సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ గొడవపై అధ్యక్షుడు శివ చరణ్ స్పందించారు. ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ‘‘ఎన్నికైన వారినే ఇవాళ సమావేశానికి ఆహ్వానించాం. ఎన్నిక కానీ వారు మీటింగ్‌లోకి వచ్చి డిస్ట్రబ్ చేశారు. ఓడిపోయిన వారు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వయసుకు సంబంధించిన అంశాలన్నీ చెక్ చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించారు. బయట జరిగిన గొడవ గురించి నాకు తెలియదు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపై సమీక్ష చేసుకుంటాం’’ అని శివచరణ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment