ఆకాంక్షలను గౌరవించాం!
రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడానికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర-దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మాణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది.
దశాబ్దాల నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో పార్టీ కాకినాడ సమావేశాలలో తీర్మానం చేసిం ది. అప్పటి నుంచి 2014లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టేవరకు సభలోపలా, బయటా కూడా బీజేపీ నిర్వ హించిన పాత్ర అద్వితీయమైనది. పార్టీ తెచ్చిన ఒత్తిడి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్లనే యూపీఏ భయపడి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రజల ఆకాంక్ష మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధికి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 12 నెలల కాలంలో ఎన్నో విజయాలు సాధించిన మోదీ ప్రభుత్వం తెలంగా ణకు పూర్తి సహకారం అందించింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ఇచ్చే నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి 2015-2016 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం రూ.13,728 కోట్ల నిధులు తెలంగాణకు కేటాయిం చింది. పెరిగిన నిధుల ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.94, 923 కోట్లు కూడా తెలంగాణకు మంజూరు కానున్నాయి. కేంద్రం ఈ ఏడాదిలో పంచాయతీరాజ్ శాఖకు మంజూ రు చేసిన రూ.5,375 కోట్ల గ్రాంట్, పట్టణాభివృద్ధి శాఖకు మంజూరు చేసిన రూ.3,389 కోట్ల గ్రాంటును కలుపుకుని మొత్తం రూ.8, 764 కోట్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్, మెదక్ జిల్లాలో హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం, ఇదే జిల్లా కరక పట్లలో 75 ఎకరాల స్థలంలో జాతీయ ఫార్మా విద్యా పరి శోధన కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం గిరి జన విశ్వవిద్యాలయం, సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐ వైద్య కళా శాల ఏర్పాటు, హైదరాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో విద్య, పరిశోధనలకు కేం ద్రం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నది.
కొత్త రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు లేకపోవ డానికి కేంద్రం అందిస్తున్న సహకారమే కారణం. నిరం తర విద్యుత్ సరఫరాకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం సంతోషకరం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో రూ.9,954 కోట్లతో 800 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. దీనితో 1,600 మెగా వాట్ల విద్యుత్ లభ్యం కాగలదు. అలాగే, నల్లగొండ జిల్లాలోని దామెరచర్లలో అతి తక్కువ సమయంలో 10,000 ఎకరాలకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేసి, రూ.15,000 కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్రాజెక్టుల ద్వారా 2,400 మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. దీనితో పాటు మహబూబ్‌నగర్‌లో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పా టు చేసి 5,000 మెగావాట్ల విద్యుదుత్పాదనకు కూడా చర్యలు తీసుకుంటున్నది. హరియాణాలోని జజ్జర్ విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 330 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను కూడా తెలంగాణకు మళ్లించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడా నికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర -దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మా ణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రం లో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొ రేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్- పెద్దపల్లి రైల్వేలైన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.183 కోట్లు కేంద్రం కేటాయిం చింది. కాజీపేట నుంచి ముంబైకి కొత్త రైలు మంజూరు కావడం ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఊరటని చ్చింది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3,700 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.1,681 కోట్లతో కేం ద్రం పనులు ప్రారంభించింది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కూడా మొదలై నాయి. 202 జాతీయ రహదారి మీద, అంబర్‌పేట (హైదరాబాద్)లోని 6వ నంబర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించడంతో పాటు సముద్రతీరం లేని తెలంగాణకు డ్రైపోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రామగుండంలో రూ.5,200 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. రెండువేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు, రాష్ట్రానికి సరిపడే యూరి యా, అమోనియం నైట్రేట్ ఎరువులు ఇక్కడ ఉత్పత్తి కానున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మూతపడిన ఐడీపీఎల్ సంస్థను రూ.960 కోట్లతో పున రుద్ధరించి జూన్, 2015 నుంచి 25 రకాల మందులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం స్వాగతించద గినది. ఇంకా రూ.75 కోట్లు కేటాయించి స్వచ్ఛ భారత్ ద్వారా హైదరాబాద్‌ను స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్ద డానికి కూడా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
తెలుగువాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయిం చడం దేశం గర్వించదగినది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో రెండు మెగా ఫుడ్ పార్కులను రూ.110 కోట్ల సబ్సిడీతో ఏర్పా టు చేయడం రాష్ర్టంలోని రైతులకు భరోసాను ఇచ్చే విధంగా ఉంది. రూ.250 కోట్లతో నల్లగొండ జిల్లాలో పది ఎకరాలలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. వరంగల్‌కు హెరిటేజ్ నగ రంగా గుర్తింపును ఇచ్చి మొత్తం రూ.210 కోట్లతో ఆ చారిత్రక ప్రదేశం రూపురేఖలను మార్చేందుకు కేంద్రం నడుం కట్టింది. నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటుకు చర్యలు చేపట్ట డం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం టెక్స్‌టైల్ ఇంటి గ్రేటెడ్ పథకాన్ని ప్రారంభించడం, 24,148 మంది చేనే త కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడం వంటి చర్యల ద్వారా చేనేతకు తమ అండ ఉంటుందని మోదీ ప్రభు త్వం భరోసా ఇస్తున్నది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉ క్కు పరిశ్రమ ఏర్పాటుకు సూచనప్రాయంగా అంగీకరిం చడం వరంగల్, ఖమ్మం జిల్లాల యువతకు తీపి కబురే.
జి.కిషన్‌రెడ్డి
(వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు)
మొబైల్: 9949099997