పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్ | People lobby for Padma awards: Ramdev | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్

Published Sat, May 9 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్

పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డుల కోసం లాబీయింగ్ చేస్తారని, ఆ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. రాజకీయ పరిచయాలు ఉన్నవాళ్లకే ఆ అవార్డులు వస్తాయన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రమే ఈ అవార్డులు రావడం సాధ్యమని చెప్పారు.

పద్మభూషణ్ నుంచి పద్మశ్రీ వరకు అన్ని అవార్డులు మంచి వాళ్లకు.. వాళ్లు వాళ్లు ఆయా రంగాల్లో సాధించిన విజయాలకు అనుగుణంగా ఇస్తారనే ప్రపంచం అంతా అనుకుంటుంది గానీ, లాబీయింగ్ చేసేవాళ్లకు మాత్రమే ఇవి దక్కుతాయని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాందేవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ ఏడాది తనకు ఇవ్వజూపిన పద్మ అవార్డును రాందేవ్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement