రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గాల బాహాబాహీ
రఘునాథపల్లి వద్ద ఘటన
రఘునాథపల్లి: యూత్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నారుు. సభ్యత్వ నమోదు సందర్భంగా ఆధిపత్య పోరు అగ్గిరాజేసింది. పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి రఘునాథపల్లిలో గురువారం సభ్యత్వ నమోదుకు సమాయత్తమయ్యూరు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కీసర దిలీప్‌రెడ్డి అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. వివరాలు.. హన్మకొండకు చెందిన రమాకాంత్‌రెడ్డి ఖిలాషాపురంనకు చెందిన తన వర్గీయుడు మంద రమేష్, అనుచ రులతో రఘునాథపల్లి ఆర్యవైశ్య భవన్‌లో యూత్ సభ్యత్వ నమోదు కోసమని గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాము ఇప్పటికే మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టామని, సమాచారం లేకుండా ఇక్కడ ఎలా సమావేశం పెడుతావంటూ దిలీప్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అందరి ఆమోదంతోనే సమావేశం పెట్టాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కడారి నాగేశ్వర్ కూడా పేర్కొన్నారు. కానీ రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గలేదు.
వాగ్వాదం జరగడంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పి వెళ్లారు. కొద్ది సేపటికి రమాకాంత్‌రెడ్డి తన వర్గీయులతో విలేకరులతో మాట్లాడుతుండగా దిలీప్‌వర్గీయులు తోపులాటకు దిగారు. రమాకాంత్‌రెడ్డిపై దాడిచేసి తరిమారు. రమాకాంత్‌రెడ్డి, ఆయన వర్గీయుడు ముప్పిడి శ్రవణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత ఠాణాలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో అధ్యక్షస్థానానికి మాజీ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. దిలీప్ సైతం పోటాపోటీగా సభ్యత్వాలు చేరుుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘర్షణ జరిగింది. తనను రాజకీయంగా ఎదుగకుండా కుట్ర పన్నుతున్నారని రమాకాంత్‌రెడ్డి ఆరోపించారు. కాగా, రమాకాంత్‌రెడ్డి పార్టీలో చిచ్చు పెడుతున్నాడని దిలీప్‌రెడ్డి ఆరోపించారు.
యూత్ కాంగ్రెస్‌లో తన్నులాట
Published Fri, Jan 9 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement