎకరాల స్థలంలో జాతీయ ఫార్మా విద్యా పరి శోధన కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం గిరి జన విశ్వవిద్యాలయం, సనత్‌నగర్‌లో ఈఎస్ఐ వైద్య కళా శాల ఏర్పాటు, హైదరాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో విద్య, పరిశోధనలకు కేం ద్రం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నది. కొత్త రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు లేకపోవ డానికి కేంద్రం అందిస్తున్న సహకారమే కారణం. నిరం తర విద్యుత్ సరఫరాకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం సంతోషకరం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో రూ.9,954 కోట్లతో 800 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. దీనితో 1,600 మెగా వాట్ల విద్యుత్ లభ్యం కాగలదు. అలాగే, నల్లగొండ జిల్లాలోని దామెరచర్లలో అతి తక్కువ సమయంలో 10,000 ఎకరాలకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేసి, రూ.15,000 కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్రాజెక్టుల ద్వారా 2,400 మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. దీనితో పాటు మహబూబ్‌నగర్‌లో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పా టు చేసి 5,000 మెగావాట్ల విద్యుదుత్పాదనకు కూడా చర్యలు తీసుకుంటున్నది. హరియాణాలోని జజ్జర్ విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 330 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను కూడా తెలంగాణకు మళ్లించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడా నికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర -దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మా ణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రం లో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొ రేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్- పెద్దపల్లి రైల్వేలైన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.183 కోట్లు కేంద్రం కేటాయిం చింది. కాజీపేట నుంచి ముంబైకి కొత్త రైలు మంజూరు కావడం ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఊరటని చ్చింది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3,700 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.1,681 కోట్లతో కేం ద్రం పనులు ప్రారంభించింది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కూడా మొదలై నాయి. 202 జాతీయ రహదారి మీద, అంబర్‌పేట (హైదరాబాద్)లోని 6వ నంబర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించడంతో పాటు సముద్రతీరం లేని తెలంగాణకు డ్రైపోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రామగుండంలో రూ.5,200 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. రెండువేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు, రాష్ట్రానికి సరిపడే యూరి యా, అమోనియం నైట్రేట్ ఎరువులు ఇక్కడ ఉత్పత్తి కానున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మూతపడిన ఐడీపీఎల్ సంస్థను రూ.960 కోట్లతో పున రుద్ధరించి జూన్, 2015 నుంచి 25 రకాల మందులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం స్వాగతించద గినది. ఇంకా రూ.75 కోట్లు కేటాయించి స్వచ్ఛ భారత్ ద్వారా హైదరాబాద్‌ను స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్ద డానికి కూడా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలుగువాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయిం చడం దేశం గర్వించదగినది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో రెండు మెగా ఫుడ్ పార్కులను రూ.110 కోట్ల సబ్సిడీతో ఏర్పా టు చేయడం రాష్ర్టంలోని రైతులకు భరోసాను ఇచ్చే విధంగా ఉంది. రూ.250 కోట్లతో నల్లగొండ జిల్లాలో పది ఎకరాలలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. వరంగల్‌కు హెరిటేజ్ నగ రంగా గుర్తింపును ఇచ్చి మొత్తం రూ.210 కోట్లతో ఆ చారిత్రక ప్రదేశం రూపురేఖలను మార్చేందుకు కేంద్రం నడుం కట్టింది. నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు టెక్స్టైల్ పార్కులను ఏర్పాటుకు చర్యలు చేపట్ట డం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం టెక్స్టైల్ ఇంటి గ్రేటెడ్ పథకాన్ని ప్రారంభించడం, 24,148 మంది చేనే త కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడం వంటి చర్యల ద్వారా చేనేతకు తమ అండ ఉంటుందని మోదీ ప్రభు త్వం భరోసా ఇస్తున్నది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉ క్కు పరిశ్రమ ఏర్పాటుకు సూచనప్రాయంగా అంగీకరిం చడం వరంగల్, ఖమ్మం జిల్లాల యువతకు తీపి కబురే. జి.కిషన్‌రెడ్డి (వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు) మొబైల్: 9949099997 -
విపక్షాలపై సీబీఐ అస్త్రం
సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం బెంగళూరు : ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌ల పై కూడా సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం (సీఎల్పీ)లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో సంచలనం సృష్టించిన కేసులు, కుంభకోణాలను సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలనే సిద్ధరా మయ్య సూచనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అందరు ప్రజాప్రతినిధులు ఓటేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చట్టసభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించేందుకు వీలుగా బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాజకీయ ప్రయోజనాలు ఆశించే అటు బీజేపీతో పాటు ఇటు జేడీఎస్‌లు డీ.కే.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని నానా రాద్ధాంతం చేశాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ సమావేశాల్లో పదేపదే ప్రస్తావిస్తూ ఉభయ సభల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వీరికి తగిన జవాబు చెప్పడానికి వీలుగా ఆయా పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో లేదా ఆ.యా పార్టీల నాయకులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రఘుపతి భట్ (బీజేపీ) భార్య పద్మప్రియ అసహజ మరణం, ప్రస్తుత జేడీఎస్ శాఖ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ పని కోసం రూ.150 కోట్లను లంచంగా తీసుకున్న విషయంతోపాటు 2011లో రాష్ట్రంలోని వివిధ చర్చిల పై జరిగిన దాడులు తదితర ఆరేడు కేసులను సీబీఐకి అప్పగించాలని సిద్ధరామయ్య పేర్కొన్నప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ తమ సమ్మతిని తెలియజేశారు. ఇందుకు సీఎం సిద్ధరామయ్య...కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ కేసుల సంబంధించి న్యాయనిపుణులతో చర్చించి ప్రభుత్వ పరంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రుల తీరుపై గరం... డీ.కే రవి మరణానికి సంబంధించి విపక్షాల ఆరోపణలకు చట్టసభల్లోకాని, బయట కాని మంత్రులు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని సీఎల్పీ సమవేశంలో పాల్గొన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేశారు. పూటకో వివరణ ఇవ్వడంతో పాటు ఒక మంత్రి ఇచ్చిన సమధానానికి మరో మంత్రి ఇచ్చిన సమాధానానికి సారుప్యత లేక పోవడం వల్ల విపక్షాల దృష్టిలోనే కాక ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చులకనయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఐడీ దర్యాప్తు పూర్తికాకుండానే చట్టసభల్లో డీ.కే రవిది ఆత్మహత్యగా పేర్కొన్న హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ వల్లే ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎల్పీ సమావేశం అనంతరం రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి హెచ్.ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ... ‘డీ.కే రవి కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు కాని మంత్రులను విమర్శించలేదు. చట్టసభలకు కచ్చితంగా హాజరు కావాలని సిద్ధరామయ్య సూచించారు. గత బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో జరిగిన కొన్ని కేసులకు సంబంధించి న్యాయవిచారణ జరిపించే విషయం కూడా సీఎల్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.’ అని పేర్కొన్నారు. -
టీడీపీ vs బీజేపీ
కోల్డ్ వార్! ఇరు పార్టీల నేతల నడుమ పేలుతున్న మాటల తూటాలు కేంద్ర బడ్జెట్ తర్వాత ముదిరిన వివాదం రాజధానిపైనా తలో మాట విజయవాడ : మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ముసలం మొదలైందా.. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమంటాయా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. అప్పుడే ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టీడీపీ నేతలు పెదవి విరుస్తుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ సాగిస్తున్న పాలనపై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకరి తీరును మరొకరు ఎండగట్టేందుకు ఏమాత్రం జంకడం లేదు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఒకడుగు ముందే ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచే.. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు రెండు పార్టీల నేతలకు సుతరామూ ఇష్టం లేదు. ఆయా పార్టీల అగ్ర నేతలు కుదుర్చుకున్న ఒప్పందం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా నాయకులు అంగీకరించక తప్పలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలవడం, రాష్ట్ర మంత్రివర్గంలో కైకలూరుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కడం జరిగిపోయాయి. అయినా రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. మంత్రుల మధ్యే కాదు.. కింది స్థాయి కేడర్ వరకు విభేదాలు కనపిస్తున్నాయి. మరింత ముదిరాయి.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రత్యేక హోదా దక్కకపోవడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించింది. అరుణ్ జైట్లీ బడ్జెట్ బాగానే ఉందంటూనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు ఆక్రోశించారు. దీంతో బీజేపీ నేతలు సీరియస్ అవుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు సరైన ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్లలేదని, ఇప్పటివరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదని, అందువల్ల నిధులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందితే తెలుగుదేశం నేతలు స్వీట్లు పంచుకున్నారని, ఇదేమి స్నేహధర్మమంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిశోర్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో తమ పార్టీ ఎదగకుండా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రజల్లోకి తీసుకువెళ్లతామని అంటున్నారు. రాజధానిపై బీజేపీ గరంగరం.. ఇప్పటికే రుణమాఫీని సరిగా చేయలేక అప్రతిష్టను మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని నిర్మాణ విషయంలో వ్యవహరిస్తున్న తీరును బీజేపీ నేతలు త ప్పు పడుతున్నారు. రైతులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమకు రాజధాని కమిటీలో ఏమాత్రం చోటివ్వని చంద్రబాబు విపక్షాలను సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కమలనాథులు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు టీడీపీకి దూరమవుతున్నారని, ఈ ప్రభావం తమ పార్టీపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. రాజధాని వల్ల వస్తున్న వ్యతిరేకతనంతా టీడీపీకి అంటగట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఇలాగే కొనసాగిస్తే మరింత దాడికి దిగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
బెంగళూరు : కర్ణాటకలో తుగ్లక్ పాలన నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత సీఎం’ విషయమై కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని పేర్కొన్నారు. హుబ్లీలో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో యడ్యూరప్ప మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో ఒక వర్గం వారు దళిత నాయకుడు సీఎం కావాలని పట్టుబడుతున్నారు. మరో వర్గం వారు సిద్ధరామయ్యే సీఎం స్థానానికి అర్హుడు అంటున్నారు. ఇదిలా ఉండగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి సిద్ధరామయ్య తాను దళితుడినే అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇలా సీఎం కుర్చీ చుట్టే అందరి కళ్లూ ఉండటంతో పాలన ఎలా సాగుతుంది.’ అని యడ్యూరప్ప ప్రశ్నించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిథులే పూర్తిగా ఖర్చు కాలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం నూతన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శివమొగ్గ పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అభివృద్ధి విషయంలో కర్ణాటక తిరోగమన దిశలో ప్రయాణిస్తుందని అన్నారు. -
బీజేపీపై లెఫ్ట్ మాటల దాడి
రిఫరెండం కాదనడం బీజేపీ అసమర్ధతకు నిదర్శనం న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై కమ్యూనిస్తు పార్టీలు పదునైన మాటలతో విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ చరిత్రను తిరగరాసిందని, ఇది మోదీ పాలనపై రిఫరెండం కాదనడం వారి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించాయి. ఈ తొమ్మిది నెలల కాలంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో తరించిందనే సత్యాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్మొహమాటంగా తెలియజేశారని సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు విమర్శించాయి. కేవలం మూడు స్థానాల్లో గెలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవాన్ని మించిన ఓటమిని బీజేపీ మూటగట్టుకుందన్నాయి. అప్పటి ఫలితంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదని, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలతో బీజేపీ కూడా ప్రతిపక్షహోదా కోల్పోయిందని చెప్పాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ‘పీపుల్స్ డెమోక్రసీ’ అనే ఎడిటోరియల్ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎదురైన ఫలితంతో బీజేపీ నాయకులు మోదీని కాపాడేందుకు ఇది కేంద్ర పాలనపై రిఫరెండం కాదని చెబుతున్నారన్నారు. ఎవరు ఏం చెప్పినా ఈ ఎన్నికలు ఆర్ఎస్ఎస్, బీజేపీపై ప్రభావం చూపడం మాత్రం వాస్తవమన్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా నరేంద్రమోదీకి ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ ఎన్నికల విజయం చేకూర్చడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజలు పెద్ద బాధ్యత మోపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆశలను ఏవిధంగా ఆప్ ప్రభుత్వ నెరవేరుస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు సీపీఐ... ‘న్యూ ఏజ్’ పత్రిక ఎడిటోరియల్‌లో బీజేపీపై విమర్శలు కురిపించింది. గత తొమ్మిది నెలల కాలంలో కార్పొరేట్, విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా బీజేపీ వ్యవహరించిందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా ఇక్కడి ఓటర్లు తెలియజెప్పారంది. నల్లధనం, అవినీతి, ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చేసిన హామీలను బీజేపీ విస్మరించిందని పేర్కొంది. -
సీఎంపై కమలం సమరం !
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అర్కావతి డీ నోటిఫికేషన్ ప్రధాన అస్త్రంగా సమరానికి సిద్ధమవుతోంది. శాసనసభ విపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు ప్రహ్లాద్ జ్యోషి, ఎమ్మెల్యే సురేష్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమణ్ణ, తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అర్కావతి డీ నోటిఫికేషన్ చేశారని, ఈ విషయంపై కేసు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా బీజేపీ శాసనసభ్యులు గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్ పటేల్‌ను కోరనున్నారు. అంతకుముందు డీ నోటిషికేషన్‌కు సంబంధించిన దాఖలాలు అన్నీ ఆయనకు ఇవ్వనున్నారు. డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు రూ.900 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల ద్వారా విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టును కూడా ఆశ్రయించాలని కమలనాథు లు భావిస్తున్నారు. ఈ విషయమై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలు డీ నోటిఫికేషన్ తర్వాత అక్కడ సామాజికంగా, ఆర్థికంగా జరిగిన అభివృద్ధి, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలకు సంబంధించిన విషయాలను ప్రముఖ సర్చ్ ఇంజన్ ద్వారా దా ఖలాలు రాబట్టారు. ఈ నిర్మాణాలు ఎవరెవరి పేరుపై ఉన్నాయన్న విషయం కూడా కూపీలాగారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొం దారు. పండుగ తర్వాత ఎప్పుడైనా గవర్నర్ అనుమతి పొంది అర్కావతి ఢీ నోటిఫికేషన్ ఆధారంగా సిద్ధరామయ్యపై న్యాయపోరాటం చేయడానికి కమల నాథులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. -
అశ్రునయనాలతో డీవీ అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో నిర్వహణ దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు విశాఖ లీగల్ : విశాఖ మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు అంత్య క్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కాన్వెంట్ జంక్షన్ దరి హిందూ శ్మశాన వాటికలో డి.వి.తనయుడు అశేష జనవాహిని మధ్య చితికి నిప్పంటించారు. కిర్లంపూడి లే అవుట్‌లోని స్వగృహంలో ఉంచిన డి.వి.సుబ్బారావు పార్ధివదేహాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి అభిమానులు, సహచరులు, న్యాయవాదులు, అధికారులు, నగర ప్రముఖులు విచ్చేశారు. భారతీయ జనతా పార్టీకి సుధీర్ఘ సేవలు అందించినందుకు గానూ డీవీ సుబ్బారావు పార్థివ దేహంపై పార్టీ జెండాను ఎంపీ హరిబాబు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. డీవీ సుబ్బారావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగోపాల్‌నాయక్ డీవీ ఇంటి వద్ద గౌరవ వందనం చేశారు. పోలీస్ బ్యాండ్‌తో ఊరేగింపు చేశారు. వేదిక ప్రక్రియ పూర్తయిన తర్వాత డీవీ తనయుడు సోమయాజులు చితికి నిప్పంటించారు. పోలీసులు గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదనరావు, పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా సింహాచలం, ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల సమన్వయకర్తలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కేంద్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రామచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు సీహెచ్ మాధవీలత, ఎస్.కృష్ణమోహన్, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, విశాఖ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు జనపరెడ్డి ఫృధ్వీరాజ్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. -
తెగలాగితే అసలుకు మోసం
ఆగ్రా మత మార్పిడుల సమస్యను ప్రతిపక్షం పట్టుకు వేలాడుతుంటే... ప్రభుత్వం మతమార్పిడులను నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మత స్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. కేంద్రంలోని నేటి ప్రభుత్వానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. అయినా గానీ అది కూడా గత ప్రభుత్వంలాగే క్రమం తప్పకుండా సమస్యల్లో ఇరు క్కుంటోంది, ఫలవంతంగా పనిచే యలేకపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ మిత్రుల ప్రకటనలు, చర్యలు ఇందుకు కొంత వరకు కారణం. గత వారం నేను ఒక మంత్రి గురించి రాశాను. ఈ వారం రెండు అంశాలపై సమస్యలు తలెత్తాయి. అందులో ఒకటి, ఒక బీజేపీ ఎంపీ గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ చేసిన అనవసర ప్రకటన అని చెప్పనవసరం లేదు. సదరు ఎంపీ నాయకుడు కావాలని నిర్ణయించుకున్న సాధువు. ఇది చెప్పనవసరం లేని, ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనని అన్నాను. ఎందుకంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయమనీ, దానిపై రచ్చచేయడం పార్లమెంటును స్తంభింపజేస్తుందనీ తెలిసి కూడా అదే చేయడం ఎందుకు? చివరికి జరిగిందీ అదే. మోదీ దృఢమైన వైఖరితో, ఆ మంత్రి తన మాటలు తప్పని ఒప్పుకునేట్టు చేశారు. అయితే , ఇదే వారంలో తలెత్తిన మరో సమస్యపై మోదీ ప్రభుత్వానికి అలా ఎదుటి పక్షం లొంగుబాటును చూపడం జరగకపోవచ్చు. అది మత మార్పి డికి సంబంధించిన సమస్య. భారతీయ జనతాపార్టీకి ఇది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్న సమస్య. సాధారణంగా అది హిందువులను ఇస్లాం లోకి లేదా క్రైస్తవంలోకి మత మార్పిడి చెందించడానికి సంబంధించినది. నేడు అలాంటి మత మార్పిడులు చాలా తక్కువ. సాధారణంగా ఇప్పుడు జరిగే మార్పిడులకు కారణం మత విశ్వాసం గాక వివాహమే అవుతోంది. ఈ వారం పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజధానియైన ఆగ్రాలో జరిగిన మత మార్పిడులు అంటున్న ఘటనలో ముస్లింలను హిందువులుగా మార్చారు. బీబీసీ కథనం ప్రకారం ‘‘దాదాపు 250 మంది ‘హవన్’ (ప్రాథమిక క్రతువు)కు హాజరయ్యారు. ఆ మురికివాడ వాసులలో అత్యధికులు చెత్త ఏరుకునేవారు. కార్యక్రమానికి హాజరైతే రేషన్ కార్డులు ఇస్తామని, ప్రాథమిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక హిందూ కార్యకర్త తమకు వాగ్దానం చేసి నట్టు వారిలో చాలా మంది చెప్పారు. ఆ మురికివాడలో ఉండే సలీనా అనే ఆమె, తనకసలు అది మతమార్పిడి కార్యక్రమమనే తెలియదని చెప్పింది. కార్య క్రమం మధ్యలో హఠాత్తుగా మా చేత పూజారి చేసినట్టు ప్రతిదీ చేయించారు. ఒక ముస్లిం తన చేతుల్తో ఒక విగ్రహాన్ని పట్టుకునేట్టు కూడా చేశారు. కార్యక్రమం ముగిశాక, ఇక మేమంతా హిందువులమై పోయామని సదరు స్థానిక కార్యకర్త చెప్పాడు. మేం అసమ్మతి తెలపాలని అనుకున్నాం. కానీ రేషన్ కార్డు, ఇతర సదుపా యాలు కావాలంటే నోరెత్తకుండా ఉండాలని మాకు సూచించారు. ఆ మురికివాడలోనే ఉండే ముంతాజ్ మాత్రం తనను ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఎవరూ నిర్బంధించలేదని, హాజరైనవారంతా స్వచ్ఛందంగానే హాజరయ్యారని చెప్పింది.’’ నావరకు నాకు ఇదేమీ పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఉర్దూ మీడియా మాత్రం ఈ ఘటనకు నివ్వెరపోయింది, ఆగ్రహించింది. దేశంలోని ‘ఇంక్విలాబ్’ అనే అతి పురాతన మైన, అత్యంత గౌరవప్రదమైన ఉర్దూ పత్రిక ‘‘అసత్యాలు, వంచన, దురభిమానం’’ అనే శీర్షికతో సంపాదకీయం ప్రచురించింది. ప్రతిపక్షం వెనువెంటనే పార్లమెంటులో దాడికి దిగింది. తమకు కూడా ఈ మతమార్పిడులు సమస్యాత్మకంగా ఉన్నా యని, వాటిని నిలుపుదల చేయాలని భావిస్తున్నామని బీజేపీ ప్రతిస్పందించింది. కానీ, చర్చ జరగాల్సిన అంశం దానిపైన కానే కాదు. అయితే ప్రతిపక్షం ఆ విషయాన్ని అదే పనిగా పట్టుకు వేలాడుతుంటే... మతమార్పిడులన్నీ చెడ్డవేనని, ప్రభు త్వం వాటిని నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మతస్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. విశ్వహిం దూ పరిషత్‌కు చెందిన నా మిత్రుడు అశోక్ చౌగులే ఈ సమ స్యపై గాంధీ చేసిన పలు ప్రకటనల జాబితాను నాకు పంపారు. వాటిలో ఇది ఒకటి. ‘‘ఒక మనిషిని మరొకరిగా మార్పిడి చేయడంలో నాకు విశ్వాసం లేదు. మరొకరి మతవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఎన్నటికీ కృషి చేయను. పైగా వారు తమ సొంత విశ్వాసానికి మరింత మంచి అనుయాయిగా మారాలని కోరుతాను. దీని అర్థం అన్ని మతాల సత్యంలోనూ విశ్వాసం, గౌరవం కలిగి ఉండటమని అర్థం. దివ్య కాంతి అన్ని మతాలకు లోపసహి తమైన మాంసపు ముద్ద మాధ్యమం ద్వారానే చేరుతుంది. కాబట్టి అవి ఆ మాధ్యమం యొక్క అపరిపూర్ణతలను కొంత ఎక్కువగా లేదా తక్కువగా కలిగి ఉండవచ్చు. ’’ గాంధీజీ మతమార్పిడి గురించి, అంటే మతమార్పిడులు చేయించుకోవాలని చురుగ్గా ప్రజలను కోరడం గురించి కూడా మాట్లాడారు. ‘‘ఒక పాడు ఉద్దేశం మొత్తం బోధననే ఉల్లంఘి స్తుంది. పాడు చేసేస్తుంది. అది మొత్తం ఆహారాన్నంతటినీ పాడు చేసే ఒక్క విషపు బొట్టులాంటిది. దానివలన నేను ఎలాంటి బోధన లేకుండానే ఉండి పోవాల్సి ఉంటుంది. గులాబీకి బోధన అవసరం లేదు. అది అతి మామూలుగానే అందరికీ సువాసనలను పంచుతుంది. అదే దాని ప్రబోధం... మత, ఆధ్యాత్మిక జీవితపు పరిమళాలు గులాబీ పరిమళం కంటే మరింత మృదువైనవి, దానికంటే సున్నితమైనవి.’’ భార త రాజ్యాంగం ఎప్పుడో ఈ చర్చను పరిష్కరించింది. చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. అధికరణం 25 భారతీయులందరికీ ‘‘విశ్వాస స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ, మత అను సరణ, ప్రచార స్వేచ్ఛ’’లను కల్పిస్తోంది. మతం విషయంలో భారత్‌లో అలాంటి ఉదారవాద చట్టం ఉండటం ఉపఖండంలో అసాధారణమైనది. ప్రతిపక్షం ఈ సమస్యపై ప్రభుత్వంపై దాడి చేసేటప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒక ఘటన ఆ చట్టం పునఃపరిశీలనకు కార ణంగా మారడాన్ని అనుమతించరాదు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - aakar.patel@gmail.com ఆకార్ పటేల్ -
బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ
ఆంధ్రా కశ్మీర్‌గా లంబసింగి అభివృద్ధి ఎంపీ కంభంపాటి హరిబాబు బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం మర్రిపాలెం: దేశంలో భారతీయ జనతా పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రాష్ర్టంలో పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మర్రిపాలెం దరి శారదా గార్డెన్స్‌లో పార్టీ సభ్యత్వ నమోదును శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ నగరం ఐటీ, ఫార్మా, పరిశ్రమల హబ్‌గా తయారు కాబోతుందని చెప్పారు. అనేక మంది పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తయారు చేయడం కోసం నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు చెప్పారు. లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్రా కశ్మీర్‌గా తయారుచేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు యు.కృష్ణంరాజు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కోసం ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నాయకులు పి.మాధవ్, చొక్కాకుల వెంకట్రావు, ప్రకాశ్‌రెడ్డి, జె.పృథ్వీరాజ్, నాగేంద్ర, కొల్లి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టులతో చర్చలకు సిద్ధం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: మావోయిస్టులను తిరిగి జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా చర్చలతో పాటు చట్టపరిధిలో అన్ని చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై విపక్ష భారతీయ జనతా పార్టీ అనవరసర రాద్ధాంతం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన విగ్రహం వద్ద శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మావోయిస్టులను జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా వారితో చర్చలు జరపడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో పాత్రికేయులు గౌరిలంకేష్కూడా ఒకరు. బీజేపీ నాయకులకు సమాజంలోని అందరూ చెడ్డవారుగా కనిపిస్తారు. అందువల్లే గౌరిలంకేష్‌ను బృందం నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే వారి ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గం. మావోయిస్టులను జనజీవన శ్రవంతిలో కలిపే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయము.’ అని స్పష్టం చేశారు. గౌరి లంకేష్‌ను తప్పించండి..... నక్సల్స్‌తో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలోని గౌరి లంకేష్‌ను వెంటనే ఆ స్థానం నుంచి తప్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్వాలను శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలవడానికి వీలుగా రూపొందించిన ‘ప్యాకేజీ’ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు అందుతోందని వారు వినతి పత్రంలో ఆరోపించారు. ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు వజుభాయ్ రుడాభాయ్వాలతో పేర్కొన్నారు. కాగా, గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప, సీ.టీ రవి తదితరులున్నారు. -
తమ్ముళ్ల యూ టర్న్!
మలుపు తిరుగుతున్న రాజకీయం బీజేపీతో పొత్తుపై టీడీపీ నేతల అసంతృప్తి జేసీ మార్క్ రాజకీయంపై ఆగ్రహం వైఎస్ఆర్సీపీ వైపు అన్ని వర్గాల చూపు త్వరలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు! తుది విడత ప్రాదేశిక పోరుపై తీవ్ర ప్రభావం మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల హవా! సాక్షి, అనంతపురం : ‘అనంత’ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు.. టికెట్ల కేటాయింపులో అసంతృప్తి.. జేసీ మార్క్ రాజకీయంతో తెలుగుదేశం పార్టీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ప్రజాదరణ ఉండడంతో టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రభావం శుక్రవారం జరిగే తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఎక్కడా ఓటు బ్యాంక్ లేదని, ఆ పార్టీకి చెందిన ఓట్లు, మోడీ ప్రభంజనంతో పడే ఓట్లు తనకొద్దంటూ కొన్ని రోజులుగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా అనంతపురం అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించాలనుకున్నా చివరి నిమిషంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం బదులు గుంతకల్లు స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించే విషయమై ఇరు పార్టీల్లో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జేసీ వర్గంగా ముద్రపడిన గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు ఏదో ఒక విధంగా న్యాయం చేకూర్చేలా జేసీ మార్క్ రాజకీయం నడుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మధుసూదన్‌గుప్తాను బీజేపీలోకి పంపి గుంతకల్లు స్థానాన్ని ఆయనకే కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే గుంతకల్లు అసెంబ్లీ టికెట్‌ను దివంగత మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. ఆ కుటుంబంలోని వారికే టికెట్ వస్తుందన్న ప్రచారం కూడా సాగింది. చివరకు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని తెలియడంతో సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చాలా కాలంగా కృషి చేస్తున్న దీపక్‌రెడ్డిని కాదని.. ఆ స్థానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులుకు కేటాయించడంతో టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలవకు సహకరించలేమని దీపక్‌రెడ్డి వర్గీయులు తెగేసి చెబుతున్నారు. ఇలా కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ నేతలు యూటర్న్ తీసుకోవాలని భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరితే సముచిత స్థానం దక్కుతుందన్న భావనతో చాలా మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న వారితో రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరంతా సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ్ముళ్ల యూ టర్న్ ప్రభావం శుక్రవారం జరిగే ప్రాదేశిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 32 జెడ్పీటీసీ, 400 ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో అధిక శాతం స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అలా కుదిర్చారు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ బలవంతపు పొత్తు కుదిరినా ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా వున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో మూడేసి సీట్ల చొప్పున కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలపై ఇరు పార్టీలు దాదాపు అంగీకారానికి వచ్చాయి. అయితే జడ్చర్లలో తమ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నందున మరో సీటు ఇస్తామంటూ టీడీపీ మెలిక పెడుతోంది. గద్వాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు తెలుగుదేశం సుముఖత చూపుతోంది. బీజేపీ మాత్రం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో మహబూబ్‌నగర్, నారాయణపేట, షాద్‌నగర్, మక్తల్ స్థానాల కోసం పట్టుపడుతోంది. నారాయణపేట స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తెగేసి చెప్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి ఇప్పటికే నారాయణపేట నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డిని పక్కన పెట్టి మరీ రాజేందర్‌రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎల్లారెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. కాగా ఇటీవల మహబూబ్‌నగర్‌లో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన నిర్వహణ వ్యయాన్ని రాజేందర్‌రెడ్డి భరించినట్లు సమాచారం. దీంతో నారాయణపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ స్థానాల్లో కనీసం రెండు కేటాయిస్తే తప్ప రెండు పార్టీల పొత్తుల కసరత్తు ఫలప్రదమయ్యే సూచన కనిపించడం లేదు.