టార్గెట్ 50 లక్షలు..ఇప్పటి వరకు అయ్యింది 20 లక్షల సభ్యత్వాలే
సభ్యత్వ నమోదుపై సమీక్షించినకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీతో రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదు ముగించాల్సి ఉంది. సభ్యత్వ నమోదు టార్గెట్ 50 లక్షలు కాగా, శుక్రవారం నాటికి రాష్ట్రంలో 20 లక్షల మంది (5 లక్షల దాకా మిస్డ్‌కాల్‌తో నమోదు, అసంపూర్తి వివరాలు) పార్టీ సభ్యులుగా చేరినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సభ్యుల్లో 15 లక్షల మంది పూర్తి వివరాలు నమోదు చేయగా, మిగతా వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉన్నట్టుగా తేలింది. దీంతో దసరా పండుగ తర్వాతి మూడురోజులు ‘స్పెషల్ డ్రైవ్’పేరుతో సభ్యత్వ నమోదు ఉధృతంగా చేపట్టాలని బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయించారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 36 వేల పోలింగ్ బూత్‌లలో ఒక్కోదాంట్లో కనీసం వంద మంది సభ్యులను చేరి్పంచడం ద్వారా మరో పది లక్షలకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత వంద మంది సభ్యులను చేరి్పంచిన వారితో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తారు. క్రియాశీల సభ్యులుగా ఉన్నవారే పార్టీ బూత్, మండల, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
నవంబర్ 15 నాటికి ‘యాక్టివ్ మెంబర్íÙప్’పూర్తయ్యాక, ఆ తర్వాత బూత్ కమిటీల ఎన్నిక, ఆపై మండల అధ్యక్షులు, మళ్లీ వారు జిల్లా అధ్యక్షులను, ఆ తర్వాత వారంతా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల మంది ఓటు వేయగా, ఈ ఓట్లలో 75 శాతం అంటే 50 లక్షల దాకానైనా సభ్యులుగా చేర్పించేలా ప్రయతి్నంచాలని బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సభ్యత్వ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్రపార్టీ సభ్యత్వ కార్యక్రమ కనీ్వనర్ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment