కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 25న) పద్మ అవార్డులు (Padma Awards 2025) ప్రకటించింది. వీటిలో ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలున్నాయి. వీటిని అందుకున్నవారిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కేఎల్ కృష్ణ (విద్యా సాహిత్యం) , మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మిరియాల అప్పారావు (కళారంగం), వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించాయి. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు.
తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలు
ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli సోషల్ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'ఈసారి తెలుగువారికి ఏడు పద్మ అవార్డులు రావడం సంతోషకరం. పద్మ భూషణ్‌కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. పద్మ పురస్కారం గెల్చుకున్న తెలుగువారితో పాటు, ఇతర భారతీయులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్‌లో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్, తమిళ స్టార్ అజిత్‌ను ప్రశంసించాడు.
బేధాలు దేనికి?
ఇది కొంతమందికి అస్సలు మింగుడుపడలేదు. తెలుగువారు అని ప్రత్యేకంగా వర్ణించడం దేనికని విమర్శిస్తున్నారు. 'తెలుగువారు దేశంలో భాగం కాదా? ఎందుకని ప్రాంతాల మధ్య అడ్డుగోడ కడుతున్నారు?', 'తెలుగుప్రజలు భారతీయులు కాదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాల గురించి చర్చే లేదు. కానీ మీలాంటివాళ్లు మాత్రం ఈ అంశాన్ని బాగా వాడుకుంటారు. నార్త్ జనాలు మీ సినిమాలకు ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మనమంతా భారతీయులం అని చెప్పే ధైర్యం లేని వాళ్లకు మద్దతు దేనికి?' అని హిందీ ఆడియన్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
పుట్టిన గడ్డ తర్వాతే ఏదైనా..
ఈ ట్రోలింగ్ చూసిన తెలుగు సినీ ప్రియులు, అభిమానులు వారికి ధీటుగా రిప్లై ఇస్తున్నారు. పుట్టిన గడ్డ ఎవరికైనా తల్లితో సమానం. మొదటగా ప్రాంతం.., తర్వాతే దేశం వస్తుంది. అయినా రాజమౌళి తన ట్వీట్‌లో నార్త్, సౌత్ అని ఎక్కడా తేడా చూపించలేదు. తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డాడంతే.. మీ హాఫ్ నాలెడ్జ్‌తో ఆయన్ను విమర్శించకండి అని బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻
Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable…
Also, congratulations to all the other distinguished Telugu & other…— rajamouli ss (@ssrajamouli) January 25, 2025
చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
Comments
Please login to add a commentAdd a comment